Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
Eyes Health | కళ్లతో స్పష్టంగా కనిపిస్తే చాలు.. మన కళ్ల ఆరోగ్యం బాగానే ఉందని చాలా మంది భావిస్తుంటారు. కానీ కంటి నిపుణులు మాత్రం దీనిపై హెచ్చరిస్తున్నారు. మంచి విజన్ ఉండటం మాత్రమే కళ్ల ఆరోగ్యానికి సూచిక కాదని చెబుతున్నారు. ముఖ్యంగా డిజిటల్ ప్రపంచంలో రోజువారీ అలవాట్లు తెలియకుండానే కళ్లను నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయని అంటున్నారు.
Eyes Health | కళ్లతో స్పష్టంగా కనిపిస్తే చాలు.. మన కళ్ల ఆరోగ్యం బాగానే ఉందని చాలా మంది భావిస్తుంటారు. కానీ కంటి నిపుణులు మాత్రం దీనిపై హెచ్చరిస్తున్నారు. మంచి విజన్ ఉండటం మాత్రమే కళ్ల ఆరోగ్యానికి సూచిక కాదని చెబుతున్నారు. ముఖ్యంగా డిజిటల్ ప్రపంచంలో రోజువారీ అలవాట్లు తెలియకుండానే కళ్లను నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయని అంటున్నారు. చాలా సార్లు తీవ్రమైన సమస్యలు వచ్చే వరకు ఎలాంటి లక్షణాలు కూడా కనిపించవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యూట్రిషనల్ సైన్స్, ఆల్టర్నేటివ్ మెడిసిన్‌లో నిపుణుడైన లైఫ్‌స్టైల్ గురు లూక్ కౌటిన్యో తన తాజా ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఇదే విషయాన్ని వివరించారు. మన విజన్ పూర్తిగా నార్మల్‌గా ఉండొచ్చని, కానీ ప్రతిరోజూ మన కళ్లను మనం నెమ్మదిగా డ్యామేజ్ చేస్తుండొచ్చని ఆయన పేర్కొన్నారు.
క్రమంగా అధికమవుతున్న కంటి సమస్యలు..
సుదీర్ఘమైన పని గంటల తర్వాత కళ్లలో డ్రైనెస్, స్వల్ప మంట, కళ్లను రుద్దుకోవాలనిపించడం వంటి లక్షణాలను చాలా మంది అలసటగా తీసుకుంటారని చెప్పారు. కానీ అవి సాధారణ అలసట లక్షణాలు మాత్రమే కావని ఆయన హెచ్చరించారు. ఫోకస్ తగ్గినట్టు అనిపించడం, కళ్ల భారంగా మారడం, నిద్రపోయినా పూర్తి విశ్రాంతి లభించకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయని, చాలా మంది వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతారని, కానీ ఇవన్నీ క్రమంగా అధికమవుతూ వస్తుంటాయని తెలిపారు. ఎయిర్ కండిషనర్లు కూడా కళ్లలో డ్రైనెస్ పెరగడానికి ప్రధాన కారణమని ఆయన చెప్పారు. అలాగే చీకట్లో స్క్రీన్‌లను ఎక్కువసేపు చూడటం కళ్లపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని వివరించారు. ఈ ప్రభావం చాలా మందికి గుర్తించలేనంత నెమ్మదిగా ఉంటుందని పేర్కొన్నారు. డైట్ కూడా కళ్ల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని లూక్ కౌటిన్యో తెలిపారు. మన కళ్ల నిర్మాణానికి అవసరమైన పోషకాలు ఆధునిక ఆహారంలో చాలాసార్లు ఉండవని తెలిపారు. రెటీనా సరైన విధంగా పనిచేయడానికి న్యూట్రియెంట్లు అవసరం అని చెప్పారు. ముఖ్యంగా ల్యూటిన్, జియాజాంతిన్, డీహెచ్‌ఏ వంటి పోషకాలు కళ్ల ఆరోగ్యానికి ఎంతో అవసరమని వివరించారు.
డైట్‌ది ముఖ్యపాత్ర..
గుడ్డు పచ్చసొన, ఫ్యాటీ ఫిష్, పాలకూర, పిస్తా, మొక్కజొన్న, గోజి బెర్రీస్ వంటి ఆహారాలు కళ్లకు అవసరమైన నిర్మాణాత్మక మద్దతు ఇస్తాయని చెప్పారు. ఒమేగా-3 తక్కువగా ఉంటే కళ్లలో వచ్చే నీటి నాణ్యత మారుతుందని, కెరోటినాయిడ్లు తగ్గితే లైట్ డ్యామేజ్ నుంచి రక్షణ కూడా తగ్గిపోతుందని వివరించారు. కళ్లపై పడుతున్న స్ట్రెయిన్ యాదృచ్ఛికం కాదని, అది ప్రతిరోజూ క్రమంగా పెరుగుతోందని అన్నారు. ఈ డ్యామేజ్‌ను తగ్గించేందుకు కొన్ని సులభమైన అలవాట్లు పాటించాలని ఆయన సూచించారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడాలని చెప్పారు. దీంతో కళ్లకు రిలాక్సేషన్ లభిస్తుందని వివరించారు. ఉదయం సహజ కాంతిలో కొద్దిసేపు గడపడం వల్ల రెటీనా, బ్రెయిన్ సమతుల్యం అవుతాయని, మంచి నిద్రకు కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు కళ్లకు రిపేర్ జరగదని, చీకట్లో, మంచి నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే కళ్లకు రికవరీ జరుగుతుందని లూక్ కౌటిన్యో చెప్పారు.
20-20-20 రూల్ తప్పనిసరి..
తనకు అత్యంత ఇష్టమైన కంటి వ్యాయామం 20-20-20 రూల్ అని తెలిపారు. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకన్ల పాటు చూడాలని, తర్వాత మళ్లీ పనిలోకి వెళ్లాలని సూచించారు. అలాగే లైట్ ఎక్స్‌పోజర్ తగ్గించడం, పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న సంపూర్ణ ఆహారాలను డైట్‌లో చేర్చడం ద్వారా కళ్ల పనితీరును సమర్థవంతంగా కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mango | మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారా? న్యూట్రిషనిస్టులు చెప్పిన నిజం..
జూన్ 26, 2026

Panic Attack vs Heart Attack | చాతీలో నొప్పి.. హార్ట్ ఎటాకా లేక పానిక్ ఎటాకా? ప్రాణాలు నిలబెట్టే ఈ తేడాలు తెలుసుకోండి!
జూన్ 10, 2026

Liver Protection Supplements | రెగ్యులర్‌గా మందు తాగుతున్నారా? లివర్ పాడవకుండా ఈ 3 సప్లిమెంట్స్ వాడండి!
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●KTR | కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య సదస్సుకు ఆహ్వానం
- ●Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా వాసి మృతి
- ●Free Bus | సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ బస్?
- ●Raashi Khanna | సమంత భర్త బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి రాశీఖన్నా ఔట్ - టాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్
- ●Vikarabad | వికారాబాద్‌లో మహిళ అదృశ్యం.. నారాయణపేటలో సగం కాలిన స్థితిలో మృతదేహం..
- ●Medicover | కంగ్రాట్స్ రేవంత్ రెడ్డిగారు.. రూ.13,200 కోట్లు.. హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు..

KTR | కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య సదస్సుకు ఆహ్వానం

Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా వాసి మృతి

Free Bus | సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ బస్?

Raashi Khanna | సమంత భర్త బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి రాశీఖన్నా ఔట్ - టాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్



