Heart Check Up | 35 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా హార్ట్ చెకప్ చేయించుకోవాలి.. కార్డియాలజిస్టు సూచన..
Heart Check Up | గుండె ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సమస్య ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయని ప్రముఖ కార్డియాక్ సర్జన్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవి శెట్టి హెచ్చరించారు. శారీరకంగా ఫిట్‌గా కనిపించడం, నిజంగా వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండటానికి సమానం కాదని ఆయన స్పష్టం చేశారు.
Heart Check Up | గుండె ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సమస్య ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయని ప్రముఖ కార్డియాక్ సర్జన్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవి శెట్టి హెచ్చరించారు. శారీరకంగా ఫిట్‌గా కనిపించడం, నిజంగా వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండటానికి సమానం కాదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పురుషులు క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవాలని, అందులో హార్ట్ సీటీ స్కాన్ కూడా ఉండాలని సూచించారు. మధుమేహం లేదా కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు అయితే ఇంకా ముందుగానే పరీక్షలు ప్రారంభించాలని చెప్పారు. ఇటీవల యువ భారతీయుల్లో గుండెపోటుతో మరణాలు పెరగడానికి కారణాలపై స్పందించిన డాక్టర్ దేవి శెట్టి, కరోనరీ ఆర్టరీల్లో బ్లాకేజీలు ఉన్న రోగుల్లో దాదాపు 50 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవని వెల్లడించారు. వీరికి ముందుగా ఛాతి నొప్పి వంటి హెచ్చరికలు లేకుండానే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో గుండెకు సంబంధించిన నొప్పి లేదా ఇతర సంకేతాలు చాలా తక్కువగా ఉంటాయని వివరించారు.
17 ఏళ్ల నుంచే టెస్టులను చేయించుకోవాలి..
ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తూ, మారథాన్‌లో పాల్గొంటూ లేదా సాధారణ రోజువారీ పనులు చేస్తుండగానే కొందరు అకస్మాత్తుగా కుప్పకూలి మరణిస్తున్న సంఘటనలను ప్రస్తావించిన ఆయన, ముందుగానే సాధారణ రక్త పరీక్ష, ఈసీజీ, కార్డియాక్ సీటీ స్కాన్ చేయించుకుని ఉంటే ఇలాంటి అనేక గుండెపోటులను నివారించవచ్చని అన్నారు. ఆరోగ్యంగా కనిపించే వ్యక్తులు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయే సమస్యను పూర్తిగా తగ్గించవచ్చని శెట్టి అభిప్రాయపడ్డారు. అయితే నొప్పి లేదా తీవ్రమైన లక్షణాలు వచ్చే వరకు వైద్యులను కలవడానికి చాలామంది నిరాకరించడం అతిపెద్ద సమస్యగా ఆయన పేర్కొన్నారు. గుండె పరీక్షలు ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై కూడా ఆయన స్పష్టమైన సూచనలు చేశారు. ప్రతి భారతీయుడు 17 ఏళ్ల వయస్సులోనే రక్త పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. ఇది ప్రస్తుతం కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాల్లో భాగమని పేర్కొన్నారు. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసి ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.
35 ఏళ్ల తరువాత రెగ్యులర్‌గా చేయించాలి..
అలాగే 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి పురుషులు క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవడంతోపాటు హార్ట్ సీటీ స్కాన్ కూడా చేయించుకోవాలని సూచించారు. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు 30 ఏళ్లకే పరీక్షలు ప్రారంభించాలని, ఆలస్యం చేయొద్దని అన్నారు. మధుమేహంతో బాధపడేవారు అయితే 30 ఏళ్లకు ముందే పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సంఖ్యలు, ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలు తెలుసుకోవాలని చెప్పారు. హార్ట్ సీటీ స్కాన్ ఫలితాలు సాధారణంగా ఉంటే తర్వాత ఏడు నుంచి పది సంవత్సరాల వరకు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని శెట్టి పేర్కొన్నారు.

హార్ట్ సీటీ స్కాన్ అంటే..
హార్ట్ సీటీ స్కాన్ అంటే శస్త్రచికిత్స అవసరం లేని ఆధునిక ఇమేజింగ్ పరీక్ష. కంప్యూటెడ్ టోమోగ్రఫీ సాంకేతికతతో గుండెతోపాటు దానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల చిత్రాలను స్పష్టంగా తీస్తారు. నివారణాత్మక పరీక్షల్లో ఎక్కువగా చేసే పరీక్షను కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కాన్ లేదా సీఏసీ టెస్ట్, కాల్షియం స్కోర్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ పరీక్షలో గుండెకు రక్తాన్ని అందించే కరోనరీ ఆర్టరీల్లో కాల్షియం నిల్వలు ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తారు. ఈ కాల్షియం నిల్వలను ప్లాక్ పేరుకుపోయిన సంకేతంగా పరిగణిస్తారు. ప్లాక్ ఎక్కువగా ఉండటం వల్ల కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
కాల్షియం స్కోర్‌ను బట్టి హెచ్చరిక..
ఈ పరీక్ష ఫలితాన్ని కాల్షియం స్కోర్ రూపంలో ఇస్తారు. స్కోర్ సున్నా ఉంటే రక్తనాళాల్లో కాల్షియం నిల్వలు కనిపించలేదని, సమీప భవిష్యత్తులో గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉందని భావిస్తారు. స్కోర్ ఎక్కువగా ఉంటే ప్లాక్ పరిమాణం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్యులు అంచనా వేస్తారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, ఒక వ్యక్తికి గుండె జబ్బుల ప్రమాదం స్పష్టంగా అంచనా వేయలేని పరిస్థితుల్లో సీఏసీ పరీక్ష ఫలితాలు వైద్యులకు చికిత్స నిర్ణయాల్లో ఉపయోగపడతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ ను తగ్గించే స్టాటిన్ మందులు అవసరమా లేదా అన్న విషయంలో ఈ పరీక్ష కీలక సమాచారాన్ని అందిస్తుంది.
సంబంధిత వార్తలు

Mobile snatching | విషాదంగా ముగిసిన దొంగతనం.. ఫోన్ కొట్టేసి పారిపోతుండగా గుండెపోటు..
జూన్ 20, 2026

Heart Attack | విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు గుండెపోటు.. టిఫిన్ కోసం వెళ్తుండగా ఘటన
జూన్ 14, 2026

Panic Attack vs Heart Attack | చాతీలో నొప్పి.. హార్ట్ ఎటాకా లేక పానిక్ ఎటాకా? ప్రాణాలు నిలబెట్టే ఈ తేడాలు తెలుసుకోండి!
జూన్ 10, 2026
తాజావార్తలు
- ●Gold ETF | యుద్ధం ప్రభావం ఉన్నా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు తగ్గని ఆదరణ.. భారీగా పెరుగుతున్న పెట్టుబడులు..
- ●Ashwini Vaishnaw | బుల్లెట్ ట్రైన్ హబ్‌గా హైదరాబాద్ : అశ్వినీ వైష్ణవ్
- ●Revanth Reddy | ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచండి
- ●Vietnam Boat Capsize | వియత్నాంలో ఘోర విషాదం: స్పీడ్‌బోట్ బోల్తా.. ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకుల మృతి
- ●Indias 2036 Olympic bid | భారత్ ఒలింపిక్ బిడ్‌కు ఆస్ట్రేలియా మద్దతు
- ●America Visa | విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలంటే ఇక కష్టమే.. మరింత కఠినంగా నిబంధనలు..?

Gold ETF | యుద్ధం ప్రభావం ఉన్నా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు తగ్గని ఆదరణ.. భారీగా పెరుగుతున్న పెట్టుబడులు..

Ashwini Vaishnaw | బుల్లెట్ ట్రైన్ హబ్‌గా హైదరాబాద్ : అశ్వినీ వైష్ణవ్

Revanth Reddy | ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచండి

Vietnam Boat Capsize | వియత్నాంలో ఘోర విషాదం: స్పీడ్‌బోట్ బోల్తా.. ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకుల మృతి



