త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR Letter to Revanth Reddy | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపండి.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌

KTR Letter to Revanth Reddy | రాష్ట్రంలో కావాల‌నే బొగ్గు, క‌రెంటు సంక్షోభాన్ని సృష్టించి.. విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ.3 వేల కోట్ల భారీ స్కామ్‌కు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

S

Telangana | Published On Oct 15, 2026, 5.57 pm IST

KTR Letter to Revanth Reddy | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపండి.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌
Advertisement
  • భోత్రా లాజిస్టిక్స్‌తో ప్ర‌భుత్వం, సింగ‌రేణి చేసుకున్న ర‌హ‌స్య అగ్రిమెంట్లు బ‌య‌ట‌పెట్టాలి
  • మొత్తం కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి
  • కేటీఆర్ డిమాండ్‌

KTR Letter to Revanth Reddy | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో కావాల‌నే బొగ్గు, క‌రెంటు సంక్షోభాన్ని సృష్టించి.. విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ.3 వేల కోట్ల భారీ స్కామ్‌కు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. భోత్రా లాజిస్టిక్స్ అనే అనుమానాస్పద కంపెనీతో ముఖ్యమంత్రి ముందే చీకటి ఒప్పందం కుదుర్చుకుంద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి చేసుకున్న అన్ని రహస్య అగ్రిమెంట్లు బయటపెట్టాలన్నారు. ఏ ప్రాతిపదికన సదరు కంపెనీని ఎంపిక చేశారో రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. మొత్తం కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈమేర‌కు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బ‌హిరంగ లేఖ రాశారు.

ఇవీ లేఖ వివ‌రాలు..

కావాలనే కృత్రిమ బొగ్గు కొరత, కరెంట్ సంక్షోభం సృష్టించి అదను చూసి కంపెనీని రేవంత్‌ రంగంలోకి దింపారు. విదేశీ బొగ్గు దిగుమతి పేరిట సింగరేణికి మరణశాసనం రాస్తున్నారు. కాంగ్రెస్-బీజేపీ కలిసి చేస్తున్న ఈ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు సరఫరా చేసేందుకు సింగరేణిలో G9 బొగ్గు లేదని అబద్ధాలు చెప్పడం స‌రికాదు. సింగరేణి సంస్థకు రూ. 60 వేల కోట్ల బాకీ చెల్లించకుండా సంస్థను కుప్పకూల్చే కుతంత్రం చేస్తున్నారు.

దేశీయ సంస్థలను పక్కనపెట్టి కమీషన్ల కోసమే విదేశీ బొగ్గు కోసం వెంపర్లాడుతున్నారు. కమీషన్ల ముసుగులో ప్రతి టన్నుపై రూ.1,500 చొప్పున ఏకంగా రూ.3,000 కోట్ల దోపిడీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగం సిద్ధం చేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకోవాల్సింది పోయి సహకరిస్తున్నారు. సింగరేణిని బలహీనపరిచి.. విదేశీ బొగ్గు దిగుమతికి జరుగుతున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోం అని కేటీఆర్ లేఖ‌లో హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement