Abhishek Sharma | అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ఆ పోస్టులు తొలగించేందుకు ఉత్తర్వులిస్తామన్న కోర్టు
Abhishek Sharma | టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. ఏఐ జెనరేటెడ్ కంటెంట్, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ఉన్న అభ్యంతరకర పోస్టులను తొలగించించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
Abhishek Sharma | టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. ఏఐ జెనరేటెడ్ కంటెంట్, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ఉన్న అభ్యంతరకర పోస్టులను తొలగించించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ కేసులో ప్రతివాదులకు కోర్టు సమన్లు జారీ చేసింది. అభిషేక్ శర్మ దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతోంది. అభిషేక్ శర్మ తరఫు న్యాయవాది సంబంధిత యూఆర్ఎల్‌ల (URL) వివరాలతో కోర్టులో దాఖలు చేశారు. ఇప్పటికే కొన్ని పోస్టులను తొలగించినప్పటికీ.. క్రికెటర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న రెండు పోస్టులు ఇప్పటికీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అనుమతి లేకుండానే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు క్రికెటర్ ఫొటోలు వాడుకొని బిజినెస్‌కు ఉపయోగించుకున్నాయని. వాటికి సంబంధించిన కంటెంట్‌ణు సైతం ఇంకా తొలగించలేదని తెలిపారు. విచారణ సందర్భంగా మెటా, అమెజాన్ సంస్థల తరఫు న్యాయవాదులు అభిషేక్ శర్మ ప్రతిష్ఠకు భంగం కలిగించే పోస్టులను తమ వేదికల నుంచి తొలగిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ నవంబర్ 17న జరగనుంది. అయితే, కేసు తొలి విచారణ సందర్భంగా అభ్యంతరకర యూఆర్ఎల్‌లకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను అభిషేక్ శర్మ తన పిటిషన్‌కు జత చేయలేదు. దీంతో సంబంధిత పత్రాలను పరిశీలించకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం సంబంధిత స్క్రీన్‌షాట్‌లతో ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేయాలని అభిషేక్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!






