Farmer | తన విగ్రహాన్ని తానే ఏర్పాటు చేసుకున్న రైతు బిడ్డ
Farmer | చనిపోయిన భార్య విగ్రహంతో పాటు, ఆమె విగ్రహాన్ని ఒంటరిగా ఉంచడం ఇష్టంలేని రైతుబిడ్డ కళ్లెం నర్సింహా రెడ్డి (Kallem Narsimha Reddy) తన విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసుకుని, భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా తన వ్యవసాయ (Agriculture) క్షేత్రంలో స్వయంగా తానే ఆవిష్కరించనున్నాడు.
తన విగ్రహాన్ని తానే ఏర్పాటు చేసుకున్న రైతు బిడ్డ
Farmer | వ్యవసాయం (Agriculture) పై మక్కువతో అమెరికా (America) వెళ్లినా వేల ఎకరాలు లీజుకు తీసుకుని వ్యవసాయమే చేశాడు. మాతృభూమికి తిరిగి వచ్చినా వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో వ్యవసాయక్షేత్రంలోనే జీవనం సాగిస్తున్నాడు. తనకు తోడుగా ఉన్న ధర్మపత్ని మరణించడంతో ఆమెపై ఉన్న ప్రేమతో అక్కడే తన భార్య విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్నాడు. కానీ, తన భార్యను ఒంటరిగా ఉంచొద్దని భావించి తన విగ్రహాన్ని సైతం పక్కనే ఏర్పాటు చేయించి, ఆ విగ్రహాలను తనే స్వయంగా ఆవిష్కరించనున్నాడు.
ఆయన వయసు 89 ఏళ్లు. పేరు కళ్లెం నర్సింహా రెడ్డి (Kallem Narsimha Reddy). అచ్చం రైతు బిడ్డ. ఈ వయసులోనూ వ్యవసాయం మీద మమకారం పోలేదు. 30 ఏళ్లు అమెరికాలో ఉన్నారు. అక్కడ కూడా వ్యవసాయమే. ఐదువేల ఎకరాలు లీజుకు తీసుకుని రకరకాల పంటలు సాగు చేసి రికార్డు సృష్టించారు. అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ (Jimmy Karter) నుంచి కూడా ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. కొన్నాళ్ళ క్రితం మాతృభూమిపై మమకారంతో తెలంగాణకు తిరిగి వచ్చారు. చిలుకూరు సమీపంలో కళ్లెం నర్సింహా రెడ్డి పేరుతో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో సాగు పద్దతులతో పేరు గడించిన కళ్లెం ఇప్పుడు తన సొంత ఫామ్ లో మొక్కలు, చెట్లు పెంచి ప్రకృతిలోనే జీవితం గడుపుతున్నారు. దేనికీ వయసు అడ్డురారని ఇప్పటికే తన పనులన్నీ తానే చేసుకుంటారు. తోటంతా కలియ తిరగనిదే ఆయనకు నిద్ర పట్టదు. తెలంగాణ పల్లె నుంచి అమెరికా దాకా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కళ్లెం నర్సింహా రెడ్డి ఇప్పుడు మరోలా వార్తల్లోకి ఎక్కారు. వ్యవసాయ క్షేత్రం లో తన భార్య కళ్లెం లక్ష్మి విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకుంటున్నరు. భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా రేపు (19.12.25 శుక్రవారం) విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. భార్య పై ఉన్న ప్రేమతో రాజస్థాన్ లో విగ్రహాలు తయారు చేయించారు. ఈ విగ్రహాలు స్వయంగా ఆయనే ఆవిష్కరించనుండడం విశేషం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






