త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RamCharan – Upasana | రామ్‌చ‌ర‌ణ్ – ఉపాస‌న దంప‌తుల‌కు ‘ట్విన్స్’.. బాబు, పాప అంటూ ‘చిరు’ ట్వీట్

RamCharan - Upasana | స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్‌( RamCharan ), ఉపాస‌న( Upasana ) దంప‌తుల‌కు క‌వ‌ల పిల్ల‌లు( Twins ) జ‌న్మించారు. మొద‌టి కాన్పులో పాప‌కు జ‌న్మ‌నిచ్చిన ఈ దంప‌తులు.. రెండో కాన్పులో మాత్రం ఒక బాబు, ఒక పాప‌కు జ‌న్మ‌నిచ్చారు.

S

Movies | Published On Feb 1, 2026, 12.38 am IST

RamCharan – Upasana | రామ్‌చ‌ర‌ణ్ – ఉపాస‌న దంప‌తుల‌కు ‘ట్విన్స్’.. బాబు, పాప అంటూ ‘చిరు’ ట్వీట్
Advertisement

RamCharan - Upasana | త్రినేత్ర‌.న్యూస్ : స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్‌( RamCharan ), ఉపాస‌న( Upasana ) దంప‌తుల‌కు క‌వ‌ల పిల్ల‌లు( Twins ) జ‌న్మించారు. మొద‌టి కాన్పులో పాప‌కు జ‌న్మ‌నిచ్చిన ఈ దంప‌తులు.. రెండో కాన్పులో మాత్రం ఒక బాబు, ఒక పాప‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi )ఎక్స్ వేదిక‌గా అధికారికంగా వెల్ల‌డించారు.

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల‌కు రెండో కాన్పులో క‌వ‌ల పిల్ల‌లు జ‌న్మించారు అని మీ అంద‌రికీ చెప్పేందుకు సంతోషిస్తున్నాను.. గుండెల్లో ఏదో తెలియ‌ని సంతోషం, ఆనందం ఉప్పొంగుతుంద‌ని చిరంజీవి పేర్కొన్నారు. క‌వ‌ల‌ల్లో ఒక పాప‌, ఒక బాబు ఉన్నార‌ని తెలిపారు. ఇద్ద‌రు ప‌సిబిడ్డ‌లతో పాటు త‌ల్లి కూడా ఆరోగ్యంగా ఉంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రి ప్రార్థ‌న‌లు, ప్రేమ‌, ఆశీర్వాదాలు, శుభాకాంక్ష‌లకు తాము హృద‌య‌పూర్వ‌కంగా కృతజ్ఞ‌త‌లు తెలుపుతున్నామ‌ని చిరంజీవి పేర్కొన్నారు.

https://x.com/KChiruTweets/status/2017666595624259974

Advertisement

తాజావార్తలు

Advertisement