Single Life | అందరూ ఉన్నా ఒంటరే.. అయినా చెరగని చిరునవ్వుతో జీవించాలి..
Single Life | ఒంటరి.. ఒంటరి జీవితం.. తోడు లేని జీవితం.. ఈ పదాలు ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న పదాలు..! ఎందుకంటే.. జీవితంలో ఒంటరిగా ఉండడం అనేది చాలా కష్టం. ఒక మనిషిలో ఒంటరి అనే భావన కలిగితే మానసికంగా కృంగిపోతారు. అందరిని వదిలేసి దూరంగా ఉండటం కాదు ఒంటరితనం.. మనకున్న బాధలు పంచుకోవడానికి వీలులేని మనషుల మధ్య మనం ఉండటం అసలైన ఒంటరితనం..! బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి. కానీ బాధ పెంచేలా ఉండకూడదు.
బంధాలు బహుదూరం..
ప్రేమానురాగాలు కనుమరుగు..
ఒంటరిగా ఉండడం అనేది చాలా కష్టం..
అయినా చెరగని చిరునవ్వుతో జీవించాలి..
ఆ క్షణాలే జీవితాన్ని సార్థకం చేస్తాయి..
Single Life | త్రినేత్ర.న్యూస్ : ఒంటరి.. ఒంటరి జీవితం.. తోడు లేని జీవితం.. ఈ పదాలు ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న పదాలు..! ఎందుకంటే.. జీవితంలో ఒంటరిగా ఉండడం అనేది చాలా కష్టం. ఒక మనిషిలో ఒంటరి అనే భావన కలిగితే మానసికంగా కృంగిపోతారు. అందరిని వదిలేసి దూరంగా ఉండటం కాదు ఒంటరితనం.. మనకున్న బాధలు పంచుకోవడానికి వీలులేని మనషుల మధ్య మనం ఉండటం అసలైన ఒంటరితనం..! బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి. కానీ బాధ పెంచేలా ఉండకూడదు.
మనసుకు నచ్చిన వారు రెండు నిమిషాలైన మాట్లాడితే బాగుండు అని గంటల పాటు ఎదురుచూస్తారు. కానీ తీరా ఆ రెండు నిమిషాలు కూడా సమయం కేటాయించకపోతే జీవితం నిజంగానే ఒంటరి అనిపిస్తుంది. అయినా కూడా నేను ఒంటరిని కాదు.. నా ఒంటరితనం నాకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది అని నిర్భయంగా ఉండే వారే ఈ భూమ్మీద జీవించగలుగుతున్నారు. కానీ ఈ కమర్షియల్ జీవితాల మధ్య ప్రేమానుబంధాలు కనుమరుగైపోతున్నాయి. చుట్టూ అందరూ ఉన్న బాధలను పంచుకోలేని దుస్థితిలో ఉన్నాం. గుండెల్లో బాధను పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అటు బాధను అనుభవించలేక.. ఇటు మనుసుకు నచ్చిన వారికి చెప్పుకోలేక క్షణికావేశంలో ఎంతో మంది తనువు చాలిస్తున్నారు. అంటే అందరూ ఉన్నా ఒంటరే అనే భావన కలగడం. ఈ ఒంటరి అనే భావనకు ఈ రెండు ఘటనలే నిదర్శనం.
ఒంటరి జీవితాన్ని భరించలేక ఇటీవల ఇద్దరు పిల్లలతో సహా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయా రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె ఆత్మహత్యకు గల అసలైన కారణాలు ఏంటో ఇప్పటికీ తేలలేదు. కానీ కేవలం ఒంటరి తనం వల్లే సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు తేల్చారు. భర్త దుబాయ్‌లో ఉండడం, ఇద్దరు పిల్లలు హాస్టల్‌లో ఉండడం, ఆమె ఒంటరిగా ఉండడమే ఈ ఆత్మహత్యలకు కారణమని పలువురు విశ్లేషించారు. పోలీసులు కూడా అదే తేల్చారు.
ఈ ఘటన మరువక ముందే.. వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలో మరో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తానే చనిపోయే ముందు.. తన ఆరేళ్ల బిడ్డకు కూడా ఉరేసింది. ఒంటరి జీవితం భరించలేకనే ఆమె కఠిన నిర్ణయం తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ ఐదేళ్ల సంసార జీవితం సాఫీగానే సాగినప్పటికీ.. రెండేళ్ల క్రితం విడిపోయారు. అప్పట్నుంచి తీవ్ర మనోవేదనకు గురైన వివాహిత.. చివరకు ఒంటరితనం భరించలేక తనువు చాలించింది. తన బిడ్డను కూడా తనతో పాటు తీసుకెళ్లింది.
వివాహ జీవితం పరస్పర ప్రేమ, గౌరవం, భావోద్వేగ అనుబంధంపై ఆధారపడి ఉంటుంది. అయితే, కొన్నిసార్లు మహిళలు వివాహ బంధంలోనే ఒంటరితనం, ఏకాంత భావన, అసహాయతను అనుభవిస్తారు. దీనికి అనేక మానసిక, సామాజిక కారణాలు ఉంటాయి. అంతేకాదు.. అందరూ ఉన్న ఒంటరి అనే భావనను పెంపొందిస్తుంది. ఈ కారణాలే మనిషిని చిన్నాభిన్నం చేసి.. చివరకు చితికి చేర్చుస్తున్నాయి. అయితే ఒంటరి తనానికి కారణాలు ఏంటి..? మానసిక స్థైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలనే విషయాలను అర్థం చేసుకున్నప్పుడే ఒంటరి అనే పదానికి స్వస్తి చెప్పగలుగుతాం.
ఒంటరితనానికి ముఖ్య కారణాలు:
భర్త బాధ్యతలకు పరిమితం కావడం:
- భర్త ఆర్థికంగా కుటుంబాన్ని చూసుకోవడం, అవసరాలను తీర్చడం వంటి బాధ్యతలను మాత్రమే పూర్తి చేస్తున్నారు. కానీ మహిళకు కావలసింది కేవలం బాధ్యతలు కాదు. ప్రేమ, ఆదరణ, భావోద్వేగ మద్దతు, గౌరవం, ప్రోత్సాహం కూడా చాలా ముఖ్యమైనవి.
ఉద్యోగ ఒత్తిడి:
- ఎక్కువ పని గంటల వల్ల దాంపత్య జీవితంలో దూరం పెరుగుతుంది. భార్యాభర్తలు ప్రేమికులుగా కాకుండా బాధ్యతల భాగస్వాములుగా మారిపోతారు.
సోషల్ మీడియా ప్రభావం:
- కొంత సమయం దొరికినా, అది సోషల్ మీడియాలో గడిపి, నిజమైన బంధాలకు సమయం ఇవ్వడం లేదు. ఆన్‌లైన్‌లో కనెక్షన్లు పెరుగుతున్నా, ఆఫ్‌లైన్‌లో హృదయాలు దూరమవుతున్నాయి. తాత్కాలిక లైక్స్ కంటే, విలువైన వ్యక్తులతో గడిపే క్షణాలే జీవితాన్ని సార్థకం చేస్తాయి.
భావాల పట్ల నిరాదరణ:
- భార్య భావాలు, ఆలోచనలు, బాధలను పట్టించుకోకపోవటం “నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు” అనే భావనను కలిగిస్తుంది. దీర్ఘకాలంలో ఇది ఆత్మవిశ్వాసం తగ్గించి, డిప్రెషన్‌కు దారి తీస్తుంది.
సామాజిక ముద్ర (Social Stigma):
- ఇండియా వంటి దేశాల్లో, విడాకులు లేదా కుటుంబ సమస్యలు బయటపెట్టడం తప్పు అని భావించడం, మహిళను తప్పు చేసినట్టు చూడటం, కుటుంబ గౌరవం పేరుతో మౌనం పాటించమని ఒత్తిడి – ఇవి మహిళను మరింత ఒంటరిగా చేస్తాయి.
బంధువుల జోక్యం:
- వ్యక్తిగత గోప్యత కోల్పోవడం, నిర్ణయాల్లో స్వేచ్ఛ లేకపోవడం, భావోద్వేగ ఒత్తిడి పెరగడం – ఇది మానసిక అస్థిరతకు దారి తీస్తుంది.
తీవ్ర పరిస్థితులు:
- కొన్ని సందర్భాల్లో తల్లి తన పిల్లలను వెంట తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం, తీవ్రమైన డిప్రెషన్ ప్రభావంతో ఏర్పడే కాగ్నిటివ్ వక్రీభావం (ఆలోచనా లోపం) కారణంగా ఉంటుంది. తల్లి ఇలా భావించవచ్చు:
- “నేను లేకుండా నా పిల్లలు బాధపడతారు.”
- “వాళ్లు హింస లేదా నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు.”
- “భవిష్యత్తులో బాధను ఎదుర్కొనడం కంటే మరణమే మంచిది.”
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు:
భావాలను అణచిపెట్టకండి:
- మనసులో ఉన్న బాధ, అసంతృప్తి, భయం వంటి భావాలను నమ్మకమైన వ్యక్తితో పంచుకోవాలి. మౌనం సమస్యను పెంచుతుంది, తగ్గించదు.
స్పష్టమైన సంభాషణ:
- భార్యాభర్తల మధ్య ఓపెన్‌గా మాట్లాడటం చాలా అవసరం. ఒకరి బాధలను మరొకరు అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించడం అవసరం.
వ్యక్తిగత హద్దులు (Boundaries) పెట్టుకోవడం:
- బంధువుల జోక్యం ఎక్కువైతే, గౌరవంగా కానీ స్పష్టంగా హద్దులు చెప్పాలి. వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు.
ఆర్థిక స్వతంత్రత:
- మహిళలు సాధ్యమైనంత వరకు ఆర్థిక స్వతంత్రత పెంచుకోవాలి. వ్యక్తిగత ఆసక్తులు, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
డిప్రెషన్, ఆందోళన, నిరాశ ఎక్కువైతే..
- కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోవటం ప్రయత్నించాలి.
ఒంటరితనాన్ని పట్టించుకోవడం:
- ఒంటరితనం ఒక్కరోజులో ప్రమాదంగా మారదు. దాన్ని పట్టించుకోకపోతే, మానసిక సంక్షోభానికి దారి తీస్తుంది. సహించడమే పరిష్కారం కాదు. సహాయం కోరడం మొదటి పరిష్కారం.
అయితే ఒంటరిగా ఉండడం అనేది చాలా కష్టం. ఆ జీవితాన్ని ఊహించుకోవడమే కష్టం. కళ్ళ నిండా నీళ్ళు.. గుండె నిండా బాధ. అయినా కూడా చెరగని చిరునవ్వుతో జీవించాలి. సవాళ్లను అధిగమించాలి. జీవించడం నేర్చుకోవాలి.. పది మందికి ఆదర్శంగా నిలవాలి.. అప్పుడే జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.

ఎం స్వాతి రెడ్డి
సైకాలజిస్ట్ & అడ్వకేట్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Infertility | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంతాన లోపం సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న WHO..
మే 4, 2026

Karimanagar | భార్యాభర్తల మధ్య ఘర్షణ.. కవల పిల్లలను బావిలో తోసేసిన తండ్రి
ఏప్రిల్ 3, 2026

Telangana | తైలంతో స్నానం చేస్తే సంతానం.. బాత్రూమ్లోకి వెళ్లగా బంగారంతో పరార్
ఫిబ్రవరి 9, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



