త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raja Saab Movie | ప్ర‌భాస్ రాజాసాబ్ మూవీ టికెట్ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి..!

Raja Saab Movie | యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం ది రాజాసాబ్. ఈ నెల 9న విడుద‌ల కానున్న‌ది. ప్రీమియ‌ర్ షోలు గురువారం సాయంత్రం నుంచే మొద‌లుకానున్నాయి. ఈ మూవీ ప్రీమియర్ షోలకు, టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది.

P

Entertainment | Published On Jan 7, 2026, 9.12 pm IST

Raja Saab Movie | ప్ర‌భాస్ రాజాసాబ్ మూవీ టికెట్ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి..!
Advertisement

Raja Saab Movie | యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం ది రాజాసాబ్. ఈ నెల 9న విడుద‌ల కానున్న‌ది. ప్రీమియ‌ర్ షోలు గురువారం సాయంత్రం నుంచే మొద‌లుకానున్నాయి. ఈ మూవీ ప్రీమియర్ షోలకు, టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. గురువారం సాయంత్రం 6 గంట‌ల‌కు ప్రీమియ‌ర్ షోలు కొన‌సాగ‌నున్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు స్పెషల్ షోలకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్రీమియర్ షోలకు టికెట్ ధర రూ.1000గా నిర్ణ‌యించారు. ఈ నెల 9 నుంచి తొలి 10 రోజులు టికెట్ రేట్లు పెంచుకునే మేక‌ర్స్‌కు ప్ర‌భుత్వం వీలు క‌ల్పించింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్స్‌లో టికెట్‌పై రూ.200 వరకూ పెంచుకునేలా అనుమ‌తులు ఇస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.350 నుంచి రూ.400, మల్టీప్లెక్స్‌లో టికెట్ ధ‌ర రూ.450 నుంచి రూ.550 వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంది. అదే స‌మ‌యంలో రోజుకు ఐదు షోలు వేసేందుకు సైతం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్ర‌య‌ల‌ర్ మ‌రింత అంచ‌నాల‌ను పెంచింది. క‌ల్కి మూవీ త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ హారర్ ఫాంటసీ కామెడీ జాన‌ర్‌లో వ‌స్తున్న ఈ మూవీకి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్‌ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. సంజయ్ దత్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. తమన్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ రూ.300 కోట్ల బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement