త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eggs For Vitamin B12 | కోడిగుడ్ల‌ను ఇలా వండి తినండి.. అధిక మొత్తంలో విట‌మిన్ బి12 ల‌భిస్తుంది..

Eggs For Vitamin B12 | కోడిగుడ్ల‌ను చాలా మంది త‌ర‌చూ ఆహారంలో భాగంగా తింటుంటారు. కోడిగుడ్ల‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు. వీటిని ఉడ‌క‌బెట్టి తింటారు లేదా వివిధ ర‌కాల కూర‌లుగా చేసి తింటారు. అయితే కోడిగుడ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. వాటిల్లో విట‌మిన్ బి12 కూడా ఒక‌టి.

S

Lifestyle | Published On Jan 6, 2026, 7.05 am IST

Eggs For Vitamin B12 | కోడిగుడ్ల‌ను ఇలా వండి తినండి.. అధిక మొత్తంలో విట‌మిన్ బి12 ల‌భిస్తుంది..
Advertisement

Eggs For Vitamin B12 | కోడిగుడ్ల‌ను చాలా మంది త‌ర‌చూ ఆహారంలో భాగంగా తింటుంటారు. కోడిగుడ్ల‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు. వీటిని ఉడ‌క‌బెట్టి తింటారు లేదా వివిధ ర‌కాల కూర‌లుగా చేసి తింటారు. అయితే కోడిగుడ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. వాటిల్లో విట‌మిన్ బి12 కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌లో ఉండే ప‌సుపు ప‌చ్చ సొన‌లోనే విట‌మిన్ బి12 ఉంటుంది. తెల్ల సొన‌లో ఈ విట‌మిన్ ఉండ‌దు. విట‌మిన్ బి12ను మ‌న శ‌రీరం సొంతంగా త‌యారు చేసుకోలేదు. క‌నుక దీన్ని మ‌నం ఆహారాల ద్వారా అందించాల్సిందే. మాంసాహారాల్లో విట‌మిన్ బి12 అధికంగా ఉంటుంది. వాటిల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. అయితే కోడిగుడ్ల‌ను మ‌రీ డీప్ ఫ్రై చేసినా, బాగా ఉడికించినా విట‌మిన్ బి12 కోల్పోవాల్సి వ‌స్తుంది. క‌నుక కోడిగుడ్ల‌ను ప్ర‌త్యేకంగా ఉడికించాల్సి ఉంటుంది. దీంతో విట‌మిన్ బి12 కోల్పోకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి అధిక మొత్తంలో విట‌మిన్ బి12 ల‌భిస్తుంది.

క్రీమ్ మాదిరిగా..

కోడిగుడ్ల‌లో ఉండే విట‌మిన్ బి12ను కోల్పోకుండా ఉండాలంటే అందుకు ప‌లు మార్గాల్లో గుడ్ల‌ను వండి తినాల్సి ఉంటుంది. కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి తిన‌ద‌లిస్తే మ‌రీ బాగా ఉడికే వ‌ర‌కు హార్డ్ బాయిలింగ్ చేయ‌కూడదు. దీని వ‌ల్ల వాటిల్లో ఉండే విట‌మిన్ బి12 చాలా వ‌ర‌కు త‌గ్గిపోతుంది. అలాంట‌ప్పుడు గుడ్ల‌ను తిని కూడా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. క‌నుక కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టే విష‌యంలో ఓ చిన్న జాగ్ర‌త్త పాటించాలి. అదేమిటంటే.. కోడిగుడ్డు సాధార‌ణంగా హార్డ్ బాయిల్‌గా ఉడికేందుకు సుమారుగా 10 నుంచి 15 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. అయితే కోడిగుడ్డును నీటిలో వేసి బాగా ఉడికిస్తారు. కానీ అలా చేయ‌కుండా బాగా మ‌రిగిన నీటిలో గుడ్డును వేయాలి. ఆ త‌రువాత ఆ పాత్ర‌ను స్ట‌వ్‌పై పెట్టి చాలా త‌క్కువ మంట‌తో గుడ్డును ఉడికించాలి. దీంతో 10 నుంచి 15 నిమిషాల్లోగా గుడ్డు ఉడుకుతుంది. కానీ ప‌చ్చ సొన మాత్రం క్రీమ్ మాదిరిగా త‌యార‌వుతుంది. ఇక ఆ స‌మ‌యం త‌రువాత గుడ్డును తీసి చూడాలి. దాని తెల్ల సొన ఉడుకుతుంది. కానీ ప‌చ్చ సొన మాత్రం క్రీమ్‌లా త‌యార‌వుతుంది. అలాంటి గుడ్డును తినాల్సి ఉంటుంది. అలా మీకు కోడిగుడ్డును ఉడికించ‌డం వ‌స్తే ఆ త‌రువాత నుంచి క‌చ్చిత‌మైన స‌మ‌యానికి గుడ్డును తీస్తారు. దీంతో గుడ్డు ఎప్పుడూ అలాగే క్రీమ్ మాదిరిగా ఉంటుంది. ఈ క్ర‌మంలో అలాంటి గుడ్డు ప‌చ్చ సొన‌లో విట‌మిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇలా గుడ్డును ఉడికించి తినాల్సి ఉంటుంది.

పోచింగ్ చేయ‌వ‌చ్చు..

అయితే కోడిగుడ్డులో ప‌చ్చ సొన క్రీమ్ మాదిరిగా ఉంటే కొంద‌రు దాన్ని ఇష్ట‌ప‌డ‌రు. క‌నుక గుడ్ల‌ను పోచింగ్ చేసి తిన‌వ‌చ్చు. అంటే నీళ్ల‌ను మ‌రిగించి ప‌క్క‌న పెట్టాలి. త‌రువాత ఒక గిన్నెలో కోడిగుడ్డును ప‌గ‌ల‌గొట్టాలి. అందులోని సొన‌ల‌ను ముందుగా సిద్ధం చేసుకున్న వేడి నీటిలో వేయాలి. దీంతో రెండు సొన‌లు కాస్త ఉడికి గ‌ట్టిగా మారుతాయి. అప్పుడు గుడ్డు మొత్తాన్ని నీళ్ల నుంచి తీసేయాలి. ఇలా పోచింగ్ చేసిన అనంత‌రం గుడ్ల‌ను తిన‌వ‌చ్చు. ఇలాంటి గుడ్ల‌లోనూ విట‌మిన్ బి12 అధికంగానే ఉంటుంది. అయితే కోడిగుడ్ల‌ను పోచింగ్ చేయ‌డం అంటే కొంద‌రు పెనంపై అత్య‌ధిక హీట్‌తో గుడ్ల‌ను వేయిస్తారు. కానీ అలా చేస్తే వాటిల్లో ఉండే విట‌మిన్ బి12 న‌శిస్తుంది. క‌నుక పైన తెలిపిన విధంగానే కోడిగుడ్ల‌ను పోచింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో విట‌మిన్ బి12ను కోల్పోకుండా అధిక మొత్తంలో పొంద‌వ‌చ్చు.

ఇలా కూడా ఉడికించ‌వ‌చ్చు..

ఇక కోడిగుడ్ల‌ను వేయించి తినేవారు స్ట‌వ్‌ను చాలా స‌న్న‌ని మంట‌పై పెట్టి చాలా త‌క్కువ స‌మ‌యం పాటు పెనంపై ఉంచి వేయించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా గుడ్ల‌లో ఉండే విట‌మిన్ బి12 న‌శించ‌కుండా ఉంటుంది. అలాగే ఇడ్లీల‌ను ఉడికించిన‌ట్లు కోడిగుడ్ల‌ను కూడా ఆవిరి స‌హాయంతో ఉడికిస్తే అప్పుడు కూడా గుడ్ల‌లో ఉండే విట‌మిన్ బి12 న‌శించ‌కుండా ఉంటుంది. ఇలా ప‌లు ర‌కాలుగా కోడిగుడ్ల‌ను ఉడికించి లేదా వేయించి, కూర‌గా చేసుకుని తిన‌వ‌చ్చు. దీంతో విట‌మిన్ బి12ను అధిక మొత్తంలో పొందేందుకు వీలు క‌లుగుతుంది. విట‌మిన్ బి12 లోపం ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement