Golden Dome | రష్యా, చైనా ముందుకు అమెరికా రక్షణ వ్యవస్థ తుస్సు..! గేమ్ ఛేంజర్‌గా గోల్డెన్ డోమ్..!
Golden Dome | అమెరికా ప్రస్తుత రక్షణ వ్యవస్థ అత్యాధునిక హైపర్‌సోసిక్ మిస్సైల్స్‌ను ఎదుర్కోలేకపోతోందని పెంటగాన్ అధికారులు అంగీకరించారు. ఈ లోటును పూడ్చేందుకు ‘గోల్డెన్ డోమ్’ అనే భారీ రక్షణ ప్రణాళికను అమలు చేయాలని యోచిస్తోంది. ఇందు కోసం 185 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయనుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ప్రాజెక్టుకు తన మద్దతు ప్రకటించారు.
International | Published On Apr 28, 2026, 4.57 pm IST
Golden Dome | అమెరికా డిఫెన్స్ సిస్టమ్‌పై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత రక్షణ వ్యవస్థ చిన్నచిన్న దాడులను మాత్రమే ఎదుర్కోగలదని, హైపర్‌సోనిక్, క్రూయిజ్ మిస్సైల్స్ వంటి అత్యాధునిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కోలేదని పెంటగాన్ అధికారులు అంగీకరించారు. 2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై అమెరికా సెనేట్‌లో జరిగిన చర్చల సందర్భంగా రక్షణ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు సంప్రదాయ రక్షణ వ్యవస్థలను సులభంగా తప్పించుకునే అత్యాధునిక ఆయుధాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయని హెచ్చరించారు.
మారుతున్న పరిస్థితులు..
అమెరికా రక్షణశాఖకు చెందిన మార్క్ జే బెర్కోవిట్జ్ మాట్లాడుతూ.. ప్రస్తుత వ్యవస్థలు ఈ తరహా ముప్పులను దృష్టిలో పెట్టుకుని రూపొందించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా వద్ద భూభాగంపై ఆధారపడిన ఒకే స్థాయి రక్షణ వ్యవస్థ మాత్రమే ఉందని, అది చిన్నదాడులను మాత్రమే నిరోధించగలదని పేర్కొన్నారు. హైపర్‌సోనిక్, క్రూయిజ్ క్షిపణులపై సమర్థవంతమైన రక్షణ లేదని అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు పెరిగాయి. ముఖ్యంగా చైనా హైపర్‌సోనిక్ మిస్సైల్ టెక్నాలజీని వేగంగా అభివృద్ధి చేస్తుండడం అమెరికా రక్షణలో లోటుపాట్లు బయటపడ్డాయి. అమెరికా స్పేస్ ఫోర్స్‌కు చెందిన జనరల్ మైఖేల్ ఎ గెట్లైన్ మాట్లాడుతూ పరిస్థితులు మారిపోయాయని, అమెరికా రక్షణ శక్తి మునుపటిలా బలంగా లేదన్నారు.
185 బిలియన్ డాలర్లతో గోల్డెన్ డోమ్..
ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా ‘గోల్డెన్ డోమ్’ అనే భారీ రక్షణ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువస్తోంది. ఈ ప్రణాళికలో అంతరిక్ష ఆధారిత సెన్సార్ నెట్‌వర్క్ ఏర్పాటు, భూమి-సముద్ర ఆధారిత ఇంటర్‌సెప్టర్ల వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలు, లేజర్ వంటి డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాల వినియోగం వంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ వ్యయం సుమారు 175-185 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.14-15 లక్షల కోట్లు)గా అంచనా. 2028 నాటికి ప్రాథమిక స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు. సుమారు 1.5 ట్రిలియన్ డాలర్లతో రక్షణ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నారు. అయితే, రక్షణ తయారీ రంగంలో బలహీనతలు లేకపోలేదని అధికారులు తెలిపారు.
ప్రాజెక్టుపై వివాదం..
మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ హీత్ ఏ కాలిన్స్ మాట్లాడుతూ గతంలో తక్కువ పెట్టుబడులు పెట్టడంతోనే ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిందని, ఇంటర్‌సెప్టర్ మిస్సైల్స్ తయారీలో లోటు ఉందని చెప్పారు. సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి సమయం పడుతుందన్నారు. భారీ యుద్ధం జరిగితే దీర్ఘకాలికంగా రక్షణ కొనసాగించడం కష్టమవుతుందని తెలిపారు. ఇదే సమయంలో ఈ భారీ ‘గోల్డెన్ డోమ్’ ప్రాజెక్ట్‌పై రాజకీయంగా వివాదాల్లో చిక్కుకుంది. సెనేటర్ ఆంగస్ కింగ్ ఈ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ పర్యవేక్షణ ఎందుకు పరిమితం అవుతుందంటూ ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో సరికొత్త యుద్ధం..
అధికారులు మాత్రం ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని పేర్కొన్నారు. అణుశక్తి దేశాలు చురుగ్గా ఉన్నాయని.. మిస్సైల్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందిందని, సైబర్-ఎలక్ట్రానిక్ యుద్ధం కొత్త ముప్పు పొంచి ఉందని వాదిస్తున్నారు. దాడులను అడ్డుకోవడంతో పాటు వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని యూఎస్ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం అమెరికా రక్షణ వ్యవస్థలో ఏజిస్ వ్యవస్థ కలిగిన నౌకలు, థాడ్, పేట్రియట్ వంటి వ్యవస్థలున్నాయి. వీటితో మల్టిలేయర్ రక్షణ అందిస్తున్నా.. భవిష్యత్ అధునాత ముప్పులను ఎదుర్కోకపోవడచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






