Mango | మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారా? న్యూట్రిషనిస్టులు చెప్పిన నిజం..
Mango | మామిడి సీజన్ వచ్చిందంటే చాలు, తినాలనే కోరిక ఒకవైపు, బరువు పెరుగుతామేమో అన్న భయం మరోవైపు ఉంటుంది. భోజనం తర్వాత చల్లని మామిడి ముక్కలు తినడం నుంచి ఆమ్‌రస్, పూరీలతో ఆస్వాదించడం వరకు మామిడి చాలా మందికి ఇష్టమైన పండు. అయితే ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుందని, మామిడి తింటే లావు అవుతామని చాలామంది భావించి పూర్తిగా దూరంగా ఉంటారు.
Mango | మామిడి సీజన్ వచ్చిందంటే చాలు, తినాలనే కోరిక ఒకవైపు, బరువు పెరుగుతామేమో అన్న భయం మరోవైపు ఉంటుంది. భోజనం తర్వాత చల్లని మామిడి ముక్కలు తినడం నుంచి ఆమ్‌రస్, పూరీలతో ఆస్వాదించడం వరకు మామిడి చాలా మందికి ఇష్టమైన పండు. అయితే ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుందని, మామిడి తింటే లావు అవుతామని చాలామంది భావించి పూర్తిగా దూరంగా ఉంటారు. కానీ నిజంగా మామిడి పండ్ల వల్లే బరువు పెరుగుతారా? లేక సమస్య మరెక్కడైనా ఉంటుందా? ఈ సందేహాలకు న్యూట్రిషనిస్టులు సమాధానం చెప్పారు. మామిడి పండు ఒక్కటే బరువు పెరగడానికి కారణం కాదు. మామిడి మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) కలిగిన పండు. దీని జీఐ విలువ సుమారు 51 నుంచి 60 మధ్య ఉంటుంది. అలాగే చాలా మంది అనుకునేంతగా ఇందులో కేలరీలు కూడా ఉండవు.
ఇలా తీసుకుంటేనే నష్టం..
ఒక మామిడి పండులో ఉండే కేలరీలు సాధారణంగా ఒక వడాపావ్‌లో ఉండే కేలరీల కంటే తక్కువగా ఉంటాయి. వడపావ్‌లో సుమారు 200 నుంచి 350 కేలరీలు ఉంటాయి. మామిడి అంతకంటే తక్కువ కేలరీలతోపాటు ఫైబర్ కూడా సమృద్ధిగా అందిస్తుంది. ఫైబర్ ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచడంతోపాటు జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. అందుకే మామిడిని స్నాక్‌గా, డెజర్ట్‌గా లేదా వర్కౌట్‌కు ముందు తీసుకునే ఆహారంగా కూడా ఉపయోగించవచ్చు. అయితే మామిడి పండును తింటే బరువు పెరుగుతామని చాలా మంది భావించడం వెనుక ఉన్న అసలు కారణం దాని తీపి రుచే అని చెప్పవచ్చు. అలాగే దాన్ని తినే విధానం కూడా కేలరీలపై ఆధారపడి ఉంటుంది. మామిడిని ఆమ్‌రస్, జ్యూస్, షేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు లేదా ఇతర స్వీట్ల రూపంలో తీసుకున్నప్పుడు సమస్య మొదలవుతుంది. ఇలా ప్రాసెస్ చేయడం వల్ల మామిడిలోని ఫైబర్ తగ్గిపోతుంది. దీంతో శరీరంలో చక్కెర వేగంగా శోషణకు గురవుతుంది. అలాగే అదనంగా చక్కెర, పాలు, క్రీమ్ వంటి పదార్థాలు కలపడం వల్ల కేలరీలు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఈ విధంగా తెలియకుండానే అవసరానికి మించి కేలరీలను తీసుకునే అవకాశం ఉంటుంది.
పండుగానే తినాలి..
మామిడిని ఆరోగ్యకరంగా తినాలంటే వీలైనంత వరకు మొత్తం పండుగానే తినాలి. జ్యూస్‌గా చేసుకుని తాగడం కంటే మామిడి ముక్కలుగానే తినడం మంచిది. మామిడితోపాటు కొద్దిగా నట్స్ తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. అలాగే భోజనంతోపాటు లేదా భోజనం తర్వాత కూడా మామిడిని తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల సహజ ఫైబర్ ప్రయోజనాలు అందడంతోపాటు రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా ఉండేందుకు కూడా సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు కూడా పూర్తిగా మామిడికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటే చిన్న పరిమాణంలో మామిడిని తినవచ్చు.
వీటితో కలిపితే ఇంకా మంచిది..
అయితే నట్స్ లేదా మఖానా వంటి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి మామిడి పండ్లను తీసుకుంటే రక్తంలో చక్కెరపై ప్రభావాన్ని కొంత వరకు సమతుల్యం చేయవచ్చు. మామిడి పండు స్వతహాగా బరువు పెరగడానికి కారణం కాదు. దానిని ఏ రూపంలో, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామనేదే కీలకం. సరైన మోతాదులో మొత్తం పండుగానే మామిడిని తీసుకుంటే ఎలాంటి భయం లేకుండా రుచిని ఆస్వాదించవచ్చు.
సంబంధిత వార్తలు

Veeramachineni Ramakrishna | వీఆర్కే డైట్ సృష్టికర్త.. వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు
సెప్టెంబర్ 30, 2026

Type 2 Diabetes | డయాబెటిస్ ఉన్న మహిళలకు మానసిక ఆరోగ్య సమస్యల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ఆగస్టు 27, 2026

Delhi | షాకింగ్ అధ్యయనం.. ఢిల్లీలో ప్రతి 20 మందిలో ఒకరికి షుగర్, బీపీ..
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●MEA | అక్టోబర్ 20న ముంబయిలో జైశంకర్–రూబియో భేటీ!
- ●TGSRTC | భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు!
- ●Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్
- ●Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!
- ●TGSRTC | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!
- ●Sheela Rajkumar | రణబాలిలో అలివేలు - జైలర్ 2లో పార్వతి - రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?

MEA | అక్టోబర్ 20న ముంబయిలో జైశంకర్–రూబియో భేటీ!

TGSRTC | భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు!

Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్

Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!



