Bengaluru Techie Couple Suicide | బెంగళూరులో సిద్ధిపేటకు చెందిన టెకీ జంట ఆత్మహత్య : భర్త ఉరేసుకోవడంతో 17వ అంతస్తు నుంచి దూకిన భార్య
బెంగళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన టెక్కీ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త మృతదేహాన్ని చూసి తట్టుకోలేక భార్య 17వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
Bengaluru Techie Couple Suicide | త్రినేత్ర.న్యూస్ : ఐటీ సిటీ బెంగళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్త ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషాదాన్ని కళ్లారా చూసి తట్టుకోలేక భార్య అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన భాను చందర్ రెడ్డి కుంట (32), అతడి భార్య బీబీ షాజియా సిరాజ్ (31) బెంగళూరులో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. షాజియా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ 'ఐబీఎం' (IBM)లో ఉద్యోగిని. సోమవారం నాడు భాను చందర్ రెడ్డి తన అపార్ట్‌మెంట్‌లోని ఓ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చాలా సేపటి వరకూ గది తలుపులు మూసి ఉండటంతో.. భార్య షాజియా ఎంతసేపు తలుపు తట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కంగారు పడిన ఆమె వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. వారంతా కలిసి బలవంతంగా తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. భాను చందర్ రెడ్డి ఉరివేసుకుని విగతజీవుడై కనిపించాడు.
ఆ దృశ్యాన్ని చూసి తీవ్ర ఆవేదనకు లోనైన షాజియా కన్నీరుమున్నీరుగా విలపించింది. భర్త చనిపోయాడన్న బాధను జీర్ణించుకోలేక, కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆమె అదే అపార్ట్‌మెంట్‌లోని 17వ అంతస్తు పైనుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది.
ఒకే రోజు కొద్ది నిమిషాల వ్యవధిలోనే దంపతులు ఇద్దరూ మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. తెలంగాణలో ఉంటున్న బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెండు వేర్వేరు అసహజ మరణాల (Unnatural deaths) కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్ట్‌మార్టం నివేదికల కోసం ఎదురుచూస్తున్నామని.. అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి లాంటివి ఏమైనా ఈ ఆత్మహత్యలకు కారణమా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు





