Veeramachineni Ramakrishna | వీఆర్‌కే డైట్ సృష్టికర్త.. వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు
Veeramachineni Ramakrishna | వీఆర్‌కే డైట్ (VRK Diet), వీరమాచినేని డైట్ పేరుతో చాలా మందికి సుపరిచితుడైన వీరమాచినేని రామకృష్ణపై (Veeramachineni Ramakrishna) క్రిమినల్ కేసు నమోదైంది.
Veeramachineni Ramakrishna | త్రినేత్ర న్యూస్: వీఆర్‌కే డైట్ (VRK Diet), వీరమాచినేని డైట్ పేరుతో చాలా మందికి సుపరిచితుడైన వీరమాచినేని రామకృష్ణపై (Veeramachineni Ramakrishna) క్రిమినల్ కేసు నమోదైంది. రామకృష్ణ డైట్ పాటించి అస్వస్థతకు గురైనట్లు హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. మధుమేహంతో బాధపడుతున్న తనకు.. ఇన్సులిన్ వాడకుండా డైట్ పాటించాలని సూచించారని.. అయితే, డైట్ తీసుకున్న రెండు రోజుల్లోనే తీవ్ర అనార్యోగానికి గురైనట్లు అందులో పేర్కొన్నారు. దీంతో రామకృష్ణతోపాటు డాక్టర్ కోటేశ్వరరావుపై సైబరాబాద్ పోలీసులు ఫేక్ డాక్టర్, మోసం ఆరోపణలపై కేసు నమోదుచేశారు.
నిర్మల్ (Nirmal) జిల్లాకు చెందిన 30 ఏండ్ల న్యాయ విద్యార్థి (Law Student).. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతూ ఇన్సులిన్ తీసుకుంటున్నారు. సామాజిక మాధ్యామాల్లో వీఆర్‌కే డైట్‌తో మధుమేహాన్ని నయం చేస్తామనే ప్రకటన చూసి సంప్రదించారు. రూ.26 వేలు చెల్లించిన అతడు.. వీఆర్‌కే చెప్పిన డైట్‌ను ఈ నెల 12న ప్రారంభించారు. అయితే ఈ నెల 14న తీవ్ర డీహైడ్రేషన్‌కు (Dehydration) గురవడంతో కుటుంబ సభ్యులు ఓ దవాఖానలో చేర్చారు. అక్కడ చికిత్స నిమిత్తం రూ.58 వేలకుపైగా బిల్ అయింది. దీంతో బాధితుడు ఈ నెల రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీఆర్‌కే డైట్‌తో టైప్-1 డయాబెటిస్ (Diabetes) నయం అవుతుందని ప్రచారం చేశారని, ఇన్సులిన్ తీసుకోవడం ఆపాలని తనకు సూచించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్సులిన్ (Insulin) ఆపిన రెండు రోజులకే తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని, డయాబెటిక్ కీటో ఆసిడోసిస్, తీవ్రమైన డీహైడ్రేషన్‌తో దవాఖానలో చేరాల్సి వచ్చిందని తెలిపారు. సప్లిమెంట్లు, ఇతర సేవల కోసం రూ.26 వేల చెల్లించినట్లు చెప్పారు. దీంతో మోసం, ప్రాణాలకు ముప్పు కలిగించడం, క్రిమినల్ కుట్ర తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద కూడా కేసు ఫైల్ చేశారు. కాగా, తనకు పరిహారం చెల్లించాలంటూ బాధితుడు నాంపల్లి వినియోగదారుల కోర్టును కూడా ఆశ్రయించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●HCU | హెచ్‌సీయూపై ఎస్ఎఫ్ఐ జెండా.. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా దిల్షాదా విజయం
- ●Donald Trump | AI కాదు.. SI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మార్చేసిన ట్రంప్
- ●Lava Shark 2 Pro 5G | భారీ బ్యాటరీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బడ్జెట్ ఫోన్.. ప్రత్యేక ఏఐ కూడా..
- ●Emergency Landing | టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- ●Baby Sold | 48 గంటల్లోనే మూడింతలైన ధర.. నెల వయసున్న బాబును రూ.1.20 లక్షలకు కొని.. రూ.3.50 లక్షలకు అమ్మేశారు
- ●Stock Markets | ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెరిగిన చమురు ధరలు..

HCU | హెచ్‌సీయూపై ఎస్ఎఫ్ఐ జెండా.. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా దిల్షాదా విజయం

Donald Trump | AI కాదు.. SI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మార్చేసిన ట్రంప్

Lava Shark 2 Pro 5G | భారీ బ్యాటరీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బడ్జెట్ ఫోన్.. ప్రత్యేక ఏఐ కూడా..

Emergency Landing | టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్






