Allu Arjun | లోకేష్ కనగరాజ్ సినిమా కోసం రికార్డ్ రెమ్యూనరేషన్ – ప్రభాస్, చరణ్‌లను దాటేసిన బన్నీ
రెమ్యూనరేషన్‌లో ప్రభాస్, రామ్‌చరణ్‌లను బన్నీ దాటేయబోతున్నాడు. లోకేష్ కనగరాజ్‌తో చేయబోతున్న సినిమా కోసం బన్నీ పారితోషికం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 175 కోట్ల రెమ్యూనరేషన్‌తో లాభాల్లో 33 శాతం వాటా తీసుకోనున్నట్లు సమాచారం.
Entertainment | Published On Nov 16, 2026, 5.16 pm IST
Allu Arjun | అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది. బన్నీకి హీరోగా ఇది 23వ సినిమా. ఈ భారీ బడ్జెట్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఏఏ 23ని అనౌన్స్‌చేసి పది నెలలు దాటినా ఒక్క అప్‌డేట్ కూడా రాకపోవడంతో అల్లు అర్జున్ ఈ సినిమాను పక్కనపెట్టినట్లు వార్తలొచ్చాయి. ఈ రూమర్లను ఖండించిన లోకేష్ కనగరాజ్...అల్లు అర్జున్‌తో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
2027 ఫిబ్రవరి...
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాకా షూటింగ్ పూర్తి కాగానే లోకేష్ మూవీ సెట్స్‌లో బన్నీ అడుగుపెట్టబోతున్నాడు. 2027 ఫిబ్రవరి నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలుకానున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏఏ 23 సినిమా కోసం బన్నీ 175 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో 33 శాతం వాటా కూడా తీసుకునే ఒప్పందంపై ఈ సినిమాను అంగీకరించినట్లు సమాచారం.
ప్రభాస్, రామ్‌చరణ్...
ఈ సినిమాతో టాలీవుడ్‌లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకోనున్న హీరోగా అల్లు అర్జున్ నిలవనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. పెద్ది సినిమా కోసం కెరీర్‌లోనే అత్యధికంగా 130 కోట్లు స్వీకరించారు రామ్‌చరణ్. వీరిద్దరిని ఏఏ 23తో అల్లు అర్జున్ దాటేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.
ఈ సినిమా కోసం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా భారీగానే పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం. 75 కోట్లు స్వీకరించబోతున్నట్లు సమాచారం.
అనిరుధ్ మ్యూజిక్...
బన్నీ, లోకేష్ కనగరాజ్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kavitha | పవర్‌స్టార్‌ది వారాహి అయితే.. నాది ‘భైరవ’ యాత్ర
- ●Indian Liqueur Brands | దేశీ రుచులతో గ్లోబల్ బ్రాండ్లకు భారత లిక్కర్ కంపెనీల సవాల్!
- ●MLA Sudheer Reddy | రేవంత్ చెప్పింది నమ్మాల్నా.. ఉత్తమ్ చెప్పిందా?
- ●Kalyan Banerjee Chhath Puja Remarks | పశ్చిమ బెంగాల్ బెంగాలీలదా, లేక బీహారీలదా?
- ●Teja Sajja | సందడిగా తేజా సజ్జా ఎంగేజ్మెంట్ - కాబోయే భార్య పేరు చెప్పేసిన హనుమాన్ హీరో
- ●Silver Prices | రూ.4 లక్షల నుంచి రూ.1.69 లక్షలకు పడిపోయిన వెండి ధర.. భారీ పతనానికి కారణాలివే..

Kavitha | పవర్‌స్టార్‌ది వారాహి అయితే.. నాది ‘భైరవ’ యాత్ర

Indian Liqueur Brands | దేశీ రుచులతో గ్లోబల్ బ్రాండ్లకు భారత లిక్కర్ కంపెనీల సవాల్!

MLA Sudheer Reddy | రేవంత్ చెప్పింది నమ్మాల్నా.. ఉత్తమ్ చెప్పిందా?

Kalyan Banerjee Chhath Puja Remarks | పశ్చిమ బెంగాల్ బెంగాలీలదా, లేక బీహారీలదా?






