Paytm | పేటీఎం-వీసా బంఫర్ ఆఫర్.. మెట్రో టిక్కెట్లు, రీచార్జిలపై 50 శాతం డిస్కౌంట్..
Paytm | పేటీఎం వినియోగదారులకు గుడ్ న్యూస్. వీసాతో కలిసి పేటీఎం ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీసా క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగిన అర్హత ఉన్న వినియోగదారులు మెట్రో టికెట్ బుకింగ్స్‌తోపాటు మొబైల్ రీచార్జ్‌లు, విద్యుత్, నీరు, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్, గ్యాస్, ఫాస్ట్‌ట్యాగ్ వంటి చెల్లింపులపై డిస్కౌంట్లు పొందవచ్చు. మెట్రో టికెట్ బుకింగ్స్‌పై అర్హత ఉన్న వీసా కార్డుదారులకు రెండు రకాల ఆఫర్లు లభిస్తాయి.
Paytm | పేటీఎం వినియోగదారులకు గుడ్ న్యూస్. వీసాతో కలిసి పేటీఎం ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీసా క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగిన అర్హత ఉన్న వినియోగదారులు మెట్రో టికెట్ బుకింగ్స్‌తోపాటు మొబైల్ రీచార్జ్‌లు, విద్యుత్, నీరు, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్, గ్యాస్, ఫాస్ట్‌ట్యాగ్ వంటి చెల్లింపులపై డిస్కౌంట్లు పొందవచ్చు. మెట్రో టికెట్ బుకింగ్స్‌పై అర్హత ఉన్న వీసా కార్డుదారులకు రెండు రకాల ఆఫర్లు లభిస్తాయి. 50 శాతం వరకు, గరిష్ఠంగా రూ.50 డిస్కౌంట్ లేదా 25 శాతం వరకు, గరిష్ఠంగా రూ.20 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్లకు కనీస లావాదేవీ విలువ అవసరం లేదు. 50 శాతం డిస్కౌంట్‌ను ఒక్కో కార్డుపై నెలకు రెండు సార్లు, 25 శాతం డిస్కౌంట్‌ను నెలకు ఐదు సార్లు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు రూ.100 విలువైన మెట్రో టికెట్‌ను అర్హత ఉన్న వీసా కార్డుతో బుక్ చేస్తే, 50 శాతం ఆఫర్ కింద రూ.50 తగ్గింపు లభిస్తుంది.
రీచార్జిలు, బిల్లు చెల్లింపులపై..
రీచార్జిలు, బిల్లు చెల్లింపులపై కూడా పేటీఎం ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించింది. వీసా క్లాసిక్ డెబిట్, వీసా ప్లాటినమ్ డెబిట్ కార్డుదారులు రూ.299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన చెల్లింపులపై 10 శాతం డిస్కౌంట్, గరిష్ఠంగా రూ.100 వరకు పొందవచ్చు. వీసా ప్లాటినమ్ క్రెడిట్ కార్డుదారులకు రూ.299 లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులపై 5 శాతం డిస్కౌంట్, గరిష్ఠంగా రూ.100 వరకు లభిస్తుంది. వీసా క్లాసిక్ డెబిట్, వీసా ప్లాటినమ్ డెబిట్ కార్డులతో మొబైల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీచార్జ్‌లు, విద్యుత్, నీరు, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్, గ్యాస్ సిలిండర్, పైప్డ్ గ్యాస్, ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపులపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. వీసా ప్లాటినమ్ క్రెడిట్ కార్డుతో మొబైల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీచార్జ్‌లు, విద్యుత్, నీరు, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్, గ్యాస్ సిలిండర్, పైప్డ్ గ్యాస్ చెల్లింపులపై డిస్కౌంట్ పొందవచ్చు. ఒక్కో వినియోగదారుడు ఒక్కో కార్డుతో నెలకు ఒకసారి ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.
ప్రోమో కోడ్స్ ఇవే..
ఆఫర్ పొందాలంటే పేటీఎం యాప్‌లో సంబంధిత కేటగిరీని ఎంచుకుని, చెల్లింపు సమయంలో అర్హత ఉన్న వీసా కార్డును ఎంచుకోవాలి. అనంతరం సంబంధిత ప్రోమో కోడ్‌ను నమోదు చేసి లావాదేవీని పూర్తి చేయాలి. 50 శాతం మెట్రో ఆఫర్ కోసం వీసా డెబిట్ కార్డుదారులు VISADC50, వీసా క్రెడిట్ కార్డుదారులు VISACC50 కోడ్‌లను ఉపయోగించాలి. 25 శాతం మెట్రో ఆఫర్ కోసం వీసా డెబిట్ కార్డులకు VISADC, వీసా క్రెడిట్ కార్డులకు VISACC కోడ్‌లు వర్తిస్తాయి. వీసా క్లాసిక్ డెబిట్ కార్డు కోసం VISACLASSICDC, వీసా ప్లాటినమ్ డెబిట్ కార్డు కోసం VISAPLATINUMDC, వీసా ప్లాటినమ్ క్రెడిట్ కార్డు కోసం VISAPLATINUMCC ప్రోమో కోడ్‌లను ఉపయోగించాలి. రీచార్జ్, బిల్లు చెల్లింపులపై ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా వినియోగించే చెల్లింపులపై వీసా కార్డుదారులకు అదనపు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యాన్ని పేటీఎం, వీసా ప్రకటించాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Electric Shock | పొలంలో తెగిపడిన కరెండు వైరు.. విద్యుత్ షాక్ రైతు మృతి
- ●RBI Governor | ఎల్‌నినో ఎఫెక్ట్.. రబీ పంటలకు భారీ ముప్పు.. ఆర్బీఐ గవర్నర్ వెల్లడి..
- ●Santhosh Kumar | ఆకలి తీరిన ఆ అమృత ఘడియలో.. జగత్తునే జయించినట్టు!
- ●FIR Against Rahul Gandhi | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన.. రాహుల్, ప్రియాంకపై ఎఫ్ఐఆర్ నమోదు
- ●Detergent Prices Hike | సామాన్యుడికి HUL షాక్.. మరోసారి పెరిగిన సర్ఫులు, సబ్బుల ధరలు
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో తీవ్ర అస్థిరత..

Electric Shock | పొలంలో తెగిపడిన కరెండు వైరు.. విద్యుత్ షాక్ రైతు మృతి

RBI Governor | ఎల్‌నినో ఎఫెక్ట్.. రబీ పంటలకు భారీ ముప్పు.. ఆర్బీఐ గవర్నర్ వెల్లడి..

Santhosh Kumar | ఆకలి తీరిన ఆ అమృత ఘడియలో.. జగత్తునే జయించినట్టు!

FIR Against Rahul Gandhi | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన.. రాహుల్, ప్రియాంకపై ఎఫ్ఐఆర్ నమోదు






