త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eggs | కోడిగుడ్లు పాడ‌య్యాయా, లేదా.. సింపుల్ చిట్కాలతో ఇలా గుర్తించండి..!

Eggs | ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక శాతం మంది తింటున్న ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలూ గుడ్ల‌లో ఉంటాయి. క‌నుక‌నే వీటిని సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. కోడిగుడ్ల‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను కూడా చేసి తింటుంటారు.

S

Lifestyle | Published On Jan 5, 2026, 11.02 am IST

Eggs | కోడిగుడ్లు పాడ‌య్యాయా, లేదా.. సింపుల్ చిట్కాలతో ఇలా గుర్తించండి..!
Advertisement

Eggs | ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక శాతం మంది తింటున్న ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలూ గుడ్ల‌లో ఉంటాయి. క‌నుక‌నే వీటిని సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. కోడిగుడ్ల‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను కూడా చేసి తింటుంటారు. మ‌న‌లో చాలా మంది ఎక్కువ శాతం కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి లేదా ఆమ్లెట్ రూపంలో లేదా వివిధ ర‌కాల కూరలుగా చేసి తింటారు. అయితే కోడిగుడ్ల‌ను తిన‌డం బాగానే ఉంటుంది కానీ కొంద‌రు గుడ్లు పాడ‌య్యాయా, లేదా అనే విష‌యం గుర్తించ‌లేరు. దీంతో అలాంటి గుడ్ల‌ను తిని అనారోగ్యాల బారిన ప‌డుతుంటారు. కానీ గుడ్ల‌ను వాడే ముందు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాల్సిందే. దీంతో వాటిపై మ‌న‌కు కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని గుర్తించ‌డం ద్వారా గుడ్లు పాడ‌య్యాయా, లేదా అన్న విష‌యాన్ని సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. దీంతో పాడైన గుడ్ల‌ను వాడ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

తెల్ల‌ని పెంకు ప‌గిలితే..

సాధార‌ణంగా చాలా మంది కిరాణా షాపుల్లో గుడ్ల‌ను కొంటుంటారు. అలాంటి గుడ్ల‌ను లూజ్‌గా విక్ర‌యిస్తారు. క‌నుక వాటికి ప్యాక్ చేసిన లేదా ఎక్స్‌పైరీ తేదీ అంటూ ఉండ‌వు. అలాంటి గుడ్ల‌ను పాడ‌య్యాయా, లేదా అన్న విష‌యం తెలుసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. కనుక వీలైనంత వ‌ర‌కు ప్యాక్ చేసిన గుడ్ల‌ను వాడాలి. వాటిపై గుడ్ల‌ను ప్యాక్ చేసిన తేదీ, ఎక్స్‌పైరీ తేదీ ఉంటాయి. క‌నుక అలాంటి గుడ్ల‌ను సుల‌భంగా వాడుకోవచ్చు. గ‌డువు తేదీ ముగిసే లోపు ఆ గుడ్ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే గుడ్ల‌ను లూజ్‌గా కొనుగోలు చేస్తే మాత్రం కొన్ని ల‌క్ష‌ణాల‌ను గ‌మ‌నించాల్సి ఉంటుంది. అప్పుడే అవి పాడ‌య్యాయా, లేదా అన్న విష‌యం మ‌న‌కు తెలుస్తుంది. ఇక గుడ్ల‌పై ఉండే తెల్ల‌ని పెంకు ఎక్క‌డైనా కాస్త ప‌గిలిన‌ట్లు ఉంటే అలాంటి గుడ్ల‌ను వాడ‌కండి. ఎందుకంటే ప‌గిలిన గుడ్ల‌లోకి బ్యాక్టీరియా సుల‌భంగా ప్ర‌వేశిస్తుంది. అలాంటి గుడ్లు త్వ‌ర‌గా పాడ‌వుతాయి. వాటిని వాడితే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక గుడ్లు ప‌గిలితే వాటిని వాడ‌కూడ‌దు. చిన్న చిన్న ప‌గుళ్లు ఉన్నా కూడా గుడ్ల‌ను వాడ‌కూడ‌దు. దీని వ‌ల్ల ఆరోగ్యాన్ని ర‌క్షించుకోవ‌చ్చు.

గుడ్డును నీటిలో వేస్తే..

కోడిగుడ్ల‌ను సేక‌రించే క్ర‌మంలో వాటిపై కోడి పెంట లేదా బుర‌ద‌, మ‌ట్టి లాంటివి ప‌డి గుడ్ల‌కు అతుక్కుంటాయి. అలా కొన్ని కోడిగుడ్ల‌ను అలాగే ఉంచి మ‌న‌కు విక్ర‌యిస్తారు. కానీ అలాంటి గుడ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ కొన‌కూడ‌దు. అవి పాడ‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాంటి గుడ్ల‌లోకి కూడా బ్యాక్టీరియా సుల‌భంగా ప్ర‌వేశిస్తుంది. క‌నుక ఆ స్థితిలో ఉండే గుడ్ల‌ను కూడా వాడ‌కూడ‌దు. ఇక గుడ్లు పాడయ్యాయా లేదా అనే విష‌యం తెలుసుకునేందుకు ఓ సింపుల్ టెస్టు కూడా ఉంది. అదేమిటంటే.. కోడిగుడ్డును నీటిలో వేస్తే అది మునిగి అడుగు భాగంలో తేలితే ఆ గుడ్డు తాజాగా ఉంద‌ని పాడ‌వ‌లేద‌ని అర్థం చేసుకోవాలి. అదే గుడ్లు పాడైతే వాటిల్లో విష వాయువులు నిండిపోతాయి. ఈ క్ర‌మంలో అలాంటి గుడ్ల‌ను నీటిలో వేస్తే అవి నీటిపై తేలుతాయి. క‌నుక గుడ్లు పాడ‌య్యాయా, లేదా అన్న విష‌యాన్ని ఇట్టే గుర్తించ‌వ‌చ్చు.

వాస‌న కూడా ముఖ్య‌మే..

కోడిగుడ్ల‌ను కొనేట‌ప్పుడు వాటి వాస‌న కూడా చూడాలి. మురిగిన వాస‌న వ‌స్తే అలాంటి గుడ్ల‌ను తీసుకోకూడ‌దు. అలాగే కోడిగుడ్డు తెల్ల‌ని పెంకు కొన్ని సార్లు రంగు మారి పింక్ లేదా గ్రీన్ క‌ల‌ర్‌లో క‌నిపిస్తుంది. అలాంటి గుడ్లు కూడా పాడ‌య్యాయ‌ని అర్థం చేసుకోవాలి. వాటిని కూడా కొనుగోలు చేయ‌కూడ‌దు. అలాగే కోడిగుడ్డులో ఉండే ప‌సుపు ప‌చ్చ సొన గుండ్రంగా దృఢంగా ఉండాలి. ప‌సుపు లేదా నారింజ రంగులో ఉండాలి. అలా కాకుండా రంగు, ఆకారంలో తేడాలు ఉంటే అలాంటి గుడ్ల‌ను పాడైన‌విగా నిర్దారించాలి. ఇక కోడిగుడ్ల‌ను షేక్ చేస్తే అవి కాస్త శ‌బ్దం చేస్తే తాజాగా ఉన్న‌ట్లు నిర్దారించాలి. అలా కాకుండా ఏదైనా ద్ర‌వం ప‌డిన‌ట్లు శ‌బ్దం వ‌స్తే మాత్రం అవి పాడైన‌విగా అర్థం చేసుకోవాలి. అలాంటి కోడిగుడ్ల‌ను కూడా ఉప‌యోగించ‌కూడ‌దు. ఇలా కోడిగుడ్ల తాజాద‌నం, స్వ‌చ్ఛ‌త‌ను గుర్తించి వాటిని వాడుకుంటే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. లేదంటే అనారోగ్యాల బారిన‌ ప‌డాల్సి ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement