త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hug | భార్య‌కు హ‌గ్ ఇచ్చాడు.. 5 ప‌క్క‌టెముక‌లు విర‌గ్గొట్టాడు

Hug | ప్ర‌తి భార్య కూడా త‌న భ‌ర్త నుంచి హ‌గ్( Hug ) కోరుకుంటుంది. ఇంకేముంది.. త‌న భార్య‌ను ప‌ర‌వ‌శింప‌జేయాల‌ని చెప్పి.. గ‌ట్టిగా కౌగిలించుకున్నాడు ఓ భ‌ర్త‌. కానీ ఆ మ‌ధురానుభూతి క్ష‌ణంలోనే ఆవిరైపోయింది. ఎందుకంటే.. భ‌ర్త ఇచ్చిన హ‌గ్‌కు భార్య ప‌క్క‌టెముక‌లు విరిగిపోయాయి.

S

International | Published On Oct 22, 2026, 1.49 pm IST

Hug | భార్య‌కు హ‌గ్ ఇచ్చాడు.. 5 ప‌క్క‌టెముక‌లు విర‌గ్గొట్టాడు
Advertisement

Hug | త్రినేత్ర న్యూస్ : ప్ర‌తి భార్య కూడా త‌న భ‌ర్త నుంచి హ‌గ్( Hug ) కోరుకుంటుంది. ఇంకేముంది.. త‌న భార్య‌ను ప‌ర‌వ‌శింప‌జేయాల‌ని చెప్పి.. గ‌ట్టిగా కౌగిలించుకున్నాడు ఓ భ‌ర్త‌. కానీ ఆ మ‌ధురానుభూతి క్ష‌ణంలోనే ఆవిరైపోయింది. ఎందుకంటే.. భ‌ర్త ఇచ్చిన హ‌గ్‌కు భార్య ప‌క్క‌టెముక‌లు విరిగిపోయాయి. దీంతో బాధితురాలు మంచానికే ప‌రిమిత‌మైపోయింది. ఈ ఘ‌ట‌న చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో అక్టోబ‌ర్ 18న చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఈ హ‌గ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్య‌క్తి.. త‌న భార్య‌కు ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర‌చాల‌ని అనుకున్నాడు. ఈ క్ర‌మంలో భార్య‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుని.. గ‌ట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ బ‌ల‌మైన కౌగిలింత‌.. ఆ దంప‌తుల్లో విషాదాన్ని మిగిల్చింది. ప‌క్క‌టెముక‌లు విరిగడంతో ఆమె విల‌విల‌లాడిపోయింది.

ఆమెను భ‌ర్త ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, వైద్యులు స్కానింగ్ నిర్వ‌హించారు. 5 ప‌క్క‌టెముక‌లు విరిగిన‌ట్లు తేల్చారు. మ‌రో ఎముక‌కు క్రాక్ వ‌చ్చిన‌ట్లు నిర్ధారించారు. ‘ఆస్టియోపొరోసిస్’ అనే ఎముకల బలహీనత వ్యాధి ఉండటమే ఇందుకు కారణమని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. ఎముకలు తీవ్రంగా బలహీనపడటంతో చిన్నపాటి ఒత్తిడికే విరిగిపోతాయని పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Times Now (@timesnow)

ట్యాగ్స్:

Advertisement
Advertisement