ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అసిస్టెంట్, యూడీసీ (UDC), స్టెనోగ్రాఫర్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (JPA) ఉద్యోగాల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ICRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ISRO | త్రినేత్ర.న్యూస్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అసిస్టెంట్, యూడీసీ (UDC), స్టెనోగ్రాఫర్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (JPA) ఉద్యోగాల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ICRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 244 పోస్టుల భర్తీకి దరకాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హులైనవారు www.isro.gov.in వెబ్‌సైట్‌లో ఆగస్టు 16 వరకు దరకాస్తు చేసుకోచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హైదరాబాద్‌లో 15 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 244
ఇందులో అసిస్టెంట్ 133 (హైదరాబాద్‌లో 13), జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 81 (హైదరాబాద్‌లో 2), అప్పర్ డివిజన్ క్లర్క్ 22, స్టెనోగ్రాఫర్ 10, అసిస్టెంట్ 17, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 1 చొప్పున ఉన్నాయి.
అర్హత: అసిస్టెంట్ ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌లో ప్రావీణ్యత తప్పనిసరి. జేపీఏ, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో డిగ్రీ, టైపిస్టు లేదా స్టెనోగా ఏడాది పనిచేసిన అనుభవం, గంటకు 60 పదాల వేగంతో ఇంగ్లిష్‌లో టైప్ చేయగలగాలి. ఆగస్టు 16 నాటికి 28 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా..
రాతపరీక్ష.. అసిస్టెంట్, యూడీసీ ఉద్యోగాలకు 200 ప్రశ్నలు అండుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. 150 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి. జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నల చొప్పున అడుగుతారు.
జేపీఏ, స్టెనోగ్రాఫర్ పోస్టులకు- ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ నుంచి 100 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. 150 నిమిషాల్లో పరీక్ష రాయాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
స్కిల్‌టెస్ట్: అసిస్టెంట్, యూడీసీ ఉద్యోగాలకు కంప్యూటర్ లిటరసీ టెస్ట్ (ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్‌పాయింట్), జేపీఏ, స్టెనోగ్రాఫర్ పోస్టులకు కంప్యూటర్ లిటరసీ టెస్ట్ + స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000
దరఖాస్తులు ప్రారంభం: జూలై 27
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16
వెబ్‌సైట్: www.isro.gov.in
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
తాజావార్తలు
- ●Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..
- ●E20 Janta Party | ప్రధాన్ ఔట్.. గడ్కరీ లోడింగ్.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం తప్పదా..? SMలో E20 జనతా పార్టీ సంచలనం
- ●Drugs | డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించాడు..
- ●Supreme Court | ఆందోళన చేస్తున్నంతమాత్రాన లాఠీఛార్జ్ చేయకూడదు : సుప్రీంకోర్టు
- ●Income Tax Return | ఐటీఆర్ ఫైల్ చేశారా.. వెరిఫికేషన్‌కు మరో 30 రోజులే గడువు..
- ●Sreelekha Mitra | ప్రధాని మోదీపై అభ్యంతరకరమైన పోస్టర్.. బెంగాలీ నటిపై కేసు

Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..

E20 Janta Party | ప్రధాన్ ఔట్.. గడ్కరీ లోడింగ్.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం తప్పదా..? SMలో E20 జనతా పార్టీ సంచలనం

Drugs | డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించాడు..

Supreme Court | ఆందోళన చేస్తున్నంతమాత్రాన లాఠీఛార్జ్ చేయకూడదు : సుప్రీంకోర్టు





