త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fennel Seeds Water | బ‌రువు త‌గ్గేందుకు, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు.. సోంపు గింజ‌ల నీళ్లు.. ఇంకా ఎన్నో లాభాలు..!

Fennel Seeds Water | భోజ‌నం చేసిన అనంత‌రం చాలా మందికి సోంపు గింజ‌ల‌ను తినే అల‌వాటు ఉంటుంది. రెస్టారెంట్ల‌లో లేదా ఇంట్లో నాన్ వెజ్ తిన్న‌ప్పుడు సోంపు గింజ‌ల‌ను క‌చ్చితంగా తింటారు. ఈ గింజ‌ల‌ను నోట్లో వేసుకుని న‌మిలి తింటే జీర్ణ క్రియ మెరుగు ప‌డ‌డ‌మే కాకుండా నోటి దుర్వాస‌న తగ్గుతుంద‌ని, నోటికి తాజాద‌నం ల‌భిస్తుంద‌ని విశ్వ‌సిస్తారు.

S

Lifestyle | Published On Jan 7, 2026, 8.47 am IST

Fennel Seeds Water | బ‌రువు త‌గ్గేందుకు, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు.. సోంపు గింజ‌ల నీళ్లు.. ఇంకా ఎన్నో లాభాలు..!
Advertisement

Fennel Seeds Water | భోజ‌నం చేసిన అనంత‌రం చాలా మందికి సోంపు గింజ‌ల‌ను తినే అల‌వాటు ఉంటుంది. రెస్టారెంట్ల‌లో లేదా ఇంట్లో నాన్ వెజ్ తిన్న‌ప్పుడు సోంపు గింజ‌ల‌ను క‌చ్చితంగా తింటారు. ఈ గింజ‌ల‌ను నోట్లో వేసుకుని న‌మిలి తింటే జీర్ణ క్రియ మెరుగు ప‌డ‌డ‌మే కాకుండా నోటి దుర్వాస‌న తగ్గుతుంద‌ని, నోటికి తాజాద‌నం ల‌భిస్తుంద‌ని విశ్వ‌సిస్తారు. పైగా ఈ గింజ‌లు ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అందుక‌నే చాలా మంది ఈ గింజ‌ల‌ను త‌ర‌చూ తింటుంటారు. అయితే ఇవే కాకుండా సోంపు గింజ‌లు మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయ‌ని గుర్గావ్‌కు చెందిన డైటిషియన్ అర్చ‌నా బాత్రా వెల్ల‌డించారు. సోంపు గింజ‌ల‌తో నీళ్ల‌ను త‌యారు చేసి తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఆమె తెలిపారు. ఈ గింజ‌ల‌ను రాత్రి పూట నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆ నీళ్ల‌ను తాగాల‌ని ఆమె సూచిస్తున్నారు. లేదా సోంపు గింజ‌ల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీళ్ల‌ను కూడా తాగ‌వ‌చ్చ‌ని తెలిపారు. దీంతో అనేక లాభాలు ఉంటాయ‌ని అన్నారు.

జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చెక్‌..

సోంపు గింజ‌ల నీళ్ల‌ను తాగడం వ‌ల్ల అసిడిటీ నుంచి విముక్తి ల‌భిస్తుంది. చాలా మందికి అసిడిటీ స‌మ‌స్య ఉంటుంది. దీని కార‌ణంగా భోజ‌నం కూడా స‌రిగ్గా చేయ‌లేక‌పోతుంటారు. న‌లుగురిలో ఉన్న‌ప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు సోంపు గింజ‌ల నీళ్ల‌ను తాగుతుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ నీళ్ల‌ను తాగితే క‌డుపు ఉబ్బ‌రం త‌గ్గిపోతుంది. గ్యాస్ ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. భోజ‌నం చేశాక కొంద‌రికి ప‌లు కార‌ణాల వల్ల గ్యాస్ వ‌చ్చి పొట్టంతా ఉబ్బ‌రంగా ఉంటుంది. దీంతో చాలా అసౌక‌ర్యానికి గుర‌వుతారు. కానీ సోంపు గింజ‌ల నీళ్ల‌ను తాగితే ఎంతో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే క‌డుపు నొప్పిని తగ్గించ‌డంలోనూ ఈ నీళ్లు ప‌నిచేస్తాయి.

బ‌రువు త‌గ్గేందుకు..

అధికంగా బ‌రువు ఉన్న‌వారు సోంపు గింజ‌ల నీళ్ల‌ను తాగుతుంటే ఎంత‌గానో ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఈ నీళ్లు శ‌రీరంలోని కొవ్వును క‌రిగించ‌డంలో దోహ‌దం చేస్తాయి. శ‌రీరంలో అధికంగా ఉండే ద్ర‌వాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తాయి. దీంతో మెట‌బాలిజం మెరుగుప‌డుతుంది. ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. జీర్ణ‌క్రియ కూడా మెరుగు ప‌డుతుంది. దీంతో కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే ఈ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. శ‌రీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. కిడ్నీల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. కిడ్నీల్లోని వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. కిడ్నీలు క్లీన్ అవుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. పేగుల్లో మ‌లం సుల‌భంగా క‌దులుతుంది. దీంతో మ‌ల విస‌ర్జ‌న‌కు స‌మ‌స్య ఉండ‌దు. అలాగే క‌ళ్ల కింద ఉండే వాపులు సైతం త‌గ్గుతాయి. కళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

హార్మోన్ల స‌మ‌స్య‌ల‌కు..

హార్మోన్ల అస‌మ‌తుల్య‌త ఉన్న‌వారు సోంపు గింజ‌ల నీళ్ల‌ను తాగుతుంటే ఉప‌యోగం ఉంటుంది. పీఎంఎస్ స‌మ‌స్య ఉన్న మ‌హిళ‌లు ఈ నీళ్ల‌ను తాగుతుంటే ఫ‌లితం ఉంటుంది. నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పులు, అసౌక‌ర్యం త‌గ్గుతాయి. మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న, చిరాకు నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప్ర‌శాంతంగా మారుతుంది. మెద‌డు యాక్టివ్‌గా మారి చురుగ్గా ప‌నిచేస్తుంది. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. ఇలా సోంపు గింజ‌ల నీళ్లు మ‌నకు ఎంతో మేలు చేస్తాయ‌ని డైటిషియన్ అర్చ‌నా బాత్రా తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement