Cucumber | చేదుగా ఉండే కీరదోసను తింటే ప్రమాదమా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
Cucumber | వేసవికాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాల్లో కీరదోస ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం, శరీరానికి చల్లదనాన్ని అందించడం, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా దీనిని తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.
Cucumber | వేసవికాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాల్లో కీరదోస ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం, శరీరానికి చల్లదనాన్ని అందించడం, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా దీనిని తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే కీరదోస సాధారణంగా సురక్షితమైనదే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో కొందరికి దుష్ప్రభావాలు లేదా ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉందని న్యూట్రిషనిస్ట్ దీప్తి ఖటూజా తెలిపారు. ఫిటోటెరాపియా జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, అరుదైన సందర్భాల్లో పురుగుమందుల కలుషితానికి గురైన కీరదోసలను తినడం వల్ల వికారం, వాంతులు వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి. అలాగే అడవి రకాల కీరదోసకాయల్లో కుకుర్బిటాసిన్స్ అనే విషపూరిత సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి కీరదోసకు తీవ్రమైన చేదు రుచిని ఇవ్వడమే కాకుండా జీర్ణాశయ సమస్యలను కూడా కలిగిస్తాయి.
జీర్ణ వ్యవస్థ సున్నితంగా ఉంటే..
దీప్తి ఖటూజా తెలిపిన ప్రకారం, కొందరికి కీరదోస తిన్న తర్వాత జీర్ణ సంబంధిత అసౌకర్యాలు కనిపిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్, కుకుర్బిటాసిన్స్ కారణంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉండే వారు ఎక్కువ పరిమాణంలో కీరదోసను లేదా తొక్కతో సహా తిన్నప్పుడు ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కీరదోస అసాధారణంగా చేదుగా అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం కుకుర్బిటాసిన్స్ అధిక స్థాయిలో ఉండటమే. సాధారణంగా చిన్న మోతాదులో ఇవి హానికరం కావు. అయితే చాలా చేదుగా ఉన్న కీరదోసను తింటే వికారం, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఎక్కువ చేదు రుచి ఉన్న కీరదోసలను తినకుండా పారేయడం మంచిదని సూచిస్తున్నారు.
సరిగ్గా శుభ్రం చేయాలి..
ఇతర పచ్చి కూరగాయల మాదిరిగానే కీరదోసను కూడా సరైన విధంగా కడగకపోతే, నిల్వ చేయకపోతే లేదా నిర్వహించకపోతే హానికరమైన బ్యాక్టీరియాతో కలుషితం అవుతాయి. ముఖ్యంగా సాల్మొనెల్లా, ఇ.కోలి వంటి బ్యాక్టీరియా తాజా కూరగాయలపై ఉండే అవకాశం ఉంటుంది. కలుషితమైన దోసకాయలను తింటే పలు లక్షణాలు కనిపిస్తాయి. విరేచనాలు, జ్వరం, వాంతులు, కడుపు మంట లేదా నొప్పి, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కీరదోసలను తినే ముందు బాగా కడగడం ద్వారా ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కీరదోస వల్ల అలర్జీ రావడం చాలా అరుదు. అయితే పుప్పొడి అలర్జీలు ఉన్నవారిలో ఈ ప్రమాదం కొంత ఎక్కువగా ఉంటుంది. నోరు లేదా గొంతులో దురదగా అనిపించడం, పెదవులు లేదా నాలుక వాపు ఏర్పడడం, గొంతు చికాకు, చర్మంపై దద్దుర్లు, జీర్ణ అసౌకర్యం వంటి సమస్యలు వస్తే అలాంటి వారు కీరదోసను తినకూడదు. తీవ్రమైన అలర్జీ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఈ సూచనలు పాటించాలి..
కీరదోసలో నీటి శాతం అధికంగా ఉండటంతోపాటు స్వల్ప సహజ డయూరెటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఎక్కువ మొత్తంలో కీరదోసను తింటే మూత్ర విసర్జన తరచూ జరుగుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతులైన వ్యక్తులకు ఇది సమస్య కాదు. అయితే కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా ద్రవాల వినియోగాన్ని పరిమితం చేయాలని వైద్యులు సూచించినవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కీరదోస వల్ల కలిగే ఇబ్బందులను నివారించడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. తినే ముందు కీరదోసలను బాగా కడగాలి. శుభ్రమైన, చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి. అసాధారణంగా చేదుగా ఉన్న కాయలను తినకూడదు. సమతుల్య ఆహారంలో భాగంగా మితంగా తీసుకోవాలి. జీర్ణ సమస్యలు ఉన్నవారు తొక్క తీసి తినడం మంచిది. కీరదోస చాలా మందికి సురక్షితమైన, శరీరానికి తేమను అందించే పోషకాహారం. అయితే కొన్ని సందర్భాల్లో జీర్ణ సమస్యలు, అలర్జీ ప్రతిచర్యలు లేదా కలుషితమైనప్పుడు ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయి. సరైన ఆహార భద్రతా నియమాలను పాటించడం, శరీరం ఎలా స్పందిస్తుందో గమనించడం ద్వారా కీరదోస ఆరోగ్య ప్రయోజనాలను సురక్షితంగా పొందవచ్చు.
తాజావార్తలు
- ●Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ - సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?
- ●Pak High Commission | దెబ్బకు దెబ్బ.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూల్చివేతలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..

Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ - సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?

Pak High Commission | దెబ్బకు దెబ్బ.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూల్చివేతలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?






