త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

woman gave birth to five babies | ఒకే కాన్పులో ఐదుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌

woman gave birth to five babies | చైనాలో వైద్య చరిత్ర‌లోనే అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. 24 ఏళ్ల మ‌హిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చి (woman gave birth to five babies) రికార్డు సృష్టించింది.

D

International | Published On Feb 27, 2026, 4.09 pm IST

woman gave birth to five babies | ఒకే కాన్పులో ఐదుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌
Advertisement

woman gave birth to five babies | చైనాలో వైద్య చరిత్ర‌లోనే అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. 24 ఏళ్ల మ‌హిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చి (woman gave birth to five babies) రికార్డు సృష్టించింది. వాయువ్య చైనా (Central China)లోని జిన్జియాంగ్ (Xinjiang) ఉయ్ఘర్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల దిలీ.. వూహాన్ విశ్వవిద్యాలయానికి (Wuhan University) చెందిన జోంగ్నాన్ ఆసుపత్రిలో డెలివ‌రీ అయ్యింది. ఆమెకు ఒకే కాన్పులో ఐదుగురు పిల్ల‌లు జ‌న్మ‌నిచ్చారు. అందులో ఒక బాబు కాగా, న‌లుగురు ఆడ‌పిల్ల‌లు.

పిల్ల‌లు 870 గ్రాముల నుంచి 1,030 గ్రాముల మ‌ధ్య పుట్టిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఇది అత్యంత అరుదైన ఘ‌ట‌న‌గా పేర్కొన్నారు. త‌ల్లీ, బిడ్డ‌లు క్షేమంగా ఉన్న‌ట్లు తెలిపారు. గురువారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల ప్రాంతంలో దిలీకి స‌ర్జ‌రీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ డెలివ‌రీలో దాదాపు 20 మందికిపైగా వైద్య సిబ్బంది స‌హ‌కారం అందించిన‌ట్లు వివ‌రించారు. కాగా, వైద్య గ‌ణాంకాల ప్ర‌కారం.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలా స‌హ‌జ‌సిద్ధంగా ఒకే కాన్పులో ఐదుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం చాలా అరుదు. ఆరు కోట్ల మందిలో ఒక‌రికి మాత్ర‌మే ఇలా జ‌రుగుతుంది. దీంతో త‌మ కెరీర్‌లో ఇదే అత్యంత అరుదైన ప్ర‌స‌వ‌మ‌ని చీఫ్ డాక్ట‌ర్ తెలిపారు.

Also Read..

మా అధికారుల‌ను ఎవ‌రూ ప్ర‌భావితం చేయ‌లేరు : సుప్రీంకోర్టు

కోల్‌క‌తాను వ‌ణికించిన భారీ భూకంపం.. ప‌రుగులు తీసిన జ‌నం.. VIDEOS

అవినీతి, అరాచకమే.. కాంగ్రెస్ పాలన జోడెడ్లు

Advertisement
Advertisement