Medipally Satyam | అసలు పిచ్చి లేసింది హరీశ్‌రావుకే.. ఆయనకు రేవంత్ ఫోబియా పట్టుకుంది
Medipally Satyam | రేవంత్‌రెడ్డికి పిచ్చి పట్టిందని హరీశ్‌రావు అంటున్నారని.. అసలు పిచ్చి లేసింది హరీశ్‌రావుకేనని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కౌంటర్ ఇచ్చారు. ఆయనకు రేవంత్ రెడ్డి ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టిందన్నారు.
- హరీశ్‌రావు పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టింది
- మీ సలహాలు తీసుకునే నీచ స్థితిలో లేం
- మీరు దోచుకున్న రూ.1400 కోట్ల పార్టీ ఫండ్‌ను అమరవీరులు కుటుంబాలకు ఇవ్వండి
- బీఆర్ఎస్ తీరు.. హంతకులు లేచి సంతాప సభ పెట్టినట్లుంది
- హరీశ్‌రావుకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కౌంటర్
Medipally Satyam | త్రినేత్ర.న్యూస్: రేవంత్‌రెడ్డికి పిచ్చి పట్టిందని హరీశ్‌రావు అంటున్నారని.. అసలు పిచ్చి లేసింది హరీశ్‌రావుకేనని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కౌంటర్ ఇచ్చారు. ఆయనకు రేవంత్ రెడ్డి ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టిందన్నారు. హరీష్ రావు, కేటీఆర్‌లు స్పైడర్ లో విలన్లలాగ ప్రవర్తిస్తున్నారన్నారు. హంతకులు లేచి సంతాప సభ పెట్టినట్లు బీఆర్ఎస్ నాయకులు తీరుందని ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
గతంలో ఆంధ్ర సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు కూడా రెచ్చగొట్టాలని చూస్తే కుదరదు. మీరు దోచుకున్న రూ.1400 కోట్ల పార్టీ ఫండ్‌ను అమరవీరులు కుటుంబాలకు పంచండి. మీరు కాళేశ్వరంలో ఎంత దోచుకున్నారో ప్రజలకు అర్థమైంది. జేబులు నింపుకోవాలనే కక్కుర్తితో కాళేశ్వరం కట్టారు. తొందరలోనే తెలంగాణ ప్రజలు మీపై తిరగబడే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్ల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం కూలేశ్వరం అయింది అని విమర్శించారు.
మీలా దోచుకోలేం.. దాచుకోలేం..
తెలంగాణ పట్ల మాకు కమిట్మెంట్ ఉంది. మా ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా పని చేస్తున్నారు. మీ సలహాలు తీసుకునే నీచ స్థితిలో కాంగ్రెస్ లేదు. మీలా మేం దోచుకోలేం, దాచుకోలేం. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి 11 నెలలు అవుతుంది. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నారు అని మేడిపల్లి సత్యం వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..
- ●Sreeleela | సోషల్ మీడియాలో శ్రీలీల రేంజ్ మామూలుగా లేదుగా.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు ఎంత డిమాండ్ చేస్తుందంటే?
- ●Sridhar Babu | తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేలా చూడండి
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు లాభం..
- ●Mahesh Kumar Goud | హరీశ్‌రావు మా పార్టీలోకి వస్తానంటే చర్చిస్తాం : మహేశ్ కుమార్ గౌడ్

Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల

WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..

Sreeleela | సోషల్ మీడియాలో శ్రీలీల రేంజ్ మామూలుగా లేదుగా.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు ఎంత డిమాండ్ చేస్తుందంటే?

Sridhar Babu | తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేలా చూడండి




