Air Conditioners | ఏసీలను ఎంత వాడినా ఈ సూచనలు పాటిస్తే కరెంటు బిల్లు తక్కువగానే వస్తుంది..!
Air Conditioners | వేసవిలో సహజంగానే చాలా మంది వేడి నుంచి తప్పించుకునేందుకు ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లను ఉపయోగిస్తుంటారు. ఎయిర్ కూలర్ల కన్నా ఏసీలే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటాయన్న సంగతి తెలిసిందే.
Air Conditioners | వేసవిలో సహజంగానే చాలా మంది వేడి నుంచి తప్పించుకునేందుకు ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లను ఉపయోగిస్తుంటారు. ఎయిర్ కూలర్ల కన్నా ఏసీలే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటాయన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఏసీలను నిరంతరాయంగా నడిపించేందుకు వెనుకడుగు వేస్తుంటారు. ఏసీలతో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఆందోళన చెందుతుంటారు. అయితే కొన్ని సూచనలు పాటిస్తే ఏసీల విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఏసీ ఎక్కువ కాలం పాటు మన్నికగా పనిచేస్తుంది కూడా. ఏసీలను ఉపయోగించే విషయంలో పలు సూచనలను ఎల్లప్పుడూ పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఉష్ణోగ్రతల రేంజ్‌లో వాడాలి..
సాధారణంగా చాలా మంది కేవలం వేసవిలోనే ఏసీలను సర్వీసింగ్ చేయిస్తుంటారు. అలా చేయకూడదు. ఇతర సీజన్లలో ఏసీలను వాడనప్పటికీ కచ్చితంగా ఎప్పటికప్పుడు కంపెనీ సూచించిన సమయాల్లో ఏసీలను సర్వీసింగ్ చేయించాలి. దీని వల్ల ఏసీల పనితీరుకు ఆటంకం కలగదు. పైగా తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుని మన్నికగా పనిచేస్తాయి. అలాగే ఏసీలను కొందరు మరీ తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉపయోగిస్తుంటారు. అలా కూడా చేయకూడదు. దీని వల్ల కంప్రెసర్‌పై భారం పడుతుంది. గదిని చల్లగా ఉంచేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. సాధారణంగా చాలా వరకు కంపెనీలు 24-26 మధ్య డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను సరైనవిగా సూచిస్తుంటాయి. ఆ ఉష్ణోగ్రతల వద్ద ఏసీలను ఉయోగిస్తే విద్యుత్ ఆదా అవుతుంది. అందుకనే చాలా వరకు ఏసీలను ఆన్ చేయగానే డిఫాల్ట్‌గా 24 డిగ్రీలు చూపిస్తుంది. ఉష్ణోగ్రతలను ఆ రేంజ్‌లో కొనసాగిస్తే ఏసీలపై భారం పడదు. విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. ఇతర ఉష్ణోగ్రతల వద్ద కన్నా ఆ రేంజ్‌లో ఏసీలను ఉపయోగిస్తే కనీసం 6 నుంచి 10 శాతం వరకు విద్యుత్‌ను తక్కువగా ఉపయోగించుకుంటాయని కంపెనీలు చెబుతున్నాయి.
ఫ్యాన్లను ఆన్‌లోనే ఉంచండి..
చాలా మంది ఏసీలను ఆన్ చేశాక ఫ్యాన్ ఎందుకని వాటిని ఆఫ్ చేస్తారు. అలా కూడా చేయకూడదు. ఏసీలను ఆన్‌లో ఉంచాక ఫ్యాన్‌లను కూడా ఆన్ చేయాలి. దీంతో గది త్వరగా చల్లబడుతుంది. ఏసీపై భారం తగ్గుతుంది. విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే గదిలోకి వేడి వచ్చే మార్గాలను నిరోధించాలి. కిటికీలకు, ద్వారానికి కర్టెన్లను లేదా బ్లైండ్స్‌ను ఉపయోగించాలి. గాజు కిటికీలకు ప్రత్యేక ఫిలింలను కోటింగ్ వేయించడం ద్వారా చాలా వరకు వేడిని లోపలికి రాకుండా అడ్డుకోవచ్చు. గదిపైన బంగళా మీద ఓపెన్ ఉంటే దానిపై వేడిని అడ్డుకునే ప్రత్యేక సున్నం కోటింగ్ వేయిస్తే మంచిది. దీంతో చాలా వరకు వేడి కిందకు రాకుండా ఉంటుంది. ఏసీలపై పడే భారం తగ్గడంతోపాటు విద్యుత్ కూడా ఆదా అవుతుంది. బిల్లు తక్కువగా వస్తుంది.
వేడిని ఉత్పత్తి చేసే పరికరాలు ఉంటే..
కొన్ని రకాల ఏసీలకు కంపెనీలు భిన్న రకాల మోడ్స్‌ను అందిస్తున్నాయి. దీంతో అవి ఆ మోడ్స్ ప్రకారం పనిచేస్తాయి. వాటిని ఉపయోగించడం వల్ల ఏసీలు తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటాయి. అవి అవసరం అయినప్పుడు మాత్రమే పనిచేస్తాయి కనుక విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. అలాగే ఏసీలు ఉండే గదిలో ఓవెన్లు, పాత తరం లైట్ బల్బులు, ఇతర వేడిని ఉత్పత్తి చేసే పరికరాలను వీలైనంత వరకు పెట్టకూడదు. సాధారణంగా ల్యాప్ టాప్‌లు లేదా డెస్క్‌టాప్‌లు, టీవీల నుంచి కూడా ఉష్ణం వెలువడుతుంది. కానీ వాటి తీసేయలేం కనుక వేడిని ఉత్పత్తి చేసే ఇతర ఏవైనా పరికరాలు ఉంటే తొలగించడం మంచిది. దీని వల్ల ఏసీ తీవ్రంగా శ్రమించాల్సిన బాధ తప్పుతుంది. ఇక 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు కాస్త ఖరీదు ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటిని కొనుగోలు చేయడం వల్ల దీర్ఘకాలంలో విద్యుత్‌ను ఆదా చేయడంలో ఎంతో ఉపయోగం ఉంటుంది. అవి చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటూ పనిచేస్తాయి. కనుక 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలను వాడడం మంచిది. ఇలా ఈ సూచనలు పాటిస్తే ఏసీలు ఎక్కువ కాలం మన్నికగా పనిచేయడమే కాకుండా, కరెంటు బిల్లు కూడా తక్కువగా వచ్చేలా చేయవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Trisha | మధురైలో విజయ్, త్రిష పోస్టర్లు - చెన్నై క్వీన్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
- ●Motorola | మోటోరోలా కళ్లు చెదిరే ఆఫర్లు.. ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..
- ●Jail Bharo Andolan | అక్టోబర్ 2న సీజేపీ జైల్ భరో ఆందోళన.. కీలక అప్డేట్ ఇచ్చిన దిప్కే
- ●KP Vivekananda | ఈడీ కేసులో పొంగులేటిని కాపాడుతుందెవరో చెప్పాలి
- ●Austria Working Holiday Visa India | జాబ్ ఆఫర్ అక్కర్లేదు, స్పాన్సర్ అవసరం లేదు: భారతీయులకు ఆస్ట్రియా గోల్డెన్ ఛాన్స్.. 12 నెలల వర్కింగ్ వీసా వివరాలివే
- ●Rakul Preet Singh | అక్రమ లావాదేవీలు.. రకుల్ ప్రీత్ నివాసంలో ఐటీ అధికారుల సోదాలు

Trisha | మధురైలో విజయ్, త్రిష పోస్టర్లు - చెన్నై క్వీన్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

Motorola | మోటోరోలా కళ్లు చెదిరే ఆఫర్లు.. ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..

Jail Bharo Andolan | అక్టోబర్ 2న సీజేపీ జైల్ భరో ఆందోళన.. కీలక అప్డేట్ ఇచ్చిన దిప్కే

KP Vivekananda | ఈడీ కేసులో పొంగులేటిని కాపాడుతుందెవరో చెప్పాలి






