Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..
Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అనే పదాలను చాలా మంది ఒకే అర్థంలో ఉపయోగిస్తుంటారు. అయితే వైద్యపరంగా ఈ రెండూ పూర్తిగా వేర్వేరు అత్యవసర పరిస్థితులు. ఒకదానిలో గుండెకు రక్త సరఫరా ఆగిపోవడం వల్ల గుండె కండరాలు దెబ్బతింటే, మరొకదానిలో గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోతుంది.
Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అనే పదాలను చాలా మంది ఒకే అర్థంలో ఉపయోగిస్తుంటారు. అయితే వైద్యపరంగా ఈ రెండూ పూర్తిగా వేర్వేరు అత్యవసర పరిస్థితులు. ఒకదానిలో గుండెకు రక్త సరఫరా ఆగిపోవడం వల్ల గుండె కండరాలు దెబ్బతింటే, మరొకదానిలో గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోతుంది. ఈ రెండు పరిస్థితుల మధ్య ఉన్న తేడాలను తెలుసుకోవడం అత్యంత కీలకం. ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ కూడా రెండింటికి వేర్వేరుగా ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. హార్ట్ అటాక్ సమయంలో గుండెకు రక్తాన్ని అందించే ధమని (ఆర్టరీ) బ్లాక్ అవుతుంది. దీంతో గుండెలోని ఒక భాగానికి రక్తప్రసరణ ఆగిపోతుంది. ఆ బ్లాకేజీని వీలైనంత త్వరగా తొలగించకపోతే ఆ భాగంలోని గుండె కండరాలు చనిపోతాయి. మరోవైపు కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెలోని విద్యుత్ వ్యవస్థలో అకస్మాత్తుగా లోపం ఏర్పడటం వల్ల సంభవిస్తుంది. దీనివల్ల గుండె లయ తప్పి (అరిత్మియా) ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోతుంది. ఈ రెండు పరిస్థితులను ప్రారంభ దశలోనే గుర్తించడం రోగి ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
రెండూ వేర్వేరు..
ఈ అంశంపై ఫరీదాబాద్‌లోని సర్వోదయ హాస్పిటల్ సెక్టార్ 8 ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అసోసియేట్ డైరెక్టర్, హెడ్ డాక్టర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అనే పదాలను చాలామంది ఒకటిగానే భావిస్తారని, కానీ ఇవి పూర్తిగా భిన్నమైన వైద్య అత్యవసర పరిస్థితులని తెలిపారు. వీటి మధ్య తేడాను తెలుసుకోవడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెంటనే వైద్య సహాయం అవసరమే అయినప్పటికీ, చికిత్స అందే సమయం ఆధారంగా కోలుకునే అవకాశాలు మారుతాయి. కానీ కార్డియాక్ అరెస్ట్‌లో మాత్రం నిమిషాల వ్యవధిలోనే వైద్య సహాయం అందకపోతే ప్రాణాపాయం తప్పదు. తీవ్రమైన హార్ట్ అటాక్ తర్వాత కొంతమందిలో కార్డియాక్ అరెస్ట్ కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రతి హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్‌కు దారితీయదు.

తేడా ఏమిటి..?
హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని పెంచే వైద్య పరిస్థితులకు కార్డియోమయోపతి, హార్ట్ ఫెయిల్యూర్, ముఖ్యంగా వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ తదితర అరిత్మియాలు, పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, ఇన్‌ఫెక్షన్లు కారణమవుతాయి. డాక్టర్ అమిత్ కుమార్ వివరించిన ప్రకారం హార్ట్ అటాక్‌కు ప్రధాన కారణం గుండె కండరాలకు రక్తప్రసరణను అడ్డుకునే బ్లాకేజీ. కార్డియాక్ అరెస్ట్ మాత్రం గుండెలో విద్యుత్ వ్యవస్థలో ఏర్పడే లోపం వల్ల గుండె సమర్థవంతంగా కొట్టుకోలేని పరిస్థితి. కొన్నిసార్లు హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్‌కు కారణమవుతుందని, కానీ ప్రతి హార్ట్ అటాక్ అలా మారదని తెలిపారు. గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. దీనిని వైద్యపరంగా మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ అంటారు. ప్రారంభ లక్షణాలను గుర్తించడం ద్వారా గుండె పనితీరును కాపాడే అవకాశం ఉంటుంది. పురుషులు, మహిళల్లో హార్ట్ అటాక్ లక్షణాలు కొంత భిన్నంగా ఉంటాయి. కొందరిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా సైలెంట్ హార్ట్ అటాక్ కూడా సంభవిస్తుంది.
హార్ట్ ఎటాక్ వస్తే..
డాక్టర్ అమిత్ కుమార్ తెలిపిన ప్రకారం హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి సాధారణంగా స్పృహతోనే ఉంటాడు. తీవ్రమైన ఛాతి నొప్పి లేదా ఒత్తిడి, ఎడమ చేయి, దవడ, మెడ లేదా వెన్నుకు నొప్పి వ్యాపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, చెమటలు పట్టడం, తల తిరగడం లేదా కారణం లేకుండా తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి, చేయి, దవడ, మెడ లేదా వెన్నుకు వ్యాపించే నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లని చెమటలు, వికారం, తల తిరగడం కూడా ప్రధాన లక్షణాలే. మహిళలు, వృద్ధులు, మధుమేహంతో బాధపడేవారిలో సాధారణ లక్షణాలు కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయని డాక్టర్ కుమార్ తెలిపారు. వీరిలో అజీర్తి, అసాధారణ అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం అత్యవసరం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ఛాతి మధ్యలో అసౌకర్యం, ఒత్తిడి, బిగుతు లేదా నొప్పి కొన్ని నిమిషాల పాటు ఉంటుంది, లేదా తగ్గి మళ్లీ వస్తుంది. చేయి లేదా రెండు చేతులు, వెన్ను, మెడ, దవడ, కడుపులో నొప్పి లేదా అసౌకర్యం కనిపిస్తాయి. ఛాతి నొప్పి ఉన్నా లేకపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. చల్లని చెమటలు, వికారం, తల తిరగడం కూడా ఇతర ముఖ్య లక్షణాలు.

కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వారిలో..
గుండెలో విద్యుత్ వ్యవస్థలో అకస్మాత్తుగా లోపం ఏర్పడి గుండె కొట్టుకోవడం ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. గుండె రక్తాన్ని పంపించలేకపోవడంతో శరీరమంతా రక్తప్రసరణ ఆగిపోతుంది. దీంతో వ్యక్తి వెంటనే స్పృహ కోల్పోతాడు. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి. తక్షణ వైద్య సహాయం అందకపోతే మరణించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, పల్స్ లేకపోవడం, శ్వాస లేకపోవడం లేదా గాలిని మాత్రమే పీల్చేలా గ్యాస్పింగ్ చేయడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డాక్టర్ అమిత్ కుమార్ ప్రకారం ఇలాంటి పరిస్థితి అనుమానం వచ్చిన వెంటనే అత్యవసర వైద్య సేవలకు కాల్ చేయాలి. రోగిని ప్రశాంతంగా ఉంచి, వీలైతే సౌకర్యంగా కూర్చోబెట్టాలి. అయితే కార్డియాక్ అరెస్ట్‌లో వ్యక్తి స్పృహ కోల్పోతే వెంటనే సీపీఆర్ ప్రారంభించడం అత్యంత అవసరం.
అత్యవసర వైద్య చికిత్స అవసరం..
హార్ట్ అటాక్‌లో సమస్య రక్తప్రసరణలో ఏర్పడుతుంది. కార్డియాక్ అరెస్ట్‌లో గుండె విద్యుత్ వ్యవస్థలో లోపం ప్రధాన కారణం. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి సాధారణంగా స్పృహలో ఉంటాడు. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వ్యక్తి మాత్రం వెంటనే స్పృహ కోల్పోయి స్పందించకుండా పడిపోతారు. రెండు పరిస్థితుల్లోనూ అత్యవసర వైద్య చికిత్స అవసరం. అయితే కార్డియాక్ అరెస్ట్‌లో ప్రతి నిమిషం అత్యంత కీలకం. ఆలస్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. అయితే తీవ్రమైన హార్ట్ అటాక్ తర్వాత గుండె సహజ లయ దెబ్బతింటే కార్డియాక్ అరెస్ట్ సంభవించే అవకాశం ఉంటుంది. తీవ్రమైన గుండె వ్యాధులతో బాధపడేవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

సీపీఆర్ ఎవరికి చేయాలి..
ఇక సీపీఆర్ (కార్డియోపల్మనరీ రీససిటేషన్) కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వ్యక్తికి మాత్రమే అవసరం. గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వెంటనే సీపీఆర్ ప్రారంభించాలి. రోగి స్పందించకపోతే, సాధారణంగా శ్వాస తీసుకోకపోతే, శరీరంలో రక్తప్రసరణ ఉన్నట్లు ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే వెంటనే సీపీఆర్ ప్రారంభించాలి. ముందుగా అత్యవసర వైద్య సేవలకు కాల్ చేయాలి. వైద్య సిబ్బంది వచ్చే వరకు గుండెకు రక్తప్రసరణ కొనసాగేందుకు లోతైన ఛాతి ఒత్తిళ్లు (చెస్ట్ కంప్రెషన్స్) ఇవ్వాలి. వేళ్లను ఒకదానితో ఒకటి బిగించి, ఛాతి మధ్య భాగంలో చేతులను ఉంచి ఒత్తిళ్లు ఇవ్వడం ప్రారంభించాలి. మొదట రోగి భుజాలను తట్టి స్పందిస్తున్నాడో లేదో చూడాలి. పేరుపెట్టి గట్టిగా పిలవాలి. ఆ వెంటనే అత్యవసర వైద్య సేవలకు ఫోన్ చేయాలి. తర్వాత ఛాతి మధ్య భాగంలో బలంగా, వేగంగా నిమిషానికి 100 నుంచి 120 ఒత్తిళ్ల వేగంతో ఛెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలి.
సీపీఆర్‌తో ప్రాణాలను నిలబెట్టవచ్చు..
వైద్య సిబ్బంది వచ్చే వరకు లేదా ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్ (ఏఈడీ) అందుబాటులోకి వచ్చే వరకు సీపీఆర్ కొనసాగించాలి. ఏఈడీ ఉంటే వెంటనే ఆన్ చేసి అందులో వచ్చే వాయిస్ సూచనలను అనుసరించాలని డాక్టర్ అమిత్ కుమార్ సూచించారు. హాస్పిటల్ బయట, ముఖ్యంగా ఇళ్లలో లేదా బహిరంగ ప్రదేశాల్లో అనేక కార్డియాక్ అరెస్ట్‌లు సంభవిస్తాయని, అలాంటి సమయంలో సాధారణ వ్యక్తి చేసే ప్రాథమిక సీపీఆర్ కూడా బాధితుడి ప్రాణాలు నిలబెట్టే అవకాశాలను రెండింతలు లేదా మూడింతలు పెంచుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్రువీకరించిన శిక్షణా కార్యక్రమాల ద్వారా సీపీఆర్ నేర్చుకోవాలని, అత్యవసర సమయంలో ధైర్యంగా స్పందించే సామర్థ్యం ప్రాణాలను కాపాడుతుందని పేర్కొన్నారు.

ఏఈడీ అంటే..
ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్ (ఏఈడీ) గుండె సాధారణ లయను తిరిగి తీసుకురావడానికి నియంత్రిత విద్యుత్ షాక్ ఇస్తుంది. కార్డియాక్ అరెస్ట్ సమయంలో ఇది ప్రాణాలను కాపాడడంలో అత్యంత కీలకమైన పరికరం. ప్రజల భద్రత కోసం అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఏఈడీలు అందుబాటులో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా హై బ్లడ్ ప్రెజర్, మధుమేహం, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం ఉన్నవారికి హార్ట్ అటాక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పటికే గుండె వ్యాధులు ఉన్నవారు, గతంలో హార్ట్ అటాక్ వచ్చినవారు, కార్డియోమయోపతి లేదా తీవ్రమైన అరిత్మియాలతో బాధపడేవారికి కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం అధికంగా ఉంటుంది. ఛాతిలో అసౌకర్యం, అకస్మాత్తుగా మూర్ఛపోవడం, తీవ్రమైన శ్వాస ఇబ్బంది, కారణం లేకుండా గుండె దడ, ఒక్కసారిగా కుప్పకూలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించాలి.
జాగ్రత్తలు అవసరం..
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రక్తపోటును నియంత్రణలో ఉంచడం, మధుమేహాన్ని నియంత్రించడం, ధూమపానం మానేయడం, తగినంత నిద్రపోవడం ద్వారా హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కావు. అయితే ఈ రెండింటికీ అత్యవసర వైద్య చికిత్స అవసరం. లక్షణాలను సకాలంలో గుర్తించి, సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.
సంబంధిత వార్తలు

Trekking in Ananthagiri | అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. హైదరాబాద్‌కు చెందిన టీచర్ మృతి
జులై 12, 2026

Heart Check Up | 35 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా హార్ట్ చెకప్ చేయించుకోవాలి.. కార్డియాలజిస్టు సూచన..
జులై 11, 2026

Bhagyaraj | కోలీవుడ్‌లో విషాదం – దిగ్గజ దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత – గురువు మరణించిన కొద్ది రోజులకే…
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?
- ●Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన
- ●ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు
- ●E20 Janta Party | ప్రధాన్ ఔట్.. గడ్కరీ లోడింగ్.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం తప్పదా..? SMలో E20 జనతా పార్టీ సంచలనం
- ●Drugs | డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించాడు..
- ●Supreme Court | ఆందోళన చేస్తున్నంతమాత్రాన లాఠీఛార్జ్ చేయకూడదు : సుప్రీంకోర్టు

Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?

Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన

ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు

E20 Janta Party | ప్రధాన్ ఔట్.. గడ్కరీ లోడింగ్.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం తప్పదా..? SMలో E20 జనతా పార్టీ సంచలనం



