త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Where is Bibi Netanyahu | నెతన్యాహు చేతికి ఆరు వేళ్లు.. చనిపోయిన విషయం తెలియకుండా ఏఐ వీడియో క్రియేట్ చేశారా?

తమ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ హతమార్చడంతో రగిలిపోయిన ఇరాన్.. నెతన్యాహును టార్గెట్ చేసి చంపేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో నెతన్యాహు డెడ్ అనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

J

International | Published On Mar 14, 2026, 8.30 pm IST

Where is Bibi Netanyahu | నెతన్యాహు చేతికి ఆరు వేళ్లు.. చనిపోయిన విషయం తెలియకుండా ఏఐ వీడియో క్రియేట్ చేశారా?
Advertisement

Where is Bibi Netanyahu | ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కీలక మలుపు తీసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ హతమయ్యాక.. ఇజ్రాయెల్ ప్రధానినే టార్గెట్ చేస్తూ ఇరాన్ పలు దాడులు చేసింది. ఆయన్ను హతమార్చడం కోసం టెల్ అవీవ్‌పై భారీ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. కానీ.. ఇజ్రాయెల్ కూడా అదే తరహాలో ఇరాన్‌పై దాడులతో విరుచుకుపడుతోంది. అమెరికా సాయంతో ఇరాన్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈనేపథ్యంలో మార్చి 13న బెంజమిన్ నెతన్యాహు తన సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో జాగ్రత్తగా గమనిస్తే నెతన్యాహు కుడి చేతికి ఆరు వేళ్లు కనిపిస్తాయి. నెటిజన్లు వెంటనే నెతన్యాహుకు ఉన్న ఆరు వేళ్లను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

https://x.com/gigabasedd/status/2032294968103174188

నిజంగా నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నాయా?

ఇజ్రాయెల్ ప్రధానికి ఆరు వేళ్లు ఉన్నాయా? అంటూ ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓవైపు నెతన్యాహు చనిపోయారన్న వార్తలు వస్తుండటంతో ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు ఏఐలో ఎడిట్ చేసిన వీడియోను నెతన్యాహు మాట్లాడుతున్నట్లుగా సృష్టించి సోషల్ మీడియాలో పెట్టారా? నెతన్యాహు చనిపోయారని తెలిస్తే ఇరాన్ గెలిచినట్లే అని భావించి, అమెరికానే కావాలని నెతన్యాహు మరణం గురించి బయటికి తెలియకుండా చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

https://x.com/yzakai/status/2032413004134781334

ఇదే విషయాన్ని ఏఐ చాట్‌బాట్స్‌ను కూడా యూజర్లు అడుగుతున్నారు. ఫ్యాక్ట్ చెక్ చేయాలంటూ అడుగుతున్నారు. దీంతో లేదు.. నెతన్యాహు బతికే ఉన్నారు. ఆయన చనిపోయారనేది అబద్ధ ప్రచారం మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది.

ఓవైపు వీడియోలో ఆరు వేళ్లు కనిపిస్తుండటం, అది ఏఐ ఎడిటెడ్ వీడియోలా స్పష్టంగా కనిపిస్తుండటంతో అసలు ఆయన బతికే ఉన్నారా? లేదా? అనే కన్ఫ్యూజన్ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.

నెతన్యాహును ఇరాన్ మట్టుబెట్టిందా?

తమ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ హతమార్చడంతో రగిలిపోయిన ఇరాన్.. నెతన్యాహును టార్గెట్ చేసి చంపేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో నెతన్యాహు డెడ్ అనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. నెతన్యాహు డెడ్ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. ఈనేపథ్యంలో ఆరు వేళ్లు ఉన్న వీడియో ఆ అనుమానాలను మరింత పెంచింది.

https://x.com/RealCandaceO/status/2032620031767355849

 

Advertisement
Advertisement