Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీకి వెరైటీ టైటిల్ ఫిక్స్ – నాలుగు భాషల్లో రిలీజ్
బుట్టబొమ్మ పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీకి శ్రీశ్రీ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఈ ప్రేమకథా చిత్రానికి రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు.
Entertainment | Published On Jul 10, 2026, 2.30 pm IST
Pooja Hegde | నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఓ లవ్‌స్టోరీతో బుట్టబొమ్మ పూజా హెగ్డే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సినిమాకు శ్రీ శ్రీ అనే పేరును ఖరారు చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే యూనిఫామ్‌ను పోలిన ఒకే కలర్ డ్రెస్‌లో కనిపిస్తున్నారు. ఓ గోడపై కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ సింపుల్ లుక్‌లో వీరిద్దరు ఉండటం ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆసక్తిని పంచుతోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీమతి....శ్రీనివాస్...
శ్రీ శ్రీ మూవీకి రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్నాడు. యూనిక్ లవ్‌స్టోరీగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. హీరోహీరోయిన్ల పేర్లలోని తొలి ఆక్షరాలను సూచిస్తూ ఈ సినిమా టైటిల్ కన్ఫామ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో శ్రీమతిగా పూజా హెగ్డే, శ్రీనివాస్ అనే పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు చెబుతోన్నారు.
నాలుగు భాషల్లో...
శ్రీశ్రీ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుతున్నారు. ఈ ఏడాదే ఈ తెలుగు మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీశ్రీ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తోన్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకే సారి రిలీజ్ కాబోతుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న 41వ మూవీ ఇది.
జననాయగన్...కాంచన...
ప్రస్తుతం శ్రీశ్రీతో పాటు తమిళంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన జననాయగన్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. తమిళనాడు సీఎం దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా జూలై 24న థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. విజయ్ చివరి మూవీ కావడంతో దక్షిణాదిన జననాయగన్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. జననాయగన్‌తో పాటు కాంచన 4లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ హారర్ కామెడీ మూవీలో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jana Nayagan | రిలీజ్‌కు ముందే కోటి మంది చూశారట – లీకుల్లో జననాయగన్ రికార్డ్
జులై 2, 2026

Pooja Hegde | పవన్ కళ్యాణ్ ఓజీ యూనివర్స్‌లో బుట్టబొమ్మ – అప్పుడు ఛాన్స్ మిస్ – ఇప్పుడు జాక్‌పాట్
జూన్ 28, 2026

Pooja Hegde | ఓటీటీలోకి పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ – ఒకే సారి ప్రియురాలు .. భార్య ప్రెగ్నెంట్ అయితే!
జూన్ 25, 2026
తాజావార్తలు
- ●MP Chamala Kiran Kumar Reddy | తుంగతుర్తిది మా ఇంటి సమస్య.. మాకేం పంచాయితీల్లేవ్
- ●Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్చుకోవచ్చా.. రూల్స్ ఎలా ఉన్నాయి..
- ●CM Vijay | కరూర్ ఘటన పక్కా కుట్ర.. సిగ్గులేకుండా నాపై నిందలేశారు : సీఎం విజయ్
- ●Medipally Satyam | అసలు పిచ్చి లేసింది హరీశ్‌రావుకే.. ఆయనకు రేవంత్ ఫోబియా పట్టుకుంది
- ●ChatGPT Work | చాట్ జీపీటీ వర్క్ మోడల్ వచ్చేసింది.. ఇక గంటల తరబడి ఏఐని వాడవచ్చు..
- ●Vakiti Srihari | రూ. 47.03 కోట్లతో హోల్ సేల్ చేపల మార్కెట్

MP Chamala Kiran Kumar Reddy | తుంగతుర్తిది మా ఇంటి సమస్య.. మాకేం పంచాయితీల్లేవ్

Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్చుకోవచ్చా.. రూల్స్ ఎలా ఉన్నాయి..

CM Vijay | కరూర్ ఘటన పక్కా కుట్ర.. సిగ్గులేకుండా నాపై నిందలేశారు : సీఎం విజయ్

Medipally Satyam | అసలు పిచ్చి లేసింది హరీశ్‌రావుకే.. ఆయనకు రేవంత్ ఫోబియా పట్టుకుంది



