Jana Nayagan | జన నాయగన్‌కు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు – 13 కట్స్ – రన్‌టైమ్ రివీల్ – అసలు ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్
జననాయగన్ సినిమాకు సెన్సార్ బోర్డు ...సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా చెబుతోన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో సర్క్యులెట్ అవుతోంది. ఈ సినిమా రన్‌టైమ్, కట్స్ లాంటి వివరాలు ఇందులో కనిపిస్తున్నాయి. సెన్సార్ అడ్డంకుల నుంచి జననాయగన్‌కు క్లియరెన్స్ రావడంతో విజయ్ అభిమానులు తెగ ఖుషి అయ్యారు. కానీ ఈ సర్టిఫికెట్ వెనకున్న అసలు ట్విస్ట్ ఏంటంటే?
Jana Nayagan | జననాయగన్ సెన్సార్ సమస్యలకు ఎట్టకేలకు పుల్‌స్టాప్ పడినట్లు తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. దళపతి విజయ్ సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో సర్క్యులెట్ అవుతోంది. ఇందులో విజయ్ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. పదమూడు కట్స్ చెప్పారని, రన్ టైమ్ కూడా దాదాపు మూడు గంటల మూడు నిమిషాల వరకు ఉన్నట్లు ఈ సర్టిఫికెట్‌లో ఉంది. ఓ నెటిజన్ షేర్ చేసిన ఫొటో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది.
అభిమానుల అనందం....
సెన్సార్ సర్టిఫికెట్ చూసి దళపతి విజయ్ అభిమానులు తెగ ఖుషి అయ్యారు. ఫైనల్‌గా జననాయగన్ థియేటర్లలోకి రాబోతుండటం ఆనందంగా ఉందంటూ కామెంట్లు పెట్టారు. అయితే అది ఒరిజినల్ సర్టిఫికెట్ కాదట. లియో సెన్సార్ సర్టిఫికెట్‌లోని టైటిల్‌తో పాటు ఇతర వివరాలు మార్చేసి ఫేక్‌గా ఓ నెటిజన్ జననాయగన్ సర్టిఫికెట్‌ను క్రియేట్ చేశాడట. అది కాస్త వైరల్ కావడంతో పోస్ట్ డిలేట్ చేసిన నెటిజన్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.ఈ ఫేక్ సెన్సార్ సర్టిఫికెట్‌పై చాలా మంది ఫ్యాన్స్ రియాక్ట్ అవుతోన్నారు. నిజమని అనుకున్నామని చాలా మంది కామెంట్లు పెడుతోన్నారు. ఎమోషన్స్‌తో ఆడుకోవడం కరెక్ట్ కాదంటూ ఫైర్ అవుతోన్నారు.
తుది దశలో...
కాగా జననాయగన్ సెన్సార్ అడ్డంకులు తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఈ వారంలోనే సీబీఎఫ్‌సీ నుంచి క్లియరెన్స్ రావచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. జూలై 23న దళపతి విజయ్ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రూమర్లపై మేకర్స్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. మరోవైపు సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఓ ఈవెంట్‌లో జననాయగన్ రిలీజ్‌పై స్పందిస్తూ జూలై నెలాఖరున రాబోతున్నట్లు ప్రకటించింది.
పూజా హెగ్డే...
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహించాడు. దళపతి విజయ్‌కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మమితా బైజు ఓ కీలక పాత్రలో కనిపించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. బాలకృష్ణ హీరోగా నటించిన తెలుగు మూవీ భగవంత్ కేసరి రీమేక్‌గా జననాయగన్ రూపొందింది. దాదాపు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్‌తోకేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Thalapathy Vijay | దళపతి విజయ్ వర్సెస్ జాసన్ సంజయ్ – తండ్రీకొడుకుల బాక్సాఫీస్ ఫైట్
జులై 3, 2026

Jana Nayagan | రిలీజ్‌కు ముందే కోటి మంది చూశారట – లీకుల్లో జననాయగన్ రికార్డ్
జులై 2, 2026

Sai Pallavi | సాయిపల్లవినా .. మజాకా – షూటింగ్ మొదలుకాకముందే నెక్స్ట్ మూవీ బిజినెస్ క్లోజ్
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో సెషన్లోనూ భారీ జోష్.. కొనసాగుతున్న బుల్ ర్యాలీ..
- ●Prashant Kishor | బీజేపీ కంచుకోటపై ప్రశాంత్ కిషోర్ కన్ను.. బరిలో 'జన్ సురాజ్'.. కులమత రాజకీయాలకు చెక్ పెట్టేందుకేనా?
- ●Gangula Kamalakar | నీళ్లిడవకుంటే మళ్లీ చలో కన్నేపల్లి: మాజీ మంత్రి గంగుల కమలాకర్
- ●EPF కొత్త రూల్స్.. ఎక్కువ జీతమా? భారీ రిటైర్మెంట్ ఫండా? ఏది మంచిది?
- ●Dreame L50 Plus | డ్రిమీ ఎల్50 సిరీస్ రోబోటిక్ వ్యాక్యూమ్లు.. ఆకట్టుకునే ఫీచర్లు..
- ●Jagadish Reddy | అక్కడ బటన్ నొక్కితే తెలంగాణ మొత్తం నీళ్లొస్తయ్

Stock Markets | స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో సెషన్లోనూ భారీ జోష్.. కొనసాగుతున్న బుల్ ర్యాలీ..

Prashant Kishor | బీజేపీ కంచుకోటపై ప్రశాంత్ కిషోర్ కన్ను.. బరిలో 'జన్ సురాజ్'.. కులమత రాజకీయాలకు చెక్ పెట్టేందుకేనా?

Gangula Kamalakar | నీళ్లిడవకుంటే మళ్లీ చలో కన్నేపల్లి: మాజీ మంత్రి గంగుల కమలాకర్

EPF కొత్త రూల్స్.. ఎక్కువ జీతమా? భారీ రిటైర్మెంట్ ఫండా? ఏది మంచిది?



