Sugar Free Mithai | షుగర్ ఫ్రీ స్వీట్లు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?
Sugar Free Mithai | షుగర్ ఫ్రీ మిఠాయిలు తినడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే చక్కెర లేదనే కారణంతో వాటిని ఆరోగ్యకరమైనవిగా భావించకూడదు. వాటిలో ఉండే కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, క్యాలరీలు కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఎంత పరిమాణంలో తింటున్నామనేది కీలకం.
Sugar Free Mithai | షుగర్ ఫ్రీ మిఠాయిలు తినడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే చక్కెర లేదనే కారణంతో వాటిని ఆరోగ్యకరమైనవిగా భావించకూడదు. వాటిలో ఉండే కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, క్యాలరీలు కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఎంత పరిమాణంలో తింటున్నామనేది కీలకం.
షుగర్ ఫ్రీ స్వీట్ల వెనుక అసలు నిజం..
డయాబెటిస్ ఉన్నవారు స్వీట్లు తినాలనుకున్నప్పుడు సాధారణ మిఠాయిలకు బదులుగా షుగర్ ఫ్రీ మిఠాయిలను ఎంచుకుంటుంటారు. అయితే షుగర్ ఫ్రీ అని రాసి ఉన్నంత మాత్రాన అవి పూర్తిగా సురక్షితమైనవని చెప్పలేమని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు షుగర్ ఫ్రీ కాజు కట్లీలో జీడిపప్పు, అందులోని కొవ్వుల కారణంగా అధిక క్యాలరీలు ఉంటాయి. జాండ్రా హెల్త్‌కేర్‌కు చెందిన డయాబెటిస్, ఊబకాయ నిపుణుడు డాక్టర్ రాజీవ్ కోవిల్ మాట్లాడుతూ.. షుగర్ ఫ్రీ అంటే క్యాలరీలు లేవని, కార్బొహైడ్రేట్లు లేవని లేదా డయాబెటిస్ ఉన్నవారికి పూర్తిగా అనుకూలమని అర్థం కాదని స్పష్టం చేశారు. అందువల్ల ప్యాకెట్‌పై ఉండే పోషక విలువలను పరిశీలించడం అవసరం. ఒకే పరిమాణంలోని సాధారణ మిఠాయి, షుగర్ ఫ్రీ మిఠాయిల్లో మొత్తం కార్బొహైడ్రేట్లు, క్యాలరీలను పోల్చి చూడాలి. ప్యాకెట్లలో సర్వింగ్ పరిమాణాలు వేర్వేరుగా ఉంటే 100 గ్రాములకు ఉన్న పోషక విలువలను పరిశీలించాలి. మొత్తం కార్బొహైడ్రేట్లలో చక్కెరలతోపాటు స్టార్చ్ కూడా ఉంటుంది కాబట్టి చక్కెర శాతం ఒక్కటే చూసి నిర్ణయం తీసుకోకూడదు.
ఏమేం పదార్థాలు ఉంటాయి..?
గ్లెనీగిల్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ స్నేహా కొఠారి తెలిపిన వివరాల ప్రకారం.. మైదా, ఖోవా, కండెన్స్డ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్ వంటి పదార్థాలు మిఠాయిలలో కార్బొహైడ్రేట్లను పెంచుతాయి. నెయ్యి, ఇతర కొవ్వులు క్యాలరీలను పెంచుతాయి. అలాగే మిఠాయిల తయారీలో స్టీవియా, సుక్రలోజ్, మాల్టిటాల్ వంటి స్వీటెనర్లను ఉపయోగిస్తారు. వీటిలో మాల్టిటాల్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచే అవకాశం ఉంటుందని డాక్టర్ రాజీవ్ కోవిల్ తెలిపారు. కొన్ని షుగర్ ఆల్కహాల్స్‌ను అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి షుగర్ ఫ్రీ మిఠాయిల్లో ఏ స్వీటెనర్ ఉపయోగించారో పదార్థాల జాబితాలో తప్పనిసరిగా పరిశీలించాలి.
జాగ్రత్తగా ఉండాల్సిందే..
మిఠాయి ఏదైనా పరిమాణం విషయంలో జాగ్రత్త అవసరం. పండుగల సమయంలో షుగర్ ఫ్రీ మిఠాయిలు తినేటప్పుడు ప్యాకెట్‌పై పేర్కొన్న ఒక సర్వింగ్ పరిమాణాన్ని గమనించాలి. ఒక ముక్కకు సంబంధించిన పోషక విలువలు ఇచ్చి ఉంటే రెండు ముక్కలు తిన్నప్పుడు కార్బొహైడ్రేట్లు, క్యాలరీలు కూడా రెట్టింపు అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారు వైద్యులు సూచించిన మందులను యథావిధిగా తీసుకోవడంతోపాటు, తమ సాధారణ రక్తంలో గ్లూకోజ్ పరీక్షల విధానాన్ని కొనసాగించాలని డాక్టర్ స్నేహా కొఠారి సూచించారు. ఒకే రకమైన రెండు మిఠాయిల్లో ఏది ఎంచుకోవాలనే సందేహం ఉంటే, తాము నిజంగా తినబోయే పరిమాణంలో కార్బొహైడ్రేట్లు, క్యాలరీలను పోల్చి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

దీపావళి స్వీట్లలో ఆరోగ్యానికి ఏది మేలు? ఏవి పరిమితంగా తినాలి?
నవంబర్ 7, 2026

Veeramachineni Ramakrishna | వీఆర్కే డైట్ సృష్టికర్త.. వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు
సెప్టెంబర్ 30, 2026

Type 2 Diabetes | డయాబెటిస్ ఉన్న మహిళలకు మానసిక ఆరోగ్య సమస్యల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
- ●TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!
- ●Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
- ●Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు

Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక



