త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi Movie | రామ్‌చరణ్ అభిమానులకు భారీ షాకిచ్చిన పెద్ది టీమ్

బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ది మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, ఏఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

J

Movies | Published On Apr 15, 2026, 6.37 pm IST

Peddi Movie | రామ్‌చరణ్ అభిమానులకు భారీ షాకిచ్చిన పెద్ది టీమ్
Advertisement

Peddi Movie | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ మూవీ ఈ సమ్మర్ వెకేషన్‌లో విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసుకుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 30న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. అంతకుముందు మార్చి 27న విడుదల చేస్తామని ప్రకటించి ఆ తర్వాత తేదీని ఏప్రిల్ 30కి మార్చారు. తాజాగా మూవీని మళ్లీ వాయిదా వేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. మరోసారి వాయిదా వేస్తూ జూన్ 2026 లో విడుదల చేస్తామని మూవీ యూనిట్ స్పష్టం చేసింది.

వాయిదాకి కారణం అదేనా?

సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కానీ ఇంకా ఒక సాంగ్ షూట్ మిగిలి ఉంది. ఆ సాంగ్ షూట్ చేయాలి. మూవీ మొత్తం ఎడిట్ కూడా చేశాం. ఔట్‌పుట్ బాగా వచ్చింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ మూవీపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగా మూవీని తీర్చిదిద్దడం కోసమే మరోసారి వాయిదా వేస్తున్నాం. టెక్నిషియన్లకు, పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌కి కావాల్సినంత సమయం ఇవ్వడం కోసమే మూవీని జూన్‌లో రిలీజ్ చేస్తున్నాం. తేదీ త్వరలోనే వెల్లడిస్తాం.. అంటూ పెద్ది టీమ్ సోషల్ మీడియాలో ప్రకటించింది.

Image

బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, ఏఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.

Advertisement

తాజావార్తలు

Advertisement