త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oscars 2026 | ఆస్కార్‌ నామినేష‌న్స్‌లో ఇండియ‌న్ సినిమాల‌కు నిరాశ – హార‌ర్ మూవీ సిన్న‌ర్స్ రికార్డ్‌

ఆస్కార్ అవార్డుల నామినేష‌న్స్‌లో ఇండియ‌న్ సినిమాల‌కు నిరాశే ఎదురైంది. బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ కేట‌గిరీలో రెండు రౌండ్ల‌ను దాటిన హోమ్‌బౌండ్ తుది నామినేష‌న్స్‌లో చోటు ద‌క్కించుకోలేదు. హాలీవుడ్ మూవీ సిన్న‌ర్స్ ప‌ద‌హారు నామినేష‌న్ల‌తో రికార్డు క్రియేట్ చేసింది.

N

Movies | Published On Jan 22, 2026, 10.12 pm IST

Oscars 2026 | ఆస్కార్‌ నామినేష‌న్స్‌లో ఇండియ‌న్ సినిమాల‌కు నిరాశ – హార‌ర్ మూవీ సిన్న‌ర్స్ రికార్డ్‌
Advertisement

Oscars 2026 |ఆస్కార్ నామినేష‌న్స్‌లో ఇండియ‌న్ సినిమా హోమ్‌బౌండ్‌కు నిరాశే ఎదురైంది. తుది నామినేష‌న్స్‌లో ఈ మూవీ చోటు ద‌క్కించుకోలేక‌పోయింది. ఆస్కార్స్ 2026 ఫైన‌ల్‌ నామినేష‌న్ల లిస్ట్‌ను అకాడ‌మీ క‌మిటీ గురువారం రిలీజ్ చేసింది. ఇందులో హాలీవుడ్ సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ మూవీ సిన్న‌ర్స్ ప‌ద‌హారు నామినేష‌న్ల‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఆస్కార్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక నామినేష‌న్లు పొందిన మూవీగా నిలిచింది. గ‌తంలో టైటానిక్‌, లా లా ల్యాండ్‌, ఆల్ ఎబౌట్ ఈవ్ అత్య‌ధికంగా ప‌ధ్నాలుగు నామినేష‌న్ల‌ను ద‌క్కించుకున్నాయి. ఆ సినిమాల‌ రికార్డును సిన్న‌ర్స్ అధిగ‌మించింది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ యాక్ట‌ర్‌తో ప‌లు విభాగాల్లో సిన్న‌ర్స్ నామినేట్ అయ్యింది. సిన్న‌ర్స్ త‌ర్వాత వ‌న్ బ్యాటిల్ ఆఫ్ట‌ర్ అన‌ద‌ర్ 13 నామినేష‌న్ల‌తో త‌ర్వాతి ప్లేస్‌లో నిలిచింది. ఫ్రాంకిన్‌స్ట‌న్, మార్టీ సుప్రీం త‌లో తొమ్మిది నామినేష‌న్ల‌ను ద‌క్కించుకున్నాయి.

హోమ్‌బౌండ్‌కు నిరాశ‌...

బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ కేట‌గిరీలో ఇండియా నుంచి ఆశ‌లు రేపిన హోమ్‌బౌండ్‌కు నిరాశే మిగిలింది. రెండు రౌండ్ల‌ను దాటిన ఈ మూవీ ఫైన‌ల్ నామినేష‌న్స్‌లో ఫైన‌ల్ లో మాత్రం చోటు ద‌క్కించుకోలేక‌పోయింది. బెస్ట్ పిక్చ‌ర్ కేట‌గిరీలో కాంతార ఛాప్ట‌ర్ వ‌న్‌, మ‌హావ‌తార్ న‌ర‌సింహా, టూరిస్ట్ ఫ్యామిలీ, త‌న్వీ ది గ్రేట్‌తో పాటు మ‌రికొన్ని ఇండియ‌న్ సినిమాలో పోటీ ప‌డ్డాయి. కానీ ఏవి కూడా షార్ట్ లిస్ట్ కాలేక‌పోయాయి.

ప‌ది సినిమాలు....

ఈ సారి బెస్ట్ పిక్చ‌ర్ కేట‌గిరీలో ప‌ది సినిమాలు పోటీప‌డ‌బోతున్నాయి. సిన్నర్స్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ తో పాటు మార్టీ సుప్రీం, ఫ్రాంకెన్‌స్టైయిన్, హ్యామ్నెట్, ఎఫ్1, ది సీక్రెట్ ఏజెంట్, సెంటిమెంటల్ వాల్యూ, ట్రైన్ డ్రీమ్స్, బుగోనియా రేసులో నిలిచాయి.
బెస్ట్ యాక్ట‌ర్ రేసులో మైఖేల్ బి. జార్డన్ (సిన్నర్స్), లియోనార్డో డికాప్రియో (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), తిమోతీ చాలమెట్ (మార్టీ సుప్రీం), ఈథన్ హాక్, వాగ్నర్ మౌరా ఉన్నారు. మార్చి 15న లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌నున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement