Mushroom Farming | ఇంట్లోనే చిన్న రూమ్‌లో పుట్టగొడుగులను పెంచుతూ లక్షలు సంపాదించవచ్చు
స్పానింగ్ అంటే కంపోస్ట్‌పై పుట్టగొడుగుల విత్తానాలను చల్లడం అన్నమాట. అయితే.. పుట్టగొడుగులకు విత్తనాలు అంటూ ఏం ఉండవు. కానీ.. దానికి సంబంధించిన మైసీలియం అనే బ్యాక్టీరియాను ఇస్తారు. దాన్ని కంపోస్ట్‌లో చల్లాల్సి ఉంటుంది.
Agriculture | Published On Dec 22, 2025, 4.49 pm IST
Mushroom Farming | ఈరోజుల్లో పుట్టగొడుగులకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద స్టోర్స్‌లో మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. ధర కూడా ఎక్కువే. నాన్ వెజ్ తినని వాళ్లు ఎక్కువగా పుట్టగొడుగులను తింటుంటారు. ఇందులో పోషకాలు కూడా బోలెడు ఉంటాయి. అందుకే పుట్టగొడుగులకు ఈ మధ్య డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్‌లో డిమాండ్‌కి తగ్గ సప్లయి కూడా లేదు. అందుకే ఎవ్వరైనా సరే ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని చేసి లక్షలు సంపాదించవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. పుట్టగొడుగులను ఇంట్లోనే పెంచుతూ డబ్బులు సంపాదించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.

దీన్ని చాలామంది ఒక హాబీలా చేస్తుంటారు. ఎకరాలకు ఎకరాల భూమి ఉండాల్సిన పని లేదు. మీరు ఉంటున్న ఇంట్లోనే చిన్న సెటప్ చేసుకుంటే చాలు.
Mushroom Farming | ఎక్కువగా పండించే పుట్టగొడుగులు ఇవే
చాలామంది మన దేశంలో అయితే మూడు రకాల పుట్టగొడుగులను పెంచుతుంటారు. బటన్ పుట్టగొడుగులు, ఓయిస్టర్ పుట్టగొడుగులు, మిల్కీ పుట్టగొడుగులు. ఈ మూడు రకాల పుట్టగొడుగులకే మన దగ్గర డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో బటన్ పుట్టగొడుగులు చల్లగా ఉండే వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే పెరుగుతాయి. ఇక.. ఓయిస్టర్, మిల్కీ పుట్టగొడుగులు మాత్రం కొంచెం వెచ్చగా ఉండే వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయి.

మీ ప్రాంతంలో ఉండే వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఏ పుట్టగొడుగులను పెంచాలో మీరే నిర్ణయించుకోవచ్చు. ముందుగా ఏ వెరైటీని పెంచాలో నిర్ణయించుకున్నాక దాని కోసం కంపోస్టింగ్ ని సిద్ధం చేసుకోవాలి. కంపోస్ట్‌ని సహజసిద్ధంగా కూడా తయారు చేసుకోవచ్చు. లేదా సింథటిక్ కంపోస్ట్‌ని వాడొచ్చు.
సింథటిక్ అంటే యూరియా, గోదుమ పొట్టు, తవుడు, జిప్సమ్, కాల్షియం అమ్మోనియం నైట్రేట్ లేదా3 అమ్మోనియం సల్ఫేట్ లాంటి వాటితో తయారు చేసుకోవచ్చు. ఒక ఖాళీ ట్రే తీసుకొని వాటిలో ఇవన్నీ వేసి బాగా కలిపి స్ప్రింకింగ్ పద్ధతిలో నీళ్లు పోస్తూ తయారు చేసుకోవచ్చు.
నాచురల్ కంపోస్ట్ అంటే.. గోదుమ పొట్టు, జిప్సమ్, కోడి పెంట, గుర్రం పెండ లాంటి వాటితో చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కలిపి కొన్ని రోజుల వరకు ట్రేలో పులిసేలా చేయాలి. డీకంపోజ్ అయ్యాక స్పానింగ్ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది.
స్పానింగ్ అంటే ఏంటి?
స్పానింగ్ అంటే కంపోస్ట్‌పై పుట్టగొడుగుల విత్తానాలను చల్లడం అన్నమాట. అయితే.. పుట్టగొడుగులకు విత్తనాలు అంటూ ఏం ఉండవు. కానీ.. దానికి సంబంధించిన మైసీలియం అనే బ్యాక్టీరియాను ఇస్తారు. దాన్ని కంపోస్ట్‌లో చల్లాల్సి ఉంటుంది. దాని తర్వాత కంపోస్ట్ మొత్తాన్ని న్యూస్ పేపర్ లాంటి పేపర్‌తో కప్పేయాలి. ఆ తర్వాత రెగ్యులర్‌గా ఆ కంపోస్ట్‌కి మోతాదులో వాటర్ కొడుతూ ఉండాలి.

ఆ తర్వాత కొన్ని రోజులకు కంపోస్ట్ మీద ఒక లేయర్‌ని ఏర్పాటు చేసుకోవాలి. దాని కోసం ఆవు పేడ, మట్టితో కలిపి దీన్ని తయారు చేసుకోవాలి. ఆవు పేడను మాత్రం ముందే ఫిల్టర్, స్టెరిలైజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మట్టిని కంపోస్ట్ మీద ఒక లేయర్‌లా పేర్చాలి. కనీసం 25 నుంచి 30 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉండేలా చేసుకోవాలి.
15 రోజుల తర్వాత పుట్టగొడుగుల క్యాప్ కనిపిస్తుంది. మార్కెట్‌లో డిమాండ్ బట్టి వాటిని జాగ్రత్తగా కోసుకొని మార్కెట్‌కి విక్రయించవచ్చు. కేవలం పైన కనిపించే మష్‌రూమ్ క్యాప్‌ని మాత్రమే కోయాల్సి ఉంటుంది. స్టెమ్‌ని అలాగే ఉంచితే మరో క్రాప్ రావడానికి ఆ స్టెమ్ ఉపయోగపడుతుంది. అలా ఒక్కసారి స్పానింగ్ చేసి మూడు నాలుగు క్రాప్స్‌ని పండించవచ్చు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






