Restaurant Food | రెస్టారెంట్ ఫుడ్ తిని ఐదేండ్ల చిన్నారి మృతి.. దవాఖానలో మరో నలుగురు
Restaurant Food | రెస్టారెంట్ నుంచి తెచ్చిన ఆహారం (Restaurant Food) తిని ఓ చిన్నారి మృతిచెందగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Restaurant Food | త్రినేత్ర.న్యూస్: రెస్టారెంట్ నుంచి తెచ్చిన ఆహారం (Restaurant Food) తిని ఓ చిన్నారి మృతిచెందగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో (Surat) చోటుచేసుకుంది.
అశోక్‌భాయ్ కల్సారియా కుటుంబం సూరత్ సిటీలోని రానుజంధమ్ సొసైటీలో నివసిస్తున్నది. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ నెల 16న రాత్రి నగరంలోని శీతల్ రెస్టారెంట్‌లో (Sheetal Restaurant) కాజు పనీర్ కూర (Kaju Paneer Curry) పార్సిల్ తీసుకున్నారు. దానితో కుటుంబం అంతా కలిసి రాత్రి భోజనం చేశారు. మరుసటి రోజు ఉదయం 9 గంటల సమయంలో అశోక్‌తోపాటు ఆయన కుమార్తె ఆర్య (5) కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో ఆమెకు స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌లో చికిత్స అందించారు. ఆ తర్వాత వారి పరిస్థితి విషమించింది. అనంతరం మిగిలిన కుటుంబ సభ్యులు కూడా అస్వస్థతకు గురయ్యారు.
దీంతో వారిని నగరంలోని సద్విచార్ దవాఖానకు తరలించారు. వారికి ఎమర్జెన్సీ రూమ్‌లో చికిత్స అందించారు. ఈ క్రమంలో 15 నుంచి 20 నిమిషాల్లోనే ఆర్య మృతిచెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అశోక్‌తోపాటు ఆయన భార్య, ఇద్దరు కూతుర్లు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ (Food Poisoning) కారణంగా ఆర్య మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు.
కాగా, ఈ ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి ప్రఫుల్ పణషేరియా విచారణకు ఆదేశించారు. అస్వస్థతకు గురైన ఆర్య కుటుంబ సభ్యులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. శీతల్ రెస్టారెంట్‌ను వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కారకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మున్సిపల్, జిల్లా హెల్త్ అధికారులకు స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 30 మంది కార్మికులు సజీవసమాధి
- ●BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
- ●Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
- ●Horoscope | ఆగస్టు 19 రాశిఫలాలు.. ఈ రాశివారు మోసపోయే అవకాశం!
- ●Bariatric Surgery Delhi | 16 ఏళ్లకే 275 కిలోల బరువు.. కారులో పట్టక వ్యాన్‌లో ఆసుపత్రికి: ఢిల్లీ బాలుడికి అరుదైన సర్జరీ
- ●PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!

Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 30 మంది కార్మికులు సజీవసమాధి

BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Horoscope | ఆగస్టు 19 రాశిఫలాలు.. ఈ రాశివారు మోసపోయే అవకాశం!






