Tamil Nadu | దీపావళికి ముందు చికెన్ ప్రియులకు షాక్.. అంతుచిక్కని వ్యాధితో 50వేల కోళ్లు మృతి..
Tamil Nadu | తమిళనాడులోని కడలూరు జిల్లాలో గుర్తుతెలియని వ్యాధి కారణంగా ఆరు రోజుల్లో సుమారు 50 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీపావళి పండుగకు ముందు ఈ పరిణామం పౌల్ట్రీ రైతులకు భారీ ఆర్థిక నష్టాలను మిగిల్చింది. ప్రాథమిక ప్రయోగశాల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ లేదని తేలినప్పటికీ, కోళ్ల మరణాలకు అసలు కారణాన్ని ఇంకా గుర్తించలేదు.
Tamil Nadu | తమిళనాడులోని కడలూరు జిల్లాలో గుర్తుతెలియని వ్యాధి కారణంగా ఆరు రోజుల్లో సుమారు 50 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీపావళి పండుగకు ముందు ఈ పరిణామం పౌల్ట్రీ రైతులకు భారీ ఆర్థిక నష్టాలను మిగిల్చింది. ప్రాథమిక ప్రయోగశాల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ లేదని తేలినప్పటికీ, కోళ్ల మరణాలకు అసలు కారణాన్ని ఇంకా గుర్తించలేదు.
తమిళనాడులోని కడలూరు జిల్లాలో పలు గ్రామాల్లో కోళ్ల మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అనుమానిత వ్యాధి వ్యాప్తితో కేవలం ఆరు రోజుల్లోనే సుమారు 50 వేల కోళ్లు చనిపోయినట్లు రైతులు వెల్లడించారు. అయితే జిల్లా అధికార యంత్రాంగం లెక్కల ప్రకారం సుమారు 26 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. కడలూరుకు చెందిన మోహన్ అనే పౌల్ట్రీ రైతు ఒక్క వారంలోనే సుమారు 7 వేల కోళ్లను కోల్పోయినట్లు చెప్పారు. కోళ్లు వెనుకకు చాపిన కాళ్లు, విస్తరించిన రెక్కలతో నేలపై పడిపోయి మరణిస్తుండడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంతో పలువురు రైతుల జీవనోపాధి, పౌల్ట్రీ వ్యాపారాలు ప్రమాదంలో పడ్డాయి.
భారీ పెట్టుబడులు.. రైతులకు తీరని నష్టం..
ఇప్పటికే కోడిపిల్లలు, దాణా, ఫామ్ నిర్వహణ కోసం రైతులు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ఒక్క కోడిపిల్ల ధర రూ.47 నుంచి రూ.48 వరకు ఉండగా, 50 కిలోల కోళ్ల దాణా బస్తా ధర రూ.2,500 నుంచి రూ.2,600 వరకు ఉంది. విద్యుత్ బిల్లులకే నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతోంది. మోహన్ తన పౌల్ట్రీ వ్యాపారంలో సుమారు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. తాజాగా కోళ్ల మరణాలతో పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బర్డ్ ఫ్లూ కాదని నిర్ధారణ..
జిల్లా ఉన్నతాధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రాథమిక ప్రయోగశాల పరీక్షల్లో ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) లేదని తేలింది. అయితే కోళ్ల సామూహిక మరణాలకు అసలు కారణం ఏమిటనేది ఇంకా వెల్లడికాలేదు. వ్యాధి మూలాలను గుర్తించేందుకు తమిళనాడు ప్రభుత్వం కోళ్ల దాణా, నీటికి సంబంధించిన నమూనాలతోపాటు మరికొన్ని శాంపిళ్లను భోపాల్లోని ప్రత్యేక ప్రయోగశాలలకు పంపించింది. వాటి పరీక్షా ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. వ్యాధి కారణం నిర్ధారణ అయిన తర్వాత తగిన నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
తాజావార్తలు
- ●FDA | పండుగ వేళ ఎఫ్డీఏ కొరడా.. బ్లింకిట్, జెప్టో లైసెన్సులు రద్దు.. డీమార్ట్పై చర్యలు
- ●Rytu Bharosa to all | అటు కరువు సాయం..ఇటు రైతు భరోసా..హకీంపేట సభలో సీఎం అనౌన్సమెంట్?
- ●Gold And Silver Prices Today | దీపావళి ముందు బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు.. స్వల్పంగా పెరిగిన ధరలు..
- ●CP Sajjanar | దీపావళి కానుక పేరుతో సైబర్ కేటుగాళ్ల వల.. నకిలీ మెసేజ్లతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- ●Rahul Gandhi | ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం
- ●Bollywood OTT | రెండు కోట్ల బడ్జెట్ - 450 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి బ్లాక్బస్టర్ మైథాలజీ మూవీ

FDA | పండుగ వేళ ఎఫ్డీఏ కొరడా.. బ్లింకిట్, జెప్టో లైసెన్సులు రద్దు.. డీమార్ట్పై చర్యలు

Rytu Bharosa to all | అటు కరువు సాయం..ఇటు రైతు భరోసా..హకీంపేట సభలో సీఎం అనౌన్సమెంట్?

Gold And Silver Prices Today | దీపావళి ముందు బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు.. స్వల్పంగా పెరిగిన ధరలు..

CP Sajjanar | దీపావళి కానుక పేరుతో సైబర్ కేటుగాళ్ల వల.. నకిలీ మెసేజ్లతో జాగ్రత్త: సీపీ సజ్జనార్






