త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akhanda 2 OTT Streaming | అఖండ తాండ‌వానికి రెడీ..! బాల‌య్య సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Akhanda 2 OTT Streaming | నంద‌మూరి బాల‌కృష్ట న‌టించిన డివోషనల్ యాక్షన్ డ్రామా అఖండ 2: తాండవం త్వ‌ర‌లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ది. తాజాగా స్ట్రీమింగ్ డేట్‌పై అధికారికంగా స్ప‌ష్ట‌త వ‌చ్చింది. బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ మూవీకి సీక్వెల్ ఇది. సీక్వెల్‌ను భక్తి, యాక్షన్, ఫాంటసీ అంశాలతో రూపొందించారు.

P

Entertainment | Published On Jan 7, 2026, 8.55 pm IST

Akhanda 2 OTT Streaming | అఖండ తాండ‌వానికి రెడీ..! బాల‌య్య సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

అఖండ 2

Advertisement

Akhanda 2 OTT Streaming | నంద‌మూరి బాల‌కృష్ట న‌టించిన డివోషనల్ యాక్షన్ డ్రామా అఖండ 2: తాండవం త్వ‌ర‌లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ది. స్ట్రీమింగ్ డేట్‌పై అధికారికంగా స్ప‌ష్ట‌త వ‌చ్చింది. బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ మూవీకి సీక్వెల్ ఇది. సీక్వెల్‌ను భక్తి, యాక్షన్, ఫాంటసీ అంశాలతో రూపొందించారు.

తేజస్విని నందమూరి సమర్పణలో, 14 రీల్స్ ప్లస్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీ అచంట, ఇషాన్ సక్సెనా నిర్మించారు. ఈ మూవీలో సంయుక్త మీనాన్, ఆది పినిశెట్టి, హర్షల్ మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్, అచ్యుత్ కుమార్, సాయికుమార్, పూర్ణ, హర్ష చెముడు కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ఈ మూవీకి థమన్ అదిరిపోయే సంగీతం అందించగా, తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్ - సంతోష్ దేట్కే సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

అఖండ విజ‌యంతో.. అఖండ 2పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో ఈ మూవీకి వ‌ర‌ల్డ్ వైడ్‌గా దాదాపు రూ.103కోట్ల బిజినెస్ జ‌రిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 104కోట్ల షేర్‌.. అంటే సుమారు రూ.208కోట్లు రాబ‌ట్టాలి. ప్రారంభంలో సినిమాపై ఉన్న బ‌జ్‌.. బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో క‌నిపించ‌లేదు. అదే స‌మ‌యంలో అవ‌తార్‌, దురంధ‌ర్ వంటి సినిమాల కార‌ణంగా మిక్స్‌డ్ టాక్ క‌నిపించింది. మూవీ 26వ రోజు వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా రూ.94.14కోట్ల షేర్‌తో.. సుమారు రూ.111కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. వరల్డ్‌వైడ్‌గా ఇప్పటివరకు దాదాపు 123.35 కోట్ల గ్రాస్ రాబ‌ట్టింది.

ఇదిలా ఉండ‌గా.. 'అఖండ 2' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్ర‌క‌టించిన వివ‌రాల ప్ర‌కారం.. అఖండ 2 : శివ‌తాండ‌వం జ‌న‌వ‌రి 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్ర‌సారం కానుంది. థియేట‌ర్‌లో పెద్ద‌గా విజ‌యాన్ని అందుకోలేక‌పోయినా.. ఓటీటీలోనైనా స‌త్తా చాటుతుందా? లేదా వేచి చూడాల్సిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement