Covid 19 | కోవిడ్-19 కొత్త వేరియెంట్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆందోళన వద్దన్న WHO..
Covid 19 | కరోనా వైరస్ (కోవిడ్-19) అనేక రూపాల్లో వచ్చి ఎంతో మంది ప్రజలను బలి తీసుకుంది. కోవిడ్ దెబ్బకు కొన్ని కోట్ల మంది మృతి చెందారు. కరోనా వైరస్‌కు గాను అప్పట్లోనే సైంటిస్టులు అనేక వేరియెంట్లను, సబ్ వేరియెంట్లను గుర్తించారు. పలు భిన్న రకాల వేరియెంట్లలోఈ వైరస్ అప్పట్లో ప్రజలకు వ్యాప్తి చెందింది.
Covid 19 | కరోనా వైరస్ (కోవిడ్-19) అనేక రూపాల్లో వచ్చి ఎంతో మంది ప్రజలను బలి తీసుకుంది. కోవిడ్ దెబ్బకు కొన్ని కోట్ల మంది మృతి చెందారు. కరోనా వైరస్‌కు గాను అప్పట్లోనే సైంటిస్టులు అనేక వేరియెంట్లను, సబ్ వేరియెంట్లను గుర్తించారు. పలు భిన్న రకాల వేరియెంట్లలోఈ వైరస్ అప్పట్లో ప్రజలకు వ్యాప్తి చెందింది. అయితే కోవిడ్ 19కి చెందిన మరో సబ్ వేరియెంట్‌ను సైంటిస్టులు తాజాగా అమెరికాతోపాటు పలు ఇతర దేశాల్లోనూ గుర్తించారు. దీన్ని కోవిడ్ 19 సబ్ వేరియెంట్ BA.3.2 గా వ్యవహరిస్తున్నారు. ఒమిక్రాన్ వర్గానికి చెందిన ఈ వేరియెంట్ అధిక సంఖ్యలో మ్యుటేషన్ అయ్యే శక్తిని కలిగి ఉండడంతోపాటు రోగ నిరోధక శక్తిని కొంత వరకు తప్పించుకునే సామర్థ్యం ఉంటుందని సైంటిస్టులు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తోపాటు వివిధ దేశాల్లో ఉన్న అనేక ఆరోగ్య సంస్థలు ఈ కొత్త వేరియెంట్‌ను ఆసక్తిగా గమనిస్తున్నాయి.
వేగంగా వ్యాప్తి చెందే అవకాశం..
2024 చివర్లో సౌతాఫ్రికాలో ఈ సబ్ వేరియెంట్‌ను తొలుత గుర్తించారు. తరువాత యూరోప్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలకు ఈ వైరస్ వేరియెంట్ వ్యాప్తి చెందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని పర్యవేక్షణలో ఉన్న వేరియెంట్‌గా వర్గీకరించింది. అంటే ప్రస్తుతానికి ఈ వేరియెంట్‌తో పెద్దగా ముప్పు లేదని, కానీ దీన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తెలిపింది. కాగా ఈ వేరియెంట్నే సికాడా అనే పేరుతోనూ పిలుస్తున్నారు. దీర్ఘకాలంగా మరుగున పడి ఉండి మళ్లీ అభివృద్ధి చెంది కొత్తగా కనిపించడం దీని ప్రత్యేకత. అందుకనే ఆ పేరుతో ఈ వేరియెంట్‌ను పిలుస్తున్నారు. SARS-CoV-2 వైరస్ నిరంతరం మారే విధంగానే ఈ వేరియెంట్ కూడా మారుతుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రాథమిక అంచనాల ప్రకారం BA.3.2 వేరియెంట్ గతంలో వ్యాప్తి చెందిన కోవిడ్ వేరియెంట్ల కన్నా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, రోగ నిరోధక వ్యవస్థను సైతం తప్పించుకునే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.

అప్పటి వైరస్ కన్నా బలమైంది..
BA.3.2 వేరియెంట్ వాస్తవానికి SARS-CoV-2 వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియెంట్‌కు చెందిన ఒక సబ్ వేరియెంట్. ఇది కోవిడ్ 19కు కారణమవుతుంది. అంతకు ముందు ఉన్న BA.3 వేరియెంట్ మార్పు చెంది ఇలా మారింది. 2022 తరువాత BA.3 వేరియెంట్ ఎక్కువగా కనిపించలేదు. BA.3.2 వేరియెంట్ విస్తృతంగా మ్యుటేషన్లను కలిగి ఉంటుంది. దీని స్పైక్ ప్రోటీన్‌లో 50కి పైగా మార్పులు ఉండగా, వూహాన్లో మొదట వ్యాప్తి చెందిన మూల వైరస్‌తో పోలిస్తే మొత్తం 70కి పైగా మార్పులు ఉన్నాయి. ఈ అధిక మ్యుటేషన్ల కారణంగా సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. BA.3.2 వేరియెంట్ తనకు ఉన్న అధిక మ్యుటేషన్ శక్తి కాణంగా మానవ రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని, వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉంటుందని, వైరస్ బయో సైన్స్‌లో అనేక మార్పులు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల 2025 డిసెంబర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియెంట్ అండర్ మానిటరింగ్ (VUM) గా గుర్తించింది.
ఇప్పటి వరకైతే వ్యాపించలేదు..
BA.3.2 వేరియెంట్ కోవిడ్ టీకాల రక్షణను కూడా దాటేస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ వర్గంలో ఇప్పటి వరకు గుర్తించిన వేరియెంట్లలో ఇది అత్యధిక మార్పులు కలిగిందిగా భావిస్తున్నారు. ఇది వ్యాప్తి విధానాన్ని మరింత ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇప్పటికే అనేక దేశాల్లో దీన్ని గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో వ్యర్థ జలాల విశ్లేషణలోనూ ఈ వేరియెంట్ బయట పడింది. అయితే ఈ వేరియెంట్ వల్ల ఇప్పటి వరకు హాస్పిటల్లో చేరిన వారి సంఖ్య లేదా మరణించిన వారి సంఖ్య నమోదు అయినట్లు ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
లక్షణాలు అలాగే ఉంటాయి..
BA.3.2 వేరియెంట్ ఒకవేళ ఎవరికైనా సోకితే గతంలో కోవిడ్ సమయంలో చాలా మందికి కనిపించిన సాధారణ లక్షణాలే దీనికి కూడా కనిపిస్తాయి. దగ్గు, అలసట, విపరీతమైన జలుబు, ముక్క కారడం లేదా ముక్కు దిబ్బడ, తలనొప్పి, గొంతు నొప్పి, స్వల్పంగా జ్వరం, శరీర నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. కొందరికి రుచి లేదా వాసన కోల్పోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం, చర్మంపై దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపిన ప్రకారం కరోనా వైరస్ వేరియెంట్‌ను బట్టి వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు మారుతాయి. టీకా రక్షణ, రోగ నిరోధక శక్తిని బట్టి కూడా కొందరిలో లక్షణాలు భిన్నంగా ఉంటాయి. అయితే BA.3.2 ను అంతర్జాతీయంగా పలు దేశాల్లో గుర్తించినా భారత్‌లో ఇప్పటి వరకు ఈ వేరియెంట్ దాఖలాలు కనిపించలేదు. కానీ భవిష్యత్తులో ఇక్కడ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని సైంటిస్టులు తెలిపారు. ప్రభుత్వాలు ఈ విషయమై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






