Electricity Bill | విద్యుత్ బిల్లు అధికంగా వస్తుందా..? ఈ తప్పులు చేస్తున్నారేమో చెక్ చేయండి..!
Electricity Bill | ఇంట్లో ఎలక్ట్రిక్ లేదా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర వస్తువుల వినియోగం పెరిగినా, లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల కూడా చాలా మందికి అప్పుడప్పుడు విద్యుత్ బిల్లులు అధికంగా వస్తుంటాయి. చిన్న చిన్న అలవాట్లు, పాత పరికరాలు, ఇల్లు నిర్మాణ లోపాలు, సాంకేతిక సమస్యలు కూడా బిల్లును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Electricity Bill | ఇంట్లో ఎలక్ట్రిక్ లేదా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర వస్తువుల వినియోగం పెరిగినా, లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల కూడా చాలా మందికి అప్పుడప్పుడు విద్యుత్ బిల్లులు అధికంగా వస్తుంటాయి. చిన్న చిన్న అలవాట్లు, పాత పరికరాలు, ఇల్లు నిర్మాణ లోపాలు, సాంకేతిక సమస్యలు కూడా బిల్లును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే సరైన కారణాలను గుర్తించి సరిదిద్దుకుంటే విద్యుత్ బిల్లు ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. అందుకు గాను పలు సూచనలను పాటించాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. చాలా పరికరాలు ఉపయోగంలో లేకపోయినా ప్లగ్‌లో ఉండగా విద్యుత్ తీసుకుంటూనే ఉంటాయి. దీనిని ఫాంటమ్ పవర్ లేదా స్టాండ్‌బై పవర్ అంటారు. టీవీలు, మొబైల్ చార్జర్లు, గేమింగ్ కన్సోల్స్, మైక్రోవేవ్ ఓవెన్లు వంటి పరికరాలు ఇలా విద్యుత్ ను వృథా చేస్తాయి. అవసరం లేకపోతే ప్లగ్ తీసేయడం లేదా స్విచాఫ్ చేయడం ద్వారా విద్యుత్ వృథాను అరికట్టవచ్చు.
స్టార్ రేటింగ్..
పాత ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, డ్రయర్లు వంటి పరికరాలు ఆధునిక ఎనర్జీ ఎఫిషియెంట్ మోడళ్లతో పోలిస్తే ఎక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి. ప్రారంభ ఖర్చు ఎక్కువైనా, స్టార్ రేటింగ్ అధికంగా ఉన్న పరికరాలు దీర్ఘకాలంలో బిల్లులను తగ్గిస్తాయి. కనుక పాత మోడల్స్ ఉంటే వాటిని మార్చేసి కొత్త మోడల్స్‌ను తీసుకోవడం మంచిది. అలాగే 5 స్టార్ లేదా కనీసం 4 స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలు లేదా వస్తువులను ఉపయోగిస్తే విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాగే తలుపులు, కిటికీలు, పైకప్పు భాగాల్లో గాలి లీకేజీలు ఉంటే వేడి లేదా చల్లని గాలి బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా ఏసీ లేదా హీటింగ్ సిస్టమ్ ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. సరైన ఇన్సులేషన్, గాలి లీకేజీలను మూసివేయడం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుంది. దీంతో ఏసీలపై భారం కూడా పడదు. అలాగే విద్యుత్‌ను ఆదా చేసి బిల్లును తగ్గించుకోవచ్చు.
పాత బల్బులు..
చాలా మంది ఇప్పటికీ పాత తరం బల్బులనే వాడుతున్నారు. కానీ ఇవి ఎక్కువ శక్తిని వాడుకుంటాయి. అదంతా వేడి రూపంలో బయటకు వస్తుంది. కనుక ఈ బల్బులకు బదులుగా LED బల్బులను వాడాల్సి ఉంటుంది. ఇవి తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ కాలం పనిచేస్తాయి. అలాగే అవసరం లేకుండా లైట్లు, పరికరాలను ఆన్‌లో ఉంచడం కూడా మంచిది కాదు. దీని వల్ల విద్యుత్ వినియోగం అధికమవుతుంది. ఫలితంగా బిల్లును అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఇక ఏసీలను వాడేవారు ఎప్పటికప్పుడు ఎయిర్ ఫిల్టర్లను క్లీన్ చేయించడం ద్వారా విద్యుత్‌ను ఎక్కువగా వినియోగించుకోకుండా అడ్డుకోవచ్చు. దీంతో ఏసీపై భారం కూడా తగ్గుతుంది. విద్యుత్ తక్కువగా వినియోగం అవుతుంది. చివరకు బిల్లు కూడా తక్కువగానే వస్తుంది.
విద్యుత్ పరికరాల్లో లోపాలు..
పాత వైర్లు, విద్యుత్ మీటర్లలో లోపాలు రావడం, ఓవర్‌లోడెడ్ సర్క్యూట్లు, ఫాల్ట్ ఉన్న పరికరాలు విద్యుత్ వినియోగం అధికం అయ్యేలా చేస్తాయి. కనుక ఈ లోపాలు అన్నింటినీ సరిచేసుకోవాలి. వాస్తవానికి ఇవన్నీ విద్యుత్ ప్రమాదాలకు కూడా కారణం అవుతాయి. కనుక ఈ విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. వీటిని పాటిస్తే విద్యుత్ ప్రమాదాలను జరగకుండా నివారించడమే కాదు, విద్యుత్ వినియోగాన్ని కూడా తక్కువ చేయవచ్చు. దీంతో బిల్లు గణనీయంగా తగ్గుతుంది. ఇలా కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ అవసరం అయిన జాగ్రత్తలను పాటిస్తే విద్యుత్ ప్రమాదాలను నివారించడమే కాకుండా, బిల్లులను కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. వీటిని పాటించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. కనుక పెద్ద ఎత్తున బిల్లును ఆదా చేయవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!
- ●Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్
- ●Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ●Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్డేట్ - ఆ ఒక్కటే మిగిలింది!
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రముఖులు

Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!

Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్

Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?

Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్






