WhatsApp | ఇక బిల్లులన్నీ వాట్సాప్‌లోనే చెల్లించవచ్చు.. కొత్త అప్‌డేట్ వచ్చేసింది..
WhatsApp | వాట్సాప్ భారత్‌లోని వినియోగదారుల కోసం యాప్‌లోనే బిల్లులు చెల్లించే సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై విద్యుత్, నీటి బిల్లులు సహా వివిధ గృహ, యుటిలిటీ బిల్లులను వాట్సాప్ నుంచే చూడడం, నిర్వహించడం, చెల్లించడం చేయవచ్చు. ఈ సేవను భారత్ కనెక్ట్ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు.
Technology | Published On Sep 3, 2026, 2.00 pm IST
WhatsApp | వాట్సాప్ భారత్‌లోని వినియోగదారుల కోసం యాప్‌లోనే బిల్లులు చెల్లించే సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై విద్యుత్, నీటి బిల్లులు సహా వివిధ గృహ, యుటిలిటీ బిల్లులను వాట్సాప్ నుంచే చూడడం, నిర్వహించడం, చెల్లించడం చేయవచ్చు. ఈ సేవను భారత్ కనెక్ట్ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. గతంలో దీనిని బీబీపీఎస్‌గా పిలిచేవారు. భారత్ కనెక్ట్ ద్వారా 30 కేటగిరీల్లోని 22,722 బిల్లర్లకు వాట్సాప్ వినియోగదారులు యాక్సెస్ పొందవచ్చు. విద్యుత్, నీరు, పైప్డ్ గ్యాస్, ఫాస్టాగ్ రీఛార్జ్‌లు, బీమా ప్రీమియంలు, క్రెడిట్ కార్డు బిల్లులు, రుణ చెల్లింపులు వంటి సేవలు ఇందులో ఉన్నాయి.
సులభంగా బిల్లు చెల్లింపులు..
వాట్సాప్ ప్రధాన స్క్రీన్‌పై పైభాగంలో కనిపించే రూపాయి చిహ్నం (₹)ను ట్యాప్ చేయడం ద్వారా బిల్లు నిర్వహణ సదుపాయాలను నేరుగా యాక్సెస్ చేయవచ్చు. అనుసంధానించిన ఖాతాలకు సంబంధించిన రాబోయే బకాయిలను ప్లాట్‌ఫామ్ ఆటోమేటిక్‌గా సేకరించి చూపిస్తుంది. గతంలో చేసిన లావాదేవీలకు సంబంధించిన బిల్లర్ వివరాలు కూడా పేమెంట్స్ హోమ్ తెరపై స్టోర్ అవుతాయి. దీంతో తరచూ చెల్లించే బిల్లర్లను మళ్లీ సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఒకే యుటిలిటీ ప్రొవైడర్‌కు సంబంధించిన పలు వినియోగదారు ఖాతాలను కూడా అనుసంధానించుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇంటికి, కార్యాలయానికి లేదా కుటుంబ సభ్యుల కోసం వేర్వేరు విద్యుత్ కనెక్షన్లు ఉంటే వాటన్నింటినీ ఒకే చోట ట్రాక్ చేసి నిర్వహించవచ్చు. తరచూ ఉపయోగించే బిల్లు కేటగిరీలను పేమెంట్స్ స్క్రీన్‌పైనే ప్రత్యేకంగా చూపిస్తారు. మిగిలిన కేటగిరీలను డైరెక్టరీ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. బిల్లు చెల్లింపుల కోసం యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వంటి పేమెంట్ పద్ధతులను వాట్సాప్ అందిస్తోంది.
ఎలా చేయాలి..
బిల్లు చెల్లించేందుకు ముందుగా వాట్సాప్‌ను ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్ పైభాగంలో ఉన్న రూపాయి చిహ్నంపై ట్యాప్ చేయాలి. అనంతరం అవసరమైన బిల్లు కేటగిరీ, సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత వినియోగదారు లేదా ఖాతాకు సంబంధించిన గుర్తింపు వివరాలను నమోదు చేసి నిర్ధారించాలి. యాప్ ఆటోమేటిక్‌గా సేకరించిన బిల్లు వివరాలు, బకాయి మొత్తాన్ని పరిశీలించిన తర్వాత యూపీఐ, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డులో ఏదో ఒక పేమెంట్ పద్ధతిని ఎంచుకుని లావాదేవీని పూర్తి చేయవచ్చు. భారత్‌లో వాట్సాప్ ఇప్పటికే మొబైల్ రీఛార్జ్‌లు, మెట్రో రవాణా టికెటింగ్, అధికారిక పౌర సేవలను ఆటోమేటెడ్ చాట్‌బాట్ల ద్వారా అందిస్తోంది. ఇప్పుడు బిల్లు చెల్లింపుల సదుపాయాన్ని కూడా అందించడం ద్వారా వినియోగదారులు తరచూ చేసే ఆర్థిక లావాదేవీలను ఒకే యాప్‌లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త బిల్లు చెల్లింపు సదుపాయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. రానున్న వారాల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Vijay | చెన్నైలో మెగా ఒలింపిక్ సిటీ, ఫార్ములా-1 రేసింగ్.. తమిళనాడు సీఎం విజయ్ సంచలన ప్రకటన
- ●Harish Rao | రేవంత్‌కి హరీశ్‌రావు సెల్ఫీ చాలెంజ్.. నర్సాపూర్ కాలువ దుస్థితిని ట్యాగ్ చేస్తున్నా.. చూసుకో
- ●America | ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. ఆంక్షలు తప్పవంటూ అమెరికా హెచ్చరిక
- ●MK Stalin | కొలత్తూరు ఎన్నిక.. ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ
- ●Measles | ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న మీజిల్స్ (తట్టు) కేసులు.. కారణాలేంటి..?
- ●Medical Emergency | దోహా నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానం.. మస్కట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

CM Vijay | చెన్నైలో మెగా ఒలింపిక్ సిటీ, ఫార్ములా-1 రేసింగ్.. తమిళనాడు సీఎం విజయ్ సంచలన ప్రకటన

Harish Rao | రేవంత్‌కి హరీశ్‌రావు సెల్ఫీ చాలెంజ్.. నర్సాపూర్ కాలువ దుస్థితిని ట్యాగ్ చేస్తున్నా.. చూసుకో

America | ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. ఆంక్షలు తప్పవంటూ అమెరికా హెచ్చరిక

MK Stalin | కొలత్తూరు ఎన్నిక.. ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ






