Supreme Court | మా అధికారులను ఎవరూ ప్రభావితం చేయలేరు : సుప్రీంకోర్టు
Supreme Court | బెంగాల్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశంపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదేశాలు ఉల్లంఘించలేవని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
Supreme Court | బెంగాల్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశంపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదేశాలు ఉల్లంఘించలేవని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఏయే పత్రాలను పరిశీలించాలో న్యాయాధికారులకు తామ ఆదేశాలు జారీ చేశామని ధర్మాసనం తెలిపింది. బెంగాల్‌లో వివాదాస్పదంగా మారిన సర్ విధుల్లో ప్రస్తుత, మాజీ జిల్లా న్యాయాధికారులను నియమించాలని కలకత్తా హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. జ్యుడీషియల్ అధికారులకు ఎన్నికల కమిషన్ శిక్షణ మాడ్యూల్‌లు జారీ చేసిందని బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. జ్యుడీషియల్ అధికారులు ఏం అంగీకరించాలి.. ఏం అంగీకరించకూడదో పేర్కొంటో మాడ్యూల్‌ని జారీ చేశారని ఆయన ధర్మాసనానికి తెలిపారు. దీనికి ధర్మసనం స్పందిస్తూ రాష్ట్రానికి కేటాయించిన న్యాయ అధికారులు నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని తాము సహించలేమని, దీన్ని ముగించాలరన్నారు. తమ అధికారుల గురించి తెలుసునని.. వారిని ఎవరూ ప్రభావితం చేయలేరన్నారు. ఏ పత్రాలను పరిశీలించాలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొంది.
తమ ఆదేశాలను ఎవరూ దాటి వెళ్లలేరని జోయ్‌మాల్య బాగ్చి తెలిపారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను దాటి ముందుకు వెళ్లలేవని ధర్మాసనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనతో నిరాశ చెందిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 20న అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో వివాదాస్పద ఓటర్ల జాబితా సర్లో ఎన్నికల కమిషన్‌కు సహాయం చేసేందుకు ప్రస్తుత, మాజీ జిల్లా జ్యుడీషియల్ అధికారులను నియమించాలని కలకత్తా హైకోర్టును ఆదేశించింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






