త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drugs | డ్రగ్స్‌ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించాడు..

Drugs | డ్ర‌గ్స్ మ‌త్తులో (Drugs) ఓ యువ‌కుడు ఉన్మాదిలా ప్ర‌వ‌ర్తించాడు. త‌నిఖీల్లో భాగంగా కారును ఆపేందుకు ప్ర‌య‌త్నించిన పోలీసుల‌పైకి పోనించాడు. దీంతో ఓ కానిస్టేబుల్ కాలు విర‌గ‌గా, మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు.

G

Hyderabad | Published On Jul 27, 2026, 12.13 pm IST

Drugs | డ్రగ్స్‌ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించాడు..
Advertisement

Drugs | త్రినేత్ర‌.న్యూస్‌: డ్ర‌గ్స్ మ‌త్తులో (Drugs) ఓ యువ‌కుడు ఉన్మాదిలా ప్ర‌వ‌ర్తించాడు. త‌నిఖీల్లో భాగంగా కారును ఆపేందుకు ప్ర‌య‌త్నించిన పోలీసుల‌పైకి పోనించాడు. దీంతో ఓ కానిస్టేబుల్ కాలు విర‌గ‌గా, మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని అబిడ్స్‌లో (Abdis) జ‌రిగింది.

ఆదివారం మ‌ధ్యాహ్నం అబిడ్స్ ప్రాంతంలో డ్ర‌గ్స్ కొనుగోలుకు సంబంధించి హెచ్‌-న్యూ పోలీసుల‌కు (H-NEW Police) స‌మాచారం అందింది. దీంతో హెచ్‌-న్యూ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీకాంత్ త‌మ సిబ్బందితో క‌లిసి అబిడ్స్‌లో త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో హుస్సేనీ ఆల‌మ్‌కు సైఫ్ అనే వ్య‌క్తి పాయల్ ఫుట్‌వేర్ వ‌ద్ద‌కు కారులో వ‌చ్చాడు. మ‌రో వ్య‌క్తి అత‌నికి డ్ర‌గ్స్ ప్యాకెట్ ఇచ్చాడు. గుర్తించిన పోలీసులు ప్యాకెట్‌ అందించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే కారులో ఉన్న సైఫ్‌ను కిందికి దిగాలని పోలీసులు సూచించారు. దీంతో అతడు బ‌య‌ట‌కు రాకుండా.. కారును ప‌క్క‌కు తీస్తున్న‌ట్లు న‌టించి ఒక్క‌సారిగా రివ‌ర్స్ చేసి త‌ప్పించుకునేందుకు య‌త్నించాడు. అడ్డుకోబోయిన పోలీసుల‌పై కారును ఎక్కించాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ మహేందర్ యాద‌వ్ కాలుపై నుంచి కారు పోవ‌డంతో ఫ్రాక్చ‌ర్ అయింది. మ‌రో కానిస్టేబుల్, సీఐకి గాయాల‌య్యాయి. కాగా, సైఫ్‌ను వెంబ‌డించిన పోలీసులు అఫ్జల్‌గంజ్‌ వద్ద పట్టుకున్నారు. కానిస్టేబుల్ మ‌హేంద‌ర్ ఫిర్యాదుతో నిందితుడిపై అబిడ్స్‌, అఫ్జ‌ల్‌గంజ్ పోలీసులు హ‌త్యాయ‌త్నం కేసులు నమోదుచేశారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement