త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heart Health | న్యూ ఇయ‌ర్ పార్టీ సీజ‌న్‌.. హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది జాగ్ర‌త్త అంటూ వైద్యుల హెచ్చ‌రిక‌..

నూత‌న సంవ‌త్స‌రం అన‌గానే చాలా మంది ఎక్క‌డ, ఎలా పార్టీ చేసుకుందాం అని ఆలోచిస్తుంటారు. యువ‌త ఎక్కువ‌గా న్యూ ఇయ‌ర్ వేడుకల్లో పాల్గొంటుంటారు.

S

Lifestyle | Published On Dec 19, 2025, 7.42 am IST

Heart Health | న్యూ ఇయ‌ర్ పార్టీ సీజ‌న్‌.. హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది జాగ్ర‌త్త అంటూ వైద్యుల హెచ్చ‌రిక‌..
Advertisement

Heart Health | నూత‌న సంవ‌త్స‌రం అన‌గానే చాలా మంది ఎక్క‌డ, ఎలా పార్టీ చేసుకుందాం అని ఆలోచిస్తుంటారు. యువ‌త ఎక్కువ‌గా న్యూ ఇయ‌ర్ వేడుకల్లో పాల్గొంటుంటారు. అయితే ప్ర‌స్తుతం అన్ని వ‌య‌స్సుల వారు న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ చాలా మంది ఈ వేడుక‌ల సంద‌ర్భంగా ఓ విష‌యాన్ని గ‌మ‌నించ‌డం లేద‌ని, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల వ‌ల్ల అతిగా మ‌ద్యం సేవించ‌డంతోపాటు స్నాక్స్ అధికంగా తింటార‌ని, నిద్ర ఉండ‌ద‌ని, దీనికి తోడు భారీ శ‌బ్దాల న‌డుమ తీవ్ర‌మైన ఒత్తిడితో డ్యాన్స్ చేస్తార‌ని, దీని వ‌ల్ల శ‌రీరంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ విధంగా పార్టీలు చేసుకుంటే గుండె పోటు వచ్చే ముప్పు గ‌ణ‌నీయంగా పెరుగుతుంద‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు షాలిమార్ బాగ్‌లోని ఫోర్టిస్ హాస్పిట‌ల్‌కు చెందిన కార్డియాల‌జీ అండ్ ఎల‌క్ట్రో ఫిజియాల‌జీ ప్రిన్సిపల్ డైరెక్ట‌ర్ అండ్ హెచ్‌వోడీ డాక్ట‌ర్ నిత్యానంద్ త్రిపాఠి వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

ఇవే కార‌ణం..

క్రిస్మ‌స్‌, న్యూ ఇయ‌ర్ రెండూ వ‌రుస‌గా వ‌స్తాయ‌ని, ఈ స‌మ‌యంలో చాలా మంది పార్టీ మూడ్‌లో ఉంటార‌ని, చాలా మంది నిరంత‌రాయంగా పార్టీలు చేసుకుంటార‌ని, అయితే ఈ స‌మ‌యంలో గుండె జ‌బ్బులు లేని వారికి కూడా ఆ ముప్పు గ‌ణ‌నీయంగా పెరుగుతుంద‌ని దీన్నే హాలిడే హార్ట్ సిండ్రోమ్ (హెచ్‌హెచ్ఎస్‌) అని పిలుస్తార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో విప‌రీతంగా మ‌ద్యం సేవించ‌డం, స్నాక్స్‌ను అధికంగా తీసుకోవ‌డం అధికంగా ఉంటుంద‌ని అన్నారు. అలాగే న్యూ ఇయ‌ర్ పార్టీల సంద‌ర్భంగా అస‌లు నిద్ర ఉండ‌ద‌ని, భారీ శబ్దాల న‌డుమ శ‌రీరంపై ఒత్తిడిని పెంచుతూ డ్యాన్స్ చేస్తార‌ని, ఇవ‌న్నీ గుండె జ‌బ్బుల ప్ర‌మాదాన్ని పెంచుతాయ‌ని అన్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల బీపీ లేని వారికి కూడా బీపీ వ‌స్తుంద‌ని, అలాగే పార్టీల అనంత‌రం చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో హాస్పిట‌ల్స్‌లో చేరుతున్నార‌ని తెలిపారు. కొందరికి గుండె పోటు కూడా వ‌స్తుంద‌ని అన్నారు.

అతిగా మ‌ద్యం సేవించ‌డం..

పార్టీల సంద‌ర్భంగా అతిగా మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల ఆ ప్ర‌భావం గుండెపై ప‌డుతుంద‌ని అన్నారు. సాధార‌ణ స‌మ‌యాల్లో మ‌ద్యం సేవిస్తే ఒక‌టి లేదా రెండు డ్రింక్స్ మాత్ర‌మే తాగుతార‌ని, అది కూడా కాస్త స‌మ‌యం తీసుకుంటార‌ని, కానీ పార్టీల సంద‌ర్బంగా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ డ్రింక్స్ తీసుకుంటార‌ని, కొన్ని సార్లు 4 లేదా 5 డ్రింక్స్ క‌న్నా ఎక్కువ‌గా తాగుతార‌ని అన్నారు. దీని వ‌ల్ల గుండె సాధార‌ణ విద్యుత్ ప్ర‌వాహ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని అన్నారు. దీని కార‌ణంగా అప్ప‌టి వ‌ర‌కు ఆరోగ్యంగా ఉన్న హార్ట్ బీట్ కూడా అసాధాణంగా మారే ప్ర‌మాదం ఉంటుంద‌న్నారు. దీని వల్ల హైబీపీ, గుండె పోటు వ‌చ్చే రిస్క్ మ‌రింత పెరుగుతుంద‌న్నారు. అందుక‌నే న్యూ ఇయ‌ర్ పార్టీల అనంత‌రం చాలా మందికి హైబీపీ, హార్ట్ ఎటాక్ వ‌స్తున్నాయ‌ని, ఈ విష‌యాన్ని చాలా మంది గ‌మ‌నించ‌డం లేద‌ని తెలిపారు. ఇక ఈ విష‌యాల‌ను నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్‌), యూరోపియ‌న్ సొసైటీ ఆఫ్ కార్డియాల‌జీ (ఈఎస్‌సీ)లు కూడా అధ్య‌య‌నాల రూపంలో ప్ర‌చురించాయ‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.

అధికంగా సోడియం..

ఇక న్యూ ఇయ‌ర్ పార్టీల సంద‌ర్బంగా చాలా మంది స్నాక్స్‌ను అతిగా తింటార‌ని, వాటిల్లో సోడియం పెద్ద ఎత్తున ఉంటుంద‌ని, అది అంతా శ‌రీరంలోని చేరుతుంద‌న్నారు. సాధార‌ణంగా మ‌నం రోజుకు 2300 మిల్లీగ్రాముల మోతాదులో మాత్ర‌మే సోడియం తీసుకోవాల‌ని, కానీ పార్టీల్లో ఈ మోతాదు మ‌రీ అతిగా ఉంటుంద‌ని తెలిపారు. దీని వ‌ల్ల శ‌రీరంలో ద్ర‌వాలు అధికంగా చేరుతాయ‌ని, సోడియంను బ‌య‌ట‌కు పంపేందుకు గుండె తీవ్రంగా శ్ర‌మించాల్సి వ‌స్తుంద‌ని, దీని వ‌ల్ల గుండెపై అద‌న‌పు ఒత్తిడి ప‌డుతుంద‌న్నారు. ఇది బీపీ పెరిగేలా చేస్తుంద‌ని, ఈ కార‌ణంగా అంత‌కు ముందు హైబీపీ లేని వారికి కూడా న్యూ ఇయ‌ర్ పార్టీల అనంత‌రం హైబీపీ వస్తోంద‌ని తెలిపారు. క‌నుక ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

ఇలా చేయాలి..

అలాగే న్యూ ఇయర్ పార్టీల సంద‌ర్బంగా భారీ శ‌బ్దం న‌డుమ చాలా మంది గడుపుతారు. దీనికి తోడు నిద్ర కూడా ఉండ‌దు. ఇవి కూడా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తాయి. ఇవి గుండె పోటు ముప్పును మ‌రింత పెంచుతాయ‌ని డాక్ట‌ర్ నిత్యానంద్ త్రిపాఠి వెల్ల‌డించారు. అయితే పార్టీల సంద‌ర్భంగా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచ‌న‌లు పాటించాల‌ని ఆయ‌న తెలిపారు. ఒక‌టి లేదా రెండు డ్రింక్స్ మాత్ర‌మే తాగాల‌ని, స్నాక్స్‌ను అతిగా తిన‌కూడ‌ద‌ని, శ‌రీరంపై ఒత్తిడి క‌లిగేలా భారీ శ‌బ్దాలు, డీజేల న‌డుమ ఎక్కువ సేపు గ‌డ‌ప‌వ‌ద్ద‌ని, 7 నుంచి 8 గంట‌ల నిద్ర అవ‌స‌ర‌మ‌ని అన్నారు. దీని వ‌ల్ల న్యూ ఇయ‌ర్ పార్టీల సంద‌ర్భంగా వ‌చ్చే గుండె స‌మ‌స్య‌ల‌ను రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని, గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చ‌ని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement