త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amitabh Bachchan | షూటింగ్‌లో జారిపడ్డ అమితాబ్ బ‌చ్చ‌న్‌.. మోకాలికి గాయం

Amitabh Bachchan | బాలీవుడ్ న‌టుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati) షూటింగ్‌లో గాయపడ్డారు. కేబీసీకి (KBC) బిగ్‌బీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విష‌యం తెలిసిందే.

G

Movies | Published On Oct 1, 2026, 11.45 am IST

Amitabh Bachchan | షూటింగ్‌లో జారిపడ్డ అమితాబ్ బ‌చ్చ‌న్‌.. మోకాలికి గాయం
Advertisement

Amitabh Bachchan | త్రినేత్ర న్యూస్‌: బాలీవుడ్ న‌టుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati) షూటింగ్‌లో గాయపడ్డారు. కేబీసీకి (KBC) బిగ్‌బీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం 18వ సీజన్ కొన‌సాగుతున్న‌ది. ఇందులో భాగంగా తాజాగా జ‌రిగిన షూటింగ్‌లో తాను జారి పడ్డానని స్వ‌యంగా వెల్లడించారు. దీంతో త‌న మోకాలికి గాయ‌మైంద‌ని చెప్పారు.

దీంతో ఎప్ప‌టిలా నిల్చొని కాకుండా ఈ సారి కూర్చొనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. సాధార‌ణంగా ఆయ‌న‌ KBC ప్రారంభంలో స్టేజ్‌ మధ్యలో నిల్చొని కంటెస్టెంట్‌లకు ఆయన స్వాగ‌తం ప‌లుకుతారు. అయితే తన మోకాలికి గాయం కావడంతో నిలబడటానికి కొంత ఇబ్బంది ఎదుర‌వుతున్న‌ద‌ని ప్రేక్షకులకు చెప్పారు. అయితే పోటీదారులను ఆహ్వానించడానికి తాను సీట్‌ వద్దే నిలబడతాన వెల్ల‌డించారు. అభిమానులు ఎవరూ తన గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

83 ఏండ్ల వ‌య‌సులోనూ..

బిగ్ బీ వ‌య‌సు ప్ర‌స్తుతం 83 ఏండ్లు. అయినా ఏమాత్రం తీర‌క లేకుండా వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తున్నారు. ఇటీవ‌లే ‘సెక్షన్‌ 84’తో (Section 84) ప్రేక్షకులను పలకరించిన ఆయ‌న.. ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కల్కి’ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలో అమితాబ్ అశ్వ‌థామ (Ashwatthama) క్యారెక్ట‌ర్‌లో న‌టిస్టున్న విష‌యం తెలిసిందే. ఆ షూటింగ్‌ వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement