Pani Puri | పానీపూరీ తిని 18 మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత..
Pani Puri | రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండలంలోని విషాదం చోటుచేసుకుంది. పానీపూరీ (Pani Puri) తిని 18 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Pani Puri | త్రినేత్ర.న్యూస్: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండలంలోని విషాదం చోటుచేసుకుంది. పానీపూరీ (Pani Puri) తిని 18 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్ నగర్ కాలనీకి (KCR Nagar) చెందిన చిన్నారులు స్థానికంగా ఉన్న పానీపూరి బండి వద్ద పానీపూరి తిన్నారు. కాసేపటికే కొందరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కొందరు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా.. మరి కొందరు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు తరలించారు.
వారిలో రిషికేశ్ అనే బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో ఫిట్స్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మిగతా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, చిన్నారులందరికీ ఒకే తరహా లక్షణాలు కనిపించడంతో ఆహారం కలుషితమై (Food Poisoning) ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వారి అనారోగ్యానికి గల అసలు కారణాలను నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
- ●BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
- ●Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
- ●Horoscope | ఆగస్టు 19 రాశిఫలాలు.. ఈ రాశివారు మోసపోయే అవకాశం!
- ●Bariatric Surgery Delhi | 16 ఏళ్లకే 275 కిలోల బరువు.. కారులో పట్టక వ్యాన్‌లో ఆసుపత్రికి: ఢిల్లీ బాలుడికి అరుదైన సర్జరీ
- ●PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!
- ●National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు

BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Horoscope | ఆగస్టు 19 రాశిఫలాలు.. ఈ రాశివారు మోసపోయే అవకాశం!

Bariatric Surgery Delhi | 16 ఏళ్లకే 275 కిలోల బరువు.. కారులో పట్టక వ్యాన్‌లో ఆసుపత్రికి: ఢిల్లీ బాలుడికి అరుదైన సర్జరీ






