త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | హాలీవుడ్ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా ప్రియాంక చోప్రా…

హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా మ‌ళ్లీ బిజీ అవుతోంది. ఇటీవ‌లే ది బ్ల‌ఫ్ మూవీతో పాటు సిటాడెల్ వెబ్‌సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన గ్లోబ‌ల్ స్టార్ తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌ను అంగీక‌రించింది. రీసెట్ పేరుతో ఓ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా చేయ‌బోతుంది. ఈ హాలీవుడ్ మూవీకి ప్రియాంక ప్రొడ్యూస‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ది.

N

Entertainment | Published On May 7, 2026, 5.35 pm IST

Priyanka Chopra | హాలీవుడ్ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా ప్రియాంక చోప్రా…
Advertisement

Priyanka Chopra |  గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో మ‌ళ్లీ బిజీ అవుతోంది. ది బ్ల‌ఫ్ మూవీతో పాటు సిటాడెల్ సీజ‌న్ 2 వెబ్‌సిరీస్‌తోఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది గ్లోబ‌ల్ స్టార్‌. ఈ రెండింటిలో యాక్ష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌తో అద‌ర‌గొట్టింది. తాజాగా ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో మ‌రో బంఫ‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్లు స‌మాచారం.

టాప్ హీరో...

హాలీవుడ్‌ టాప్ హీరో ఓర్లాండో బ్లూమ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ది. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను గురువారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ హాలీవుడ్ మూవీకి రీసెట్ అనే టైటిల్‌కు ఖ‌రారు చేశారు.
వైల్డ్ ఫ్ల‌వ‌ర్ ఫేమ్ మాట్ స్మ‌క్ల‌ర్ ద‌ర్శ‌క‌త్వం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఆగ‌స్ట్ నుంచి సెట్స్‌పైకి రాబోతుంద‌ట‌. రీసెట్‌లో హీరోహీరోయిన్లుగా న‌టిస్తూనే ఈ సినిమాను ప్రియాంక చోప్రా, ఓర్లాండో బ్లూమ్ స్వ‌యంగా నిర్మించ‌బోతున్నారు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాతో హాలీవుడ్‌లో ఫేమ‌స్ అయ్యాడు ఓర్లాండ్ బ్లూమ్‌. హెవెన్‌, పైరెట్స్ ఆఫ్ ది క‌రేబియ‌న్‌, ఎవ‌రెస్ట్‌, ది అవుట్ పోస్ట్‌తో పాటు మ‌రికొన్ని సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించాడు.

అప‌రిచితుడితో ప్రేమాయ‌ణం...

రీసెట్ సినిమాకు జోర్డాన్ రాలిన్స్ క‌థ‌ను అందించ‌బోతున్నారు. అనుకోకుండా ఓ మ‌హిళ ద‌ట్ట‌మైన అడ‌వి ప్రాంతంలో చిక్కుకుపోతుంది. తాను అక్క‌డికి ఎలా వ‌చ్చింది ఆమెకు గుర్తు రాదు. ఆ అడ‌వి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఓ అప‌రిచిత వ్య‌క్తి ఆమెకు తార‌స‌ప‌డ‌తాడు. మొద‌ట ఆ అప‌రిచిత వ్య‌క్తిని న‌మ్మ‌ని ఆ మ‌హిళ మ‌రో దారి లేక అత‌డి సాయాన్నే కోరుతుంది. ఆ త‌ర్వాత ఏమైంది. ఆ అడ‌వి నుంచి ఆమె బ‌య‌ట‌ప‌డిందా? ఈ ప్ర‌యాణంలో ఆ అప‌రిచిత వ్య‌క్తి గురించి ఆమె తెలుసుకున్న నిజాలేమిట‌నే అంశాల‌తో ఈ థ్రిల్ల‌ర్ మూవీ సాగ‌నుంద‌ట‌. స్టార్టింగ్ నుంచి చివ‌రి వ‌ర‌కు ఊహించిన మ‌లుపుల‌తో సాగుతుంద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు.

నేష‌న‌ల్ అవార్డ్స్‌...

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతోన్న టైమ్‌లోనే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతో ప‌ర్పుల్ పెబెల్ పిక్చ‌ర్స్ పేరుతో ఓ బ్యాన‌ర్‌ను స్థాపించింది. ఈ బ్యాన‌ర్‌పై ప్రియాంక నిర్మించిన వెంటిలేట‌ర్‌, పాని వంటి సినిమాలు నేష‌న‌ల్ అవార్డుల‌ను అందుకున్నాయి.

రెండు సినిమాలు...

ఇటీవ‌ల రిలీజైన హాలీవుడ్ మూవీ ది బ్ల‌ఫ్‌కు కూడా ప్రియాంక చోప్రా ఓ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది. అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ మూవీ ఓటీటీలో ట్రెండింగ్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది రీసెట్‌తో పాటు హాలీవుడ్‌లో మ‌రో రెండు సినిమాల‌ను అంగీక‌రించింద‌ట ప్రియాంక చోప్రా.

వార‌ణాసితో రీఎంట్రీ...

మ‌హేష్ బాబు వార‌ణాసి సినిమాతో ప్రియాంక చోప్రా ఇండియ‌న్ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. టైమ్ ట్రావెల్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో మందాకిని అనే పాత్ర‌లో ప్రియాంక చోప్రా క‌నిపించ‌బోతున్న‌ది. 2027 ఏప్రిల్ 7న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

 

Advertisement
Advertisement