త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagyashri Borse | మోహ‌న్‌లాల్ సినిమా నుంచి త‌ప్పుకున్న భాగ్య‌శ్రీ బోర్సే – ఫొటోతో రూమ‌ర్ల‌కు చెక్

మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తోన్న ఆప‌రేష‌న్ గంగ సినిమాతో భాగ్య‌శ్రీ బోర్సే మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. అయితే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో ఏర్ప‌డిన విభేదాల కార‌ణంగా ఈ సినిమా నుంచి భాగ్య‌శ్రీ త‌ప్పుకున్న‌ట్లు రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఈ రూమ‌ర్ల‌కు లెనిన్ హీరోయిన్ వెరైటీగా చెక్ పెట్టింది.

N

Movies | Published On Oct 1, 2026, 2.41 pm IST

Bhagyashri Borse | మోహ‌న్‌లాల్ సినిమా నుంచి త‌ప్పుకున్న భాగ్య‌శ్రీ బోర్సే – ఫొటోతో రూమ‌ర్ల‌కు చెక్
Advertisement

Bhagyashri Borse |  లెనిన్‌తో త‌న‌పై ప‌డిన ఐరెన్‌లెగ్ ముద్ర నుంచి బ‌య‌ట‌ప‌డింది భాగ్య‌శ్రీ బోర్సే. ఈ ముద్దుగుమ్మ‌ ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌కు ఈ సినిమాతో బ్రేక్ ప‌డింది. అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన‌ లెనిన్ బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఈ సినిమాలో అందం, ధైర్యం క‌ల‌బోసిన భార‌తి అనే ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది భాగ్య‌శ్రీ బోర్సే. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌లా కాకుండా క‌థ‌లో ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో క‌నిపించింది.

గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరం...

లెనిన్ త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తోందిభాగ్య‌శ్రీ బోర్సే. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటోన్న ఈ బ్యూటీ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకుంటోంది. హీరోయిన్‌గా ఇప్ప‌టివ‌ర‌కు తెలుగుతో పాటు త‌మిళంలో సినిమాలు చేసిన ఈ సుంద‌రి తాజాగా మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. అగ్ర న‌టుడు మోహ‌న్‌లాల్‌తో ఓ సినిమాను అంగీక‌రించింది. ఆప‌రేష‌న్ గంగ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాను ఇటీవ‌లే అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

విభేదాలు...

అయితే డేట్స్ ఇష్యూతో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో ఏర్ప‌డిన విభేదాలు కార‌ణంగా మోహ‌న్‌లాల్ సినిమా నుంచి భాగ్య‌శ్రీ బోర్సే త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌ల‌యాళ డెబ్యూ మూవీ ఛాన్స్‌ను మిస్ చేసుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో కామెంట్లు, పోస్ట్‌లు క‌నిపించాయి. ఈ రూమ‌ర్ల‌కు ఓ ఫొటోతో చెక్ పెట్టింది భాగ్య‌శ్రీ బోర్సే.

ఆశీర్వాదం...

ఆప‌రేష‌న్ గంగ షూటింగ్ సెట్స్‌లో మోహ‌న్‌లాల్‌తో క‌లిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. "మీతో క‌లిసి సినిమా చేయ‌డం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఈ సినిమా సెట్స్‌లో మీ నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను" అంటూ ఈ పోస్ట్‌కు కామెంట్‌ను జోడించింది. ఈ ఫొటోతో మ‌ల‌యాళం డెబ్యూ మూవీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వ‌స్తోన్న రూమ‌ర్ల‌కు భాగ్య‌శ్రీ బోర్సే చెక్ పెట్టింది.
ఆప‌రేష‌న్ గంగ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ విష్ణుమోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌ష్యా - ఉక్రెయిన్ వార్ సినిమాలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయ విద్యార్థుల‌ను సుర‌క్షితంగా ఇండియాకు తిరిగి తీసుకురావ‌డానికి ప్ర‌భుత్వం చేప‌ట్టిన సీక్రెట్ మిష‌న్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

 

Advertisement
Advertisement