Type 2 Diabetes | డయాబెటిస్ ఉన్న మహిళలకు మానసిక ఆరోగ్య సమస్యల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Type 2 Diabetes | టైప్-2 డయాబెటిస్ నిర్ధారణ తర్వాత మహిళలు మానసిక ఆరోగ్య సమస్యలకు, పురుషులు గుండె, మూత్రపిండ సంబంధిత సమస్యలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. యూకేలోని క్వీన్ మేరీ యూనివర్సిటీ సహా పలు సంస్థల పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో మధుమేహం తర్వాత మహిళలు, పురుషుల్లో అనారోగ్య సమస్యలు ఏర్పడే తీరులో గణనీయమైన తేడాలు ఉన్నట్లు వెల్లడైంది.
Type 2 Diabetes | టైప్-2 డయాబెటిస్ నిర్ధారణ తర్వాత మహిళలు మానసిక ఆరోగ్య సమస్యలకు, పురుషులు గుండె, మూత్రపిండ సంబంధిత సమస్యలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. యూకేలోని క్వీన్ మేరీ యూనివర్సిటీ సహా పలు సంస్థల పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో మధుమేహం తర్వాత మహిళలు, పురుషుల్లో అనారోగ్య సమస్యలు ఏర్పడే తీరులో గణనీయమైన తేడాలు ఉన్నట్లు వెల్లడైంది. పీఎల్‌ఓఎస్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో 2010 నుంచి 2020 మధ్యకాలంలో టైప్-2 డయాబెటిస్ బారినపడిన యూకేకు చెందిన 28,720 మంది పురుషులు, మహిళల ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. మధుమేహం నిర్ధారణ అయిన తర్వాతి సంవత్సరాల్లో వీరిలో 39 శాతం మందికి కనీసం ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య ఎదురైనట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఆ సమస్య ఏర్పడిన సమయం, దాని తీవ్రత, తదుపరి ఆరోగ్య పరిణామాలు లింగాన్ని బట్టి మారినట్లు తెలిపారు.
మహిళలకు మానసిక ఆరోగ్య సమస్యలు..
మహిళల్లో మధుమేహం తర్వాత మానసిక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. మహిళల్లో 8.1 శాతం మందికి మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురుకాగా, పురుషుల్లో ఈ సంఖ్య 5.3 శాతంగా ఉంది. అలాగే మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యల పయనం చివరకు మరణానికి దారితీసే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మరోవైపు పురుషుల్లో హృదయ సంబంధిత వ్యాధులు, చివరి దశ మూత్రపిండ వ్యాధి, రక్తపోటు వంటి సమస్యలు ఎక్కువగా కనిపించాయి. పురుషుల్లో 8.4 శాతం మందికి హృదయ సంబంధిత వ్యాధులు ఎదురుకాగా, మహిళల్లో ఈ సంఖ్య 5.3 శాతంగా నమోదైంది. అంతేకాకుండా పురుషుల్లో చాలా ఆరోగ్య సమస్యలు మహిళలతో పోలిస్తే ముందుగానే ప్రారంభమయ్యే ధోరణి కనిపించింది.
దీర్ఘకాలికంగా మందుల వాడకం..
మహిళలు సగటున పురుషుల కంటే ఎక్కువగా వైద్య సేవలను వినియోగించడంతో పాటు, దీర్ఘకాలికంగా తీసుకునే మందుల వాడకం కూడా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ కారణంగా మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే మహిళలు, పురుషుల్లో కొన్ని అంశాలు మాత్రం ఒకే విధంగా ఉన్నాయని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా మధుమేహంతో పాటు మానసిక ఆరోగ్య సమస్య కూడా ఉన్నప్పుడు, ఇతర ఆరోగ్య సమస్యలతో పోలిస్తే ముందస్తు మరణం సంభవించే ప్రమాదం రెండు లింగాల్లోనూ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అన్ని వయసుల వారిలోనూ, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా టైప్-2 డయాబెటిస్ తర్వాత అత్యంత సాధారణంగా కనిపించిన సమస్య రక్తపోటేనని పరిశోధకులు వెల్లడించారు. మధుమేహం తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలను కేవలం ఒకే విధమైన విధానంతో కాకుండా, వ్యక్తి లింగం, వయసు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వైద్య సేవలను అందించాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.
యువతుల్లో అధికం..
ముఖ్యంగా మధుమేహం ఉన్న యువతుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు ఊహించిన దానికంటే ముందుగానే, ఎక్కువగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. అందువల్ల సాధారణ మధుమేహ చికిత్సలో భాగంగానే మానసిక ఆరోగ్య పరీక్షలను కూడా క్రమం తప్పకుండా నిర్వహించే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. పురుషుల్లో గుండె, మూత్రపిండాల సమస్యలు ముందుగానే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, వారిలో ఈ రెండు ఆరోగ్య అంశాలను మరింత జాగ్రత్తగా పర్యవేక్షించడంతో పాటు, దీర్ఘకాలిక చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించేలా ప్రోత్సహించే వ్యూహాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

ల్యాప్టాప్ షట్డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
అక్టోబర్ 2, 2026

Veeramachineni Ramakrishna | వీఆర్కే డైట్ సృష్టికర్త.. వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు
సెప్టెంబర్ 30, 2026

Delhi | షాకింగ్ అధ్యయనం.. ఢిల్లీలో ప్రతి 20 మందిలో ఒకరికి షుగర్, బీపీ..
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●MEA | అక్టోబర్ 20న ముంబయిలో జైశంకర్–రూబియో భేటీ!
- ●TGSRTC | భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు!
- ●Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్
- ●Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!
- ●TGSRTC | ప్రయాణికులకు గుడ్న్యూస్.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!
- ●Sheela Rajkumar | రణబాలిలో అలివేలు - జైలర్ 2లో పార్వతి - రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?

MEA | అక్టోబర్ 20న ముంబయిలో జైశంకర్–రూబియో భేటీ!

TGSRTC | భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు!

Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్

Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!



