డబ్బు తక్కువగా ఖర్చు చేసి ఎక్కువగా పొదుపు చేయాలని చూస్తున్నారా..? అయితే ఈ దేశాలకు వెళ్లండి..!
ఉద్యోగం లేదా వ్యాపారం.. ఎవరు ఏది చేసినా సరే డబ్బు సంపాదించాలని, ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలనే చూస్తారు. విద్య, వైద్యం, వినోదం వంటి అంశాల్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుతం చాలా వరకు ఉన్న దేశాల్లో సగటు పౌరులకు డబ్బు సంపాదించడమే కష్టంగా మారింది. ఇక వారు డబ్బును పొదుపు చేయడం అసాధ్యంగా మారిందనే చెప్పవచ్చు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. సరైన జీతాలు లేకపోవడం, అధిక పన్నులు వసూలు చేయడం, విద్య, వైద్యం వంటి వాటికే సంపాదన మొత్తం ఖర్చు కావడం వంటి పలు ప్రధాన అంశాల కారణంగా చాలా మంది అనేక దేశాల్లో డబ్బును పొదుపు చేయలేకపోతున్నారు. అయితే ఆసియాలోని పలు దేశాల్లో మాత్రం పౌరుల జీవన విధానం చాలా అద్భుతంగా ఉందని, వారు ఎంతో డబ్బును పొదుపు చేయడమే కాదు, ఏదీ దూరం అవకుండా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఓ సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది.
ట్రావెల్ అండ్ టూర్ వరల్డ్ రిపోర్ట్స్ ప్రకారం ఆసియా దేశాల్లోకెల్లా సింగపూర్‌లో పౌరులు ఎక్కువగా డబ్బును పొదుపు చేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారని వెల్లడైంది. సింగపూర్ తరువాతి స్థానాల్లో ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, హాంగ్ కాంగ్ వంటి దేశాలు నిలవడం విశేషం. సింగపూర్‌తోపాటు ఆయా దేశాల్లో పన్నులు చాలా తక్కువగా ఉండడమే కాకుండా, ద్రవ్యోల్బణం తక్కువగా ఉందని, అలాగే పౌరులకు ఆయా దేశాలు కల్పించే సదుపాయాలు కూడా అద్భుతంగా ఉన్నాయని, కనుకనే వారు విద్య, వైద్యం, వినోదం వంటి వాటికి చాలా తక్కువగా ఖర్చు చేస్తున్నారని, దీంతో వారికి డబ్బులు ఎంతగానో ఆదా అవుతున్నాయని తేలింది. ఈ లిస్ట్‌లో సింగపూర్ అగ్ర స్థానంలో ఉండగా అక్కడి సగటు పౌరుల వేతనం నెలకు 4600 అమెరికన్ డాలర్లుగా ఉందని, అలాగే సగటు సింగపూర్ పౌరుడి ఆస్తి విలువ 3.83 లక్షల అమెరిక్ డాలర్లుగా ఉన్నట్లు ఆ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది.
ఈ క్రమంలోనే సింగపూర్‌లో పౌరులకు అధిక శాతం ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని, వారు డబ్బును అధికంగా పొదుపు చేయగలుగుతున్నారని పేర్కొన్నారు. సింగపూర్‌లో సెటిల్ అవ్వాలనుకునే వారికి ఆర్థికపరంగా ఎంతో ఉపయోగం ఉంటుందని అంటున్నారు. ద్రవ్యోల్బణం నానాటికీ పెరుగుతూనే ఉన్నా అక్కడి ధరలు మాత్రం ఎంతో స్థిరంగా ఉన్నాయని, ఈ కారణంగా ప్రజలపై ఆర్థిక భారం పడడం లేదని తేల్చారు. కనుకనే చాలా మందికి ప్రస్తుతం సింగపూర్ ఫేవరెట్ దేశంగా మారిందన్నారు. అలాగే సింగపూర్ తరువాత ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, హాంగ్ కాంగ్ వంటి దేశాలకు వెళ్లేందుకు కూడా చాలా మంది ఇష్టపడుతున్నారని, ఆయా దేశాల్లోనూ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉందని, డబ్బును అధికంగా పొదుపు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎవరైనా డబ్బు సంపాదించాలని అనుకుంటే ఆయా దేశాలకు వెళ్లడం ఉత్తమమని సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



