త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trekking in Ananthagiri | అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. హైద‌రాబాద్‌కు చెందిన టీచ‌ర్ మృతి

Trekking in Ananthagiri | వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి అట‌వీ ప్రాంతం అర్బన్ పార్క్ ట్రెక్కింగ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ప్రియ (47) అనే మహిళ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.

S

Telangana | Published On Jul 12, 2026, 4.58 pm IST

Trekking in Ananthagiri | అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. హైద‌రాబాద్‌కు చెందిన టీచ‌ర్ మృతి
Advertisement

Trekking in Ananthagiri | త్రినేత్ర‌.న్యూస్‌: వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి అట‌వీ ప్రాంతం అర్బన్ పార్క్ ట్రెక్కింగ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ప్రియ (47) అనే మహిళ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. ట్రెక్కింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆమె చ‌నిపోయిన‌ట్లు నిర్ధారించారు.

అనంతగిరి అటవీ శాఖ అర్బన్ పార్క్ నుంచి ట్రెక్కింగ్ పాయింట్ వాచ్ టవర్ సమీపంలో ప్రియా ట్రెక్కింగ్ చేస్తోంది. ఈ స‌మ‌యంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆమె బంధువులు వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది ఆటోలో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించ‌గా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతురాలు హైదరాబాద్‌కు చెందిన వ్య‌క్తి అని.. ఆమె టీచర్‌గా పనిచేస్తున్నట్లు ప్రాథ‌మికంగా తెలిసింది.

 

Advertisement
Advertisement