James Bond | కొత్త జేమ్స్‌బాండ్ ఇతడే – ఒక్కో సినిమాకు 235కోట్ల రెమ్యూనరేషన్
డానియల్ క్రేగ్ తర్వాత తదుపరి జేమ్స్‌బాండ్ ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. ఈ ఐకానిక్ క్యారెక్టర్‌లో బ్రిటన్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ కనిపించబోతున్నాడు. ఈ ఏడాది రిలీజైన ది ఒడిస్సీ సినిమాలో విలన్ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్ నటించాడు.
Entertainment | Published On Nov 17, 2026, 4.13 pm IST
James Bond | జేమ్స్‌బాండ్‌సిరీస్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, అదిరిపోయే విజువల్స్, భారీతనానికి జేమ్స్‌బాండ్ సినిమాలు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాయి. జేమ్స్‌బాండ్ క్యారెక్టర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ పాత్రను పోషించే అవకాశం కోసం స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తుంటారు. జేమ్స్‌బాండ్‌సిరీస్‌లో ఇప్పటివరకు 25 సినిమాలు వచ్చాయి. ఈ సిరీస్‌లో చివరగా 2021లో నో టైమ్ టూ డై సినిమా రిలీజైంది. ఇందులో డానియల్ క్రేగ్ జేమ్స్‌బాండ్‌గా కనిపించాడు.
సస్పెన్స్‌కు తెర...
నో టైమ్ టూ డై రిలీజై ఐదేళ్లు దాటినా జేమ్స్‌బాండ్ సిరీస్ నుంచి మరో సినిమా రాలేదు. తదుపరి జేమ్స్‌బాండ్ ఎవరన్నది ఈ స్పై యాక్షన్ సినిమాలను నిర్మించే అమెజాన్ ఎంజీఎం స్టూడియో ప్రకటించలేదు. ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కు తెరపడింది. డానియల్ క్రేగ్ తర్వాత ఈ ఐకానిక్ క్యారెక్టర్‌లో రాబర్ట్ ప్యాటిన్సన్ కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది.
ఒడిస్సీలో విలన్...
ఈ ఏడాది రిలీజైన క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ సినిమాలో రాబర్ట్ ప్యాటిన్సన్ విలన్ పాత్రలో కనిపించాడు. ది బ్యాట్‌మాన్, ట్విలైట్ సాగా, గుడ్ టైమ్, లైట్‌హౌజ్, కింగ్, టెనెట్, మిక్కీ 17 వంటి హాలీవుడ్ సినిమాలతో నటుడిగా రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రతిభను చాటుకున్నాడు.
రికార్డ్ రెమ్యూనరేషన్...
జేమ్స్‌బాండ్‌సిరీస్‌లో నెక్స్ట్ మూవీ 2028లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు డెనిస్ విల్‌న్యూవ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈజేమ్స్‌బాండ్ మూవీ కోసం రాబర్ట్ ప్యాటిన్సన్ రికార్డ్ స్థాయిలో దాదాపు 235 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం. మొత్తం మూడు సినిమాల్లో జేమ్స్‌బాండ్‌గా కనిపించేలా రాబర్ట్ ప్యాటిన్సన్‌తో అమెజాన్ ఎంజీఎం స్టూడియో అతడితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం
- ●AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- ●Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం

HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!






