Suicide | నీకు మగతనం లేదు.. నాకొద్దురా మొగుడా..!
Suicide | కొత్తగా పెళ్లైంది.. ఇక సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నాడు. కానీ భార్య నుంచి ఊహించని మాట వినిపించింది. పెళ్లైన మూడు రోజులకే.. నువ్వు మగాడివి కాదు.. నీకు మగతనం లేదు.. నాకొద్దురా మొగుడా నువ్వు అని భర్తను హింసించింది భార్య.
Suicide | త్రినేత్ర.న్యూస్ : కొత్తగా పెళ్లైంది.. ఇక సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నాడు. కానీ భార్య నుంచి ఊహించని మాట వినిపించింది. పెళ్లైన మూడు రోజులకే.. నువ్వు మగాడివి కాదు.. నీకు మగతనం లేదు.. నాకొద్దురా మొగుడా నువ్వు అని భర్తను హింసించింది భార్య. ఇంకేముంది మూడు నెలల పాటు మానసిక వేదన అనుభవించిన ఆ భర్త.. చివరకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో వెలుగు చూసింది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన సదర్‌లాల్(27) తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేసేవాడు. ఈ ఏడాది మే నెలలో హర్యాతండాకు చెందిన యువతిని సదర్‌లాల్ వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్లైన మూడో రోజు నుండే నీకు మగతనం లేదని భర్తను భార్య వేధింపులకు గురి చేసింది. అయినా కూడా ఆమె హింసను భరించాడు. మూడు నెలల పాటు మానసిన వేదన అనుభవించాడు.
అత్తింట్లో అవమానం.. బావకు ఫోన్ చేసి ఆత్మహత్య
ఇటీవల సీత్లా పండుగ సందర్భంగా అత్తగారింటికి వెళ్లగా, కుటుంబ సభ్యులతో కలిసి సదర్ లాల్‌ను భార్య అవమానించింది. తీవ్ర మనస్తాపానికి గురైన సదర్‌లాల్.. తన అక్క దగ్గరికి వెళ్తున్నానని చెప్పి, బావకు ఫోన్ చేశాడు. తాను చనిపోతున్నానని చెప్పి బావకు లొకేషన్ పంపాడు. దీంతో వి. వెంకటాయపాలెం కాలువ దగ్గరికి వెళ్లి చూడగా, అక్కడ సదర్ లాల్ బైక్, ఫోన్, కలుపు మందు డబ్బాను గుర్తించారు. తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టి డెడ్‌బాడీని వెలికితీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మెడికల్ టెస్టులు కూడా
అయితే పెళ్లికి ముందే యువతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని, పెళ్లయ్యాక కూడా సంబంధం కొనసాగించేందుకే సదర్ లాల్‌కు మగతనం లేదని పంచాయతీ పెడితే, మెడికల్ టెస్టులు చేయించామని సదర్ లాల్ కుటుంబ సభ్యులు తెలిపారు.
సంబంధిత వార్తలు

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు 11,000 దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకోండిలా..
జులై 28, 2026

KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి
జులై 28, 2026

Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు
జులై 28, 2026
తాజావార్తలు
- ●Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు 11,000 దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకోండిలా..
- ●PoK Violence | అట్టుడుకుతున్న పీవోకే.. పోలీసుల కాల్పుల్లో 20 మంది మృతి
- ●X Money | ఎలాన్ మస్క్ ఎక్స్ (X) నుంచి ఇక బ్యాంకింగ్ సేవలు.. ఎక్స్ మనీ లాంచ్.. డిజిటల్ బ్యాంకింగ్, 6 శాతం వడ్డీ..
- ●Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత
- ●KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి
- ●Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు 11,000 దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకోండిలా..

PoK Violence | అట్టుడుకుతున్న పీవోకే.. పోలీసుల కాల్పుల్లో 20 మంది మృతి

X Money | ఎలాన్ మస్క్ ఎక్స్ (X) నుంచి ఇక బ్యాంకింగ్ సేవలు.. ఎక్స్ మనీ లాంచ్.. డిజిటల్ బ్యాంకింగ్, 6 శాతం వడ్డీ..

Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత



