Jharkhand Engineer Turns Farmer | ఇంజినీరింగ్ జాబ్ వదిలి వ్యవసాయం చేస్తూ.. రోజుకు రూ.15వేల సంపాదన..
Jharkhand Engineer Turns Farmer | ప్రస్తుతం యువత అందరూ అత్యధిక వేతనాలను అందించే ఉద్యోగాల వెంట పడుతున్నారు. డిగ్రీ లేదా ఇంజినీరింగ్, ఇతర ఏ విద్యను పూర్తి చేసినా సరే ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరాలని, అత్యధిక వేతనం తీసుకోవాలని ఆశిస్తున్నారు.
Jharkhand Engineer Turns Farmer | ప్రస్తుతం యువత అందరూ అత్యధిక వేతనాలను అందించే ఉద్యోగాల వెంట పడుతున్నారు. డిగ్రీ లేదా ఇంజినీరింగ్, ఇతర ఏ విద్యను పూర్తి చేసినా సరే ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరాలని, అత్యధిక వేతనం తీసుకోవాలని ఆశిస్తున్నారు. అయితే అలా చేయడం సరైందే కానీ.. అందులో పూర్తిగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఒకరి కింద పనిచేయాలి. నగర జీవితంలో కొనసాగాలి. వీటన్నింటినీ తట్టుకుంటేనే ఉద్యోగాలు చేయాలి. అయితే ఇదంతా శ్రమ అని భావించిన ఆ యువకుడు చేస్తున్న ఇంజినీరింగ్ జాబ్‌ను వదిలేసి సొంత ఊరు బాట పట్టాడు. వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఆరంభంలో విఫలం అయ్యాడు. అయినప్పటికీ మెళకువలను నేర్చుకుంటూ ముందుకు సాగాడు. ఇప్పుడు లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాడు. తమ గ్రామంలోనే కాదు దేశంలోని యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాడు.
యూట్యూబ్‌లో నేర్చుకుంటూ..
జార్ఖండ్‌లోని ఛాత్రా లావాలౌంగ్ బ్లాక్ పరిధిలో ఉన్న అంబాతండ్ అనే గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాడు. పూణెలో చక్కని ఉద్యోగం కూడా లభించింది. ఆరు నెలల పాటు అందులో కొనసాగాడు కూడా. అయితే ఆ ఉద్యోగం అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. నగర జీవితం అతనికి నచ్చలేదు. నిత్యం ఒత్తిడితో సహవాసం, యాంత్రిక జీవనం, కాలుష్యం వంటివన్నీ అతన్ని ఆలోచింపజేశాయి. దీంతో అతను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ఊరు బాట పట్టాడు. వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యవసాయంలో మెళకువలను నేర్చుకుంటూ ముందుకు సాగాడు.

ఫలించిన శ్రమ..
అలా బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన ఉదయ్ తన సొంత ఊరిలోనే వ్యవసాయం వైపు మళ్లాడు. అయితే ఆరంభంలో అతనికి సుమారుగా రూ.1 లక్ష మేర నష్టం వచ్చింది. అయినప్పటికీ వ్యవసాయాన్ని వీడలేదు. ఈసారి మరింత శ్రమిస్తూ మెళకువలను నేర్చుకోవడమే కాదు, సమీపంలో ఉన్న అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్లు, వ్యవసాయ శిక్షణా కేంద్రాలను సందర్శించాడు. వాటిల్లో స్వల్పకాలిక వ్యవధి కలిగిన కోర్సులను పూర్తి చేశాడు. అక్కడే ఉన్న నిపుణుల ద్వారా వ్యవసాయంలో ఎప్పటికప్పుడు మరిన్ని మెళవకులను నేర్చుకుంటూ ఎంతో నైపుణ్యం సాధించాడు. ఇక ఈసారి అతను తమకు ఉన్న 5 ఎకరాల పొలంతోపాటు మరో 15 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో మిర్చి, టమాటా, పచ్చి బఠానీ, క్యాబేజీ వంటి పంటలను వేశాడు. అయితే ఈసారి మాత్రం అతని శ్రమ వృథా కాలేదు. అద్భుతమైన రీతిలో పంటలు పండాయి. చక్కని ఆదాయం కూడా వచ్చింది.
రోజుకు రూ.15వేల వరకు ఆదాయం..
గతేడాది జూలై నుంచి ఉదయ్ తన పొలంలో పంటల ద్వారా రోజుకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు. కొన్ని సార్లు మిర్చి పంటకు అత్యధిక ధర పలుకుతుందని అతను తెలిపాడు. కేజీ మిర్చి ధర రూ.40 నుంచి రూ.80 మధ్యలో ఉందని, దీని వల్లే తనకు అధిక లాభం వస్తుందని తెలిపాడు. ఈ క్రమంలోనే గత ఏడాది కాలంలో ఉదయ్ 21 టన్నుల మిర్చిని పండించడం ద్వారానే రూ.10 లక్షలకు పైగా ఆదాయం పొందడం విశేషం. ఇక ఉదయ్ తన పొలంలో పంటలను పండించేందుకు గాను ఎక్కువగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. డ్రిప్ ఇరిగేషన్ కింద 90 శాతం సబ్సిడీని పొందాడు. దీంతో కేవలం రూ.15వేల వరకు మాత్రమే అతనికి పెట్టుబడి అయింది. అయితే ఉదయ్ ప్రస్తుతం ఈ ఏడాదికి గాను 6 ఎకరాల్లో మిర్చిని, 6 ఎకరాల్లో టమాటాలను, 3 ఎకరాల్లో పచ్చి బఠానీలను పండించాలని ఆలోచిస్తున్నాడు. అలాగే పిజియన్ పీస్ అనే మరో రకం పంటను పండించాలని కూడా చూస్తున్నాడు. దీంతో అధిక ఆదాయం పొందే మార్గాలను అన్వేషిస్తున్నాడు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






